Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/meaning-of-life-of-ram-song-in-jaanu-movie105a957e-32cf-45e1-874a-57b095a80b2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/meaning-of-life-of-ram-song-in-jaanu-movie105a957e-32cf-45e1-874a-57b095a80b2f-415x250-IndiaHerald.jpg ‘ఎదారెదురైనా.. ఎటువెళుతుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా..’ ఈ పల్లవి వినగానే గుండెల్లో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మనసు లోతుల్లోని నిగూఢ భావాలను తట్టి లేపినట్లనిపిస్తుంది. జానూ సినిమాలోని ఈ పాటకు అభిమాని కాని వారున్నారంటే అది అసత్యమనే చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొంత నైరాశ్యం ఉంటుంది. ఓ చిలిపి ప్రేమ కథ ఉంటుంది. కానీ చాలా మంది కొన్నాళ్లకు ఆ ప్రేమను మరిచిపోయి జీవితంలో..life of ram;chiranjeevi;govind menon;kumaar;geetha;govi;jeevitha rajaseskhar;pradeep;prema;ram pothineni;ranina;sirivennela;tiru;vennela;cinema;sangeetha;love;heart;air;hero;allu sneha;prema katha‘లైఫ్ ఆఫ్ రామ్’సాంగ్ విన్నారా..? అర్థం తెలిస్తే గుండె బరువెక్కుతుంది‘లైఫ్ ఆఫ్ రామ్’సాంగ్ విన్నారా..? అర్థం తెలిస్తే గుండె బరువెక్కుతుందిlife of ram;chiranjeevi;govind menon;kumaar;geetha;govi;jeevitha rajaseskhar;pradeep;prema;ram pothineni;ranina;sirivennela;tiru;vennela;cinema;sangeetha;love;heart;air;hero;allu sneha;prema kathaFri, 30 Apr 2021 14:15:15 GMTఇంటర్నెట్ డెస్క్:  ‘ఎదారెదురైనా.. ఎటువెళుతుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా..’ ఈ పల్లవి వినగానే గుండెల్లో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మనసు లోతుల్లోని నిగూఢ భావాలను తట్టి లేపినట్లనిపిస్తుంది. జానూ సినిమాలోని ఈ పాటకు అభిమాని కాని వారున్నారంటే అది అసత్యమనే చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొంత నైరాశ్యం ఉంటుంది. ఓ చిలిపి ప్రేమ కథ ఉంటుంది. కానీ చాలా మంది కొన్నాళ్లకు ఆ ప్రేమను మరిచిపోయి జీవితంలో ముందుకు వెళ్లిపోతుంటారు. అలా అందరిలా తన ప్రేమను వదలిపెట్టని రామ్.. తన ప్రేయసి జ్ఞాపకాలతోనే జీవితాంతం గడిపేసేందుకు సిద్ధమవుతాడు. గమ్యం లేని ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలా ఒంటరిగా ప్రయాణించే అతడికి ప్రకృతే స్నేహం అవుతుంది. ఆ ప్రకృతితోనే తన మనసులోని భావాలను రామ్.. పంచుకోవడమే ఈ పాట.

సినిమా ఎన్ని గంటలో పక్కన పెడితే.. ఈ ఒక్క పాటలోనే రామ్ జీవితం ఏంటో తెలిసిపోతుంది ప్రేక్షకుడికి. సిరివెన్నెల గోవింద్ వసంత అందించిన సంగీతం, ప్రదీప్ కుమార్ గాత్రం ఈ పాటకు ఓ రూపం ఇస్తే.. సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ప్రాణం పోసింది. ఏ ముహూర్తాన ఈ పాటకు ‘లైఫ్ ఆఫ్ రామ్’ అని పేరు పెట్టారో కానీ.. ఇది నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకానొక సమయపు జ్ఞాపకాలను అలా మెలిపెట్టి వదులుతుంది. అంత గొప్ప సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల.

రామ్.. ఒంటిరిగా జీవించాడానికి ఇష్టపడతాడు. ఒంటరిగానే గమ్యం లేని ప్రయాణం చేస్తుంటాడు. తన చుట్టూ ఏముందో పట్టించుకోవడం ఏనాడో వదిలేశాడు. నిరాశ నిండిన జీవితంతో ముందుకు సాగిపోతుంటాడు. ప్రేయసి ఎడబాటుతో మనసును రాయిగా మార్చుకుని, ఆమె గురించే కలలు కంటూ జీవిస్తుంటాడు. తనకు అలా జీవించడమే ఇష్టం. మిగిలిన జీవితం మొత్తం అలానే జీవించాలనుకుంటుంటాడు. అయితే అదే సమయంలో తనను ఏ విధంగానూ మార్చవద్దని తన చుట్టూ ఉండే ప్రకృతిని కోరుతుంటాడు. తాను ఒంటరినని మళ్లీ మళ్లీ అనుకోవద్దని, తన ప్రేయసి జ్ఞాపకాలు జీవితం మొత్తానికి సరిపడా తోడుగా ఉన్నాయని చెబుతుంటాడు. అవే తనను ఇప్పటివరకు నడిపించాయని, ఇక ముందు కూడా అవే తాను జీవించేందుకు కావలసిన ప్రోత్సాహాన్నిస్తాయని రామ్ అభిప్రాయం. తన ప్రతి శ్వాసలోనూ ఆమే ఉందని, ప్రతి సవ్వడిలోనూ ఆమె జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయని అంటాడు.

‘‘ప్రతి ఉదయం కొత్తగా జన్మిస్తుంటా. నాకు నిన్నటితోటి సంబంధం లేదు. రేపటితోటి అవసరం లేదు. ప్రతి రోజూ కొత్త కాలంలో అడుగుపెడుతూ.. నా కథను ‘అనగనగా..’ అని మొదలు పెడతాను. నా కథకు అంతమే లేదు. నాకు ఓ చిరునామా లేదు. గాలి వాటంలా ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. అలా తిరిగుతూనే తనలోని బాధను గుర్తు చేసుకుని మౌనంగా ఆవేదన చెందుతుంటాను.

నాకింకెవరూ అవసరం లేదు. నాకు.. నేను, నా నీడ వరకు చాలు. నా ఏకాంత లోకంలో నేను బతుకుతున్నాను. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు, తాను కొత్త ఆశల కోసం ఎదురు చూసినప్పుడు ప్రతి సారీ ఆ జాబిలి తనకు ఎప్పుడూ దూరంగా ఉంది. కానీ అక్కడ నుంచే తనకు తోడుగా వెన్నెల హాయిని పంచింది. ఆ జాబిలి తన ప్రేయసి అయితే.. ఆ జాబిలి పంచే వెన్నెల ఆమె ప్రేమ. ఆ ప్రేమ తనతో ఉన్నంత వరకు తాను ఎన్నటికీ ఒంటరి కాను’’ అని హీరో చెబుతుంటాడు.
" style="height: 370px;">


 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !

ప్రపంచ దేశాలన్నీ విమర్శిస్తున్నా నోరు మెదపని ప్రధాని మోదీ

ఏపీలో ఫిఫ్టీ-ఫిఫ్టీ పాలిటిక్స్‌.. ఏం జ‌రుగుతోందంటే!

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>