PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whatsapp0951583e-6e1d-4bcb-823e-b536d57c9e3e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whatsapp0951583e-6e1d-4bcb-823e-b536d57c9e3e-415x250-IndiaHerald.jpgవాట్సప్ .. ఇప్పుడు ఈ యాప్ లేని స్మార్ట్ ఫోనే కనిపించదు. ఇది లేకుండా చాలా మందికి రోజు గడవదు.. ఫ్రెండ్స్ తో అయినా, ఆఫీసు కొలీగ్స్‌ తో అయినా, బంధువులతో అయినా, సోషల్ మీడియా స్నేహితులతో అయినా ఇప్పుడు కమ్యూనికేషన్‌లో ఉండే సాధనంగా వాట్సప్ మారిపోయంది. ఒక్కొకరి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని గ్రూపులు ఉంటాయో లెక్క ఉండదు. చివరకు భార్యాభర్తలు, లవర్స్ కూడా తమకో గ్రూప్ పెట్టుకుని మెస్సేజులు పంపుకునే రేంజ్‌ కు వాట్సప్ ఓ నిత్యావసరంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇదే వాట్సప్ మన కొంప ముంచే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాwhatsapp;chiranjeevi;nithya new;germany;smart phone;whatsapp;media;pinkవాట్సప్‌లో కొత్త స్కామ్‌.. ఈ మెస్సేజ్‌ వస్తే జాగ్రత్త..!వాట్సప్‌లో కొత్త స్కామ్‌.. ఈ మెస్సేజ్‌ వస్తే జాగ్రత్త..!whatsapp;chiranjeevi;nithya new;germany;smart phone;whatsapp;media;pinkThu, 29 Apr 2021 06:00:00 GMTవాట్సప్ .. ఇప్పుడు ఈ యాప్ లేని స్మార్ట్ ఫోనే కనిపించదు. ఇది లేకుండా చాలా మందికి రోజు గడవదు.. ఫ్రెండ్స్ తో అయినా, ఆఫీసు కొలీగ్స్‌ తో అయినా, బంధువులతో అయినా, సోషల్ మీడియా స్నేహితులతో అయినా ఇప్పుడు కమ్యూనికేషన్‌లో ఉండే సాధనంగా వాట్సప్ మారిపోయంది. ఒక్కొకరి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని గ్రూపులు ఉంటాయో లెక్క ఉండదు. చివరకు భార్యాభర్తలు, లవర్స్ కూడా తమకో గ్రూప్ పెట్టుకుని మెస్సేజులు పంపుకునే రేంజ్‌ కు వాట్సప్ ఓ నిత్యావసరంగా మారిపోయింది.

అయితే ఇప్పుడు ఇదే వాట్సప్ మన కొంప ముంచే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లకు చిరునామాగా మారుతోంది. మనకు నిత్యం వాట్సప్‌లో ఎన్నో మెస్సేజులు వస్తంటాయి. అందులో కొన్ని ఫేక్ మెస్సేజులుంటాయి. మరికొన్ని డేంజర్ మెస్సేజులు ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మన సమాచారం కొట్టేసేందుకు వలలు విసురుతుంటారు. అలాంటి ఓ మెస్సేజ్ ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతోంది.అది ఎలా ఉంటుందంటే.. మీకు ఓ పార్సిల్ కొరియర్‌లో వచ్చింది. వివరాల కోసం అంటూ ఓ లింక్ ఇస్తారు. దాన్ని పొందాలంటే

అరే మనకు ఏం పార్సిల్ వచ్చిందబ్బా అనుకుంటూ ఆ లింక్‌ ఓపెన్ చేశారా అంతే సంగతులు. అయితే అది మన అంగీకారం అడుగుతుంది. పొరపాటు ఓకే కొడితే ఇక మన ఫోన్‌లోకి ఆ మాల్ వేర్ దూరిపోతుంది. మన సమాచారం హాంఫట్ అవుతుంది. ఈ కొత్త మాల్‌వేర్‌ పేరు ‘ప్లూ బాట్‌’. ఈ ఫ్లూబాట్‌ చూడటానికి కొరియర్‌ సంస్థ ట్రాకింగ్‌ మెసేజ్‌లా కనిపిస్తోంది. ఈ మాల్‌ వేర్ మీ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఇక మీ సమాచారం అంతా హ్యాకర్లకు చేరిపోతుంది.

ఈ మాల్ వేర్ ఇప్పటికే స్పెయిన్‌, బ్రిటన్‌, జర్మనీ, పోలెండ్‌ దేశాల్లో బాగా పాకిందట. కొన్ని రోజుల క్రితం ఇలాగే  పింక్ లింక్‌ మెస్సేజ్ కూడా సందడి చేసింది. చాలా మంది దాన్ని చూసి మోసపోయారు.  పింక్‌ వాట్సాప్‌ అంటూ  ఓ లింక్‌ ఆమధ్య వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ ప్లూబాట్ అన్నమాట. అందుకే ఇలాంటి మెస్సేజులు, లింకుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓన్లీ 15డేస్‌..! త‌ప్ప‌ద‌నుకుంటే కేసీఆర్ నిర్ణ‌యం అదే..?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?

లేడీ మంత్రుల్లో షాక్ తగిలేది ఎవరికో?

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>