PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో దీనికి సంబంధించి హైకోర్ట్ కూడా ఆగ్రహంగా ఉంది. నేడు ఉదయం నుంచి ఈ అంశానికి సంబంధించి తెలంగాణా హైకోర్ట్ విచారణ జరిపింది. ప్రజల ప్రాణాలు పోతున్నా సరే ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోవడంపై రాష్ట్ర హైకోర్ట్ మండిపడింది. విచారణ సందర్భంగా ఎన్నికల కమీషనర్ తీరుని ఆక్షేపించింది. మున్సిపల్ ఎన్నిhigh court,ts;ashok kumar;kumaar;ashok;hyderabad;high court;police;election commissionఉద్యోగులు చస్తారా అనే వరకు తీసుకెళ్ళారు: తెలంగాణా హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యఉద్యోగులు చస్తారా అనే వరకు తీసుకెళ్ళారు: తెలంగాణా హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యhigh court,ts;ashok kumar;kumaar;ashok;hyderabad;high court;police;election commissionThu, 29 Apr 2021 18:00:00 GMTతెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో దీనికి సంబంధించి హైకోర్ట్ కూడా ఆగ్రహంగా ఉంది. నేడు ఉదయం నుంచి ఈ అంశానికి సంబంధించి తెలంగాణా హైకోర్ట్ విచారణ జరిపింది. ప్రజల ప్రాణాలు పోతున్నా సరే ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోవడంపై రాష్ట్ర హైకోర్ట్ మండిపడింది.

విచారణ సందర్భంగా ఎన్నికల కమీషనర్ తీరుని ఆక్షేపించింది. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని ఎస్ఈకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు గుమిగూడి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు... తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఎన్నికల విధుల్లో 2557 పోలీసులు సహా 7695 మంది ఉద్యోగులు  ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరం అని హైకోర్ట్ పేర్కొంది. ఎన్నికల సంఘాన్ని సంఘం పనితీరు సరిగా లేదని హైకోర్ట్ చెప్పుకొచ్చింది. కరోనా విపత్తులో ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని హైకోర్ట్ వివరించింది. గతంలో హైదరాబాద్ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా అని ప్రశ్నించింది. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల నిర్వహిస్తున్నారూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే..  ఎస్ ఈసీ దృష్టి ఎన్నికల పై ఉందని మండిపడింది. ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహం పై ఉన్నారేమో అంటూ విమర్శలు చేసింది. ప్రభుత్వం కూడా ఎన్నికల కు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యమని పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అజిత్ కి నచ్చితే అలా కూడా చేస్తారా...??

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..

లాక్డౌన్ వద్దు అన్నవారి మీద నాగ అశ్విన్ ఫైర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>