PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-e0248e78-3bdb-4567-9b5f-8f51f62275a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-e0248e78-3bdb-4567-9b5f-8f51f62275a2-415x250-IndiaHerald.jpg దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసులు రోజు రోజుకి ఎన్నో లక్షల్లో నమోదవుతున్నాయి. ఇక తెలంగాణాలో కూడా ఎన్నో కేసులు నమోదవుతూ చాలా మరణాలు సంభవిస్తున్నాయి.ఇక హైదరాబాద్ లో కరోనా రోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ (టిమ్స్) నిరుపేదలనుండి ఉన్నతవర్గాలకు దేవాలయంలా మారింది. రాష్త్రముఖ్యమంత్రి ముందుచూపుతో గత సంవత్సరం గచ్చిబౌలిలో అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రారంభించిన కరోనా హాస్పిటల్ తెలంగాణ ప్రజలకు సంజీవినిగా మారింది. ఈ హాcoronavirus;koti;poorna;hyderabad;mandula;telangana;mohandas karamchand gandhi;temple;king;king 1;oxygen;coronavirusటిమ్స్ హాస్పిటల్.. కరోనా రోగులకు గుడి..!టిమ్స్ హాస్పిటల్.. కరోనా రోగులకు గుడి..!coronavirus;koti;poorna;hyderabad;mandula;telangana;mohandas karamchand gandhi;temple;king;king 1;oxygen;coronavirusFri, 30 Apr 2021 20:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసులు రోజు రోజుకి ఎన్నో లక్షల్లో నమోదవుతున్నాయి. ఇక తెలంగాణాలో కూడా ఎన్నో కేసులు నమోదవుతూ చాలా మరణాలు సంభవిస్తున్నాయి.ఇక హైదరాబాద్ లో కరోనా రోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ (టిమ్స్) నిరుపేదలనుండి ఉన్నతవర్గాలకు దేవాలయంలా మారింది. రాష్త్రముఖ్యమంత్రి ముందుచూపుతో గత సంవత్సరం గచ్చిబౌలిలో అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రారంభించిన కరోనా హాస్పిటల్ తెలంగాణ ప్రజలకు సంజీవినిగా మారింది.

ఈ హాస్పిటల్ లో 1261 పడకలు ఉన్నాయి. అలాగే వాటిల్లో 980 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఏ ఇతర సూపర్ స్పెషాలిటీ ఆపత్రిలో లేనివిధంగా ఈ టిమ్స్ లో 137 మెకానికల్ వెంటిలేటర్లతో కూడిన ఐ.సి.యూ ల సౌకర్యం కూడా ఉంది.ఈ టిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం 260 మంది డాక్టర్లు, 266 మంది నర్సులతో పాటు పేషంట్ కేర్ సిబ్బంది, తగు సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, 266 పారా మెడికల్ సిబ్బంది, 130 మంది ఇతర సిబ్బంది కోవిద్ పేషంట్లకు సేవలందిస్తున్నారు.


వీరికి అదనంగా, మరో 190 మంది సిబ్బంది ని నియమించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే అనుమతులు జారీ చేసింది.పేషంట్ల ఆరోగ్యం దృష్ట్యా ఇక్కడి పేషంట్ లు బయటినుండి ఆహారం తెచ్చుకోవడాన్ని నిషేదించారు.మందులు, చికిత్స, డాక్టర్లు, నర్సులు,ఇక్కడి కరోనా పేషంట్ల పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ను ఇక్కడ చికిత్స పొంది నయం అయిన పేషంట్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సకాలంలో మందులు అందించడం, ఎంతో ఓపిగ్గా సమస్యలు వినడం, వైద్యులు ఇతర మెడికల్ సిబ్బంది మధ్య మంచి సమన్వయము, మెరుగైన ఆహారం అందించడం వంటి సౌకర్యాలు అందించడం ఇక్కడి పేషంట్లకు మనోధైర్యం కలిగిస్తున్నాయి.


ఇక ఈ హాస్పిటల్ లో కరోనా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశతో వస్తున్నారు. డాక్టర్లు కాని ఇతర సిబ్బంది కాని ఎలాంటి విసుగు చెందకుండా సంపూర్ణ చికిత్స అందిస్తున్నారు.హైదరాబాద్ నగరం లో గాంధీ, కింగ్ కోటి, నిమ్స్ లతోపాటు పలు ఆసుపత్రుల్లో కోవిద్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నప్పటికీ టిమ్స్లో చేరేందుకై పెద్ద ఎత్తున రోగులు ఆసక్తి చూపిస్తున్నారంటే , ఈ ఆసుపత్రిలో లభిస్తున్న మెరుగైన వైద్య సేవలకు నిదర్శనంగా చెప్పవచ్చు.ప్రస్తుతం 650 మందికి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్పకు తప్పని కష్టాలు.. విలన్ వల్ల ఆగిపోయిన షూటింగ్..?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??

పాటల ఫిలాసఫీ: కరోనా గాయానికి ఈ పాట ఒక మందులాంటిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>