EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagane756fc60-4979-4e08-b660-e8cddec0d34a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagane756fc60-4979-4e08-b660-e8cddec0d34a-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ మొండి వాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు.. తాను నిజం అని నమ్మితే ఆ నిజం లోక విరుద్ధంగా ఉన్నా.. దాన్ని ప్రకటించడానికి వెనుకాడడు.. తనకు నమ్మకం కుదిరితే చాలు.. గుడ్డిగా ఫాలో అవుతాడు.. ఇందుకు మనం అనేక ఉదాహరణలు చూడొచ్చు.. కరోనా ఇండియాలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే జగన్.. మనం కరోనాతో సహ జీవనం చేయాలి.. తప్పుదు అని చెప్పాడు.. అప్పట్లో జగన్ మాటలు చూసి అంతా నవ్వేశారు. కానీ ఆ తర్వాత వాస్తవంలో అదే నిజమని తేలింది. ఇప్పుడు కూడా అంతే.. ఇంకేముంది కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది.. ఇక అందరికjagan;koti;jagan;andhra pradesh;january;central government;juneజగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!jagan;koti;jagan;andhra pradesh;january;central government;juneFri, 30 Apr 2021 07:00:00 GMTఏపీ సీఎం జగన్ మొండి వాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు.. తాను నిజం అని నమ్మితే ఆ నిజం లోక విరుద్ధంగా ఉన్నా.. దాన్ని ప్రకటించడానికి వెనుకాడడు.. తనకు నమ్మకం కుదిరితే చాలు.. గుడ్డిగా ఫాలో అవుతాడు.. ఇందుకు మనం అనేక ఉదాహరణలు చూడొచ్చు.. కరోనా ఇండియాలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే జగన్.. మనం కరోనాతో సహ జీవనం చేయాలి.. తప్పుదు అని చెప్పాడు.. అప్పట్లో జగన్ మాటలు చూసి అంతా నవ్వేశారు.

కానీ ఆ తర్వాత వాస్తవంలో అదే నిజమని తేలింది. ఇప్పుడు కూడా అంతే.. ఇంకేముంది కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది.. ఇక అందరికీ టీకాలిచ్చేస్తామని కేంద్రం చెబుతోంది. మొదట కరోనా వారియర్స్‌కూ, వైద్య సిబ్బందికి 60 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చారు. ఇప్పుడు 45 పైబడిన వారికి టీకాలు ఇస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. మే, జూన్ కల్లా వ్యాక్సినేషన్ అవుతుందని కేంద్రం చెబుతోంది. కానీ వాస్తవం చాలా విరుద్దంగా ఉంది.  కానీ.. అసలు ఇవ్వడానికి టీకాలు ఎక్కడున్నాయంటున్నారు  ఏపీ సీఎం జగన్.

అంతే కాదు.. ఈ18 ఏళ్లు పైబడిన వారికి సెప్టెంబర్‌లో టీకా ఇవ్వొచ్చేమో అంటున్నాడు జగన్. అసలు ఇంకా ఇండియాలో 39 కోట్ల వాక్సిన్‌ డోస్‌లు కావాలి.. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వాక్సీన్లు తయారు చేస్తోంది.. రెడ్డీ ల్యాబ్స్‌, ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది... అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్లు వాక్సీన్లు ఉత్పత్తి కావొచ్చు. దీనికి తోడు ఇప్పుడున్న 7 కోట్లు కూడా కలుస్తాయి.. ఈ లెక్కన 39 కోట్ల వాక్సీన్‌ డిమాండ్‌  ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదు అని లెక్కలతో సహా చెబుతున్నారు జగన్.

18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దేశంలో 60 కోట్లు ఉన్నారు... ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వాక్సిన్‌ డోస్‌లు కావాలి.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వాక్సినేషన్‌ పూర్తయ్యాక, 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్‌ ఇవ్వొచ్చని అంచనా... ఆ మేరకు వారికి వాక్సినేషన్‌ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుంది... వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్‌ చేయగలుగుతాము. ఇదీ వాస్తవ పరిస్థితి.. అని కళ్లకుకట్టినట్టు వివరిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"కరోనా వ్యాక్సిన్" కేసులో తమిళ నటుడికి ముందస్తు బెయిలు ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైసీపీ హవా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>