MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sonu-sood-acting-megastar-chiranjeevi-movie7f4a624e-d074-44e4-bb3e-045f4211bd14-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sonu-sood-acting-megastar-chiranjeevi-movie7f4a624e-d074-44e4-bb3e-045f4211bd14-415x250-IndiaHerald.jpgసోనూసూద్ ను సినిమాల్లో విలన్ అనే కంటే రియల్ లైఫ్ హీరో అంటేనే అతడికి సెట్ అవుతుందేమో. ఎందుకంటే ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఏ రాజకీయ నాయకులు..సినిమా హీరోలు..మిలియనియర్లు.చేయని సహాయ కార్యక్రమాలను ఒంటరిగా చేస్తున్నాడు. సోనూ సూద్ ను వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా..? లేదంటే ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రావాలన్న ఆశతోనే ఇవన్నీ చేస్తున్నాడా అంటే..నిజానికి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయకపోయినా సోనూ సూద్ పార్టీ టికెట్ పొంది ఇప్పుడు ఖర్చు చేస్తున్న డబ్బునే వాడుకుని ఎన్నికల్లో పోటీ చేసేవాడు. కానీ అలా కాకుండా సొంతడబ్బsonusood;amala akkineni;cinema;degree;hero;central government;partyఆ పిల్లలను ప్రభుత్వమే చదివించాలి : సోనూసూద్ఆ పిల్లలను ప్రభుత్వమే చదివించాలి : సోనూసూద్sonusood;amala akkineni;cinema;degree;hero;central government;partyFri, 30 Apr 2021 20:34:09 GMTసోనూసూద్ ను సినిమాల్లో విలన్ అనే కంటే రియల్ లైఫ్ హీరో అంటేనే అతడికి సెట్ అవుతుందేమో. ఎందుకంటే ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఏ రాజకీయ నాయకులు..సినిమా హీరోలు..మిలియనియర్లు.చేయని సహాయ కార్యక్రమాలను ఒంటరిగా చేస్తున్నాడు. సోనూ సూద్ ను వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా..? లేదంటే ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రావాలన్న ఆశతోనే ఇవన్నీ చేస్తున్నాడా అంటే..నిజానికి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయకపోయినా సోనూ సూద్ పార్టీ టికెట్ పొంది ఇప్పుడు ఖర్చు చేస్తున్న డబ్బునే వాడుకుని ఎన్నికల్లో పోటీ చేసేవాడు. కానీ అలా కాకుండా సొంతడబ్బుతో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇక ఎవరైనా వెనకాల ఉండి సోనూ ను నడిపిస్తున్నారా అంటే అలా డబ్బులు ఇచ్చేవాళ్ళు తామెందుకు అసలు కనిపించకుండా సహాయం చేస్తారు. ఇదిలా ఉండగా సోనూసూద్ ఇప్పటివరకు తన సొంత డబ్బు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేసి సహాయ కార్యక్రమాలు చేశారట. ఈ విషయం ఇలా ఉండగా....సోనూసూద్ ఇప్పటివరకు తాను సహాయం చేసాడు కానీ ప్రభుత్వాలను ఎలాంటి సహాయం చేయాలని కోరలేదు. 

కానీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన సోనూసూద్ కరోనాతో మరణించిన వారి పిల్లల బాధ్యతలను ప్రభుత్వాలే తీసుకోవాలన్నారు. లైవ్ లో సోనూ మాట్లాడుతూ..."కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది తమ సొంతవాళ్ళని కోల్పోయారు. అలా కోల్పోయిన వారిలో 10 నుండి 15 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. కన్న వాళ్ళు మృతి చెందటంతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి అలాంటి వాళ్లకు ప్రభుత్వమే చదువు చెప్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా విద్యను అందించి వారిని ఆదుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అయినా డిగ్రీ మెడిసిన్ అయినా చదివించాల్సిందే. అలా అయితేనే వాళ్ళ భవిష్యత్ బాగుతుంది. దానికోసం ఒక నిబంధన తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా" అంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసారు. నిజానికి సోనూ వల్ల అయితే తానే సహాయం చేసేవాడేమో. కానీ కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. అలాంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే ప్రభుత్వాలే ముందుకు రావాలి. మరి రియల్ హీరో రిక్వెస్ట్ ను ప్రభుత్వాలు అమలు చేస్తాయా..? లేదంటే లైట్ తీసుకుంటాయా అన్నది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి..!

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>