PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaleel-khana8c5f455-8852-4125-a9db-4dce76ee9780-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaleel-khana8c5f455-8852-4125-a9db-4dce76ee9780-415x250-IndiaHerald.jpgవిజయవాడ టీడీపీలో విభేదాలు తగ్గలేదా? తమ్ముళ్ళ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తూనే ఉందా? అంటే ఇంకా బెజవాడ టీడీపీలో రచ్చ జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మామూలుగానే టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఇక ఆ గ్రూపులు మధ్య అంతర్గత వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తమ్ముళ్ళ మధ్య పోరు బయటపడింది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం జరిగింది.jaleel khan;nani;naga;bonda;vijayawada;2019;mp;naga aswin;kesineni nani;mla;war;jaleel khan;buddha venkanna;racchaబెజవాడ పాలిటిక్స్: జలీల్‌ని సైడ్ చేయడం కష్టమేనా?బెజవాడ పాలిటిక్స్: జలీల్‌ని సైడ్ చేయడం కష్టమేనా?jaleel khan;nani;naga;bonda;vijayawada;2019;mp;naga aswin;kesineni nani;mla;war;jaleel khan;buddha venkanna;racchaThu, 29 Apr 2021 00:00:00 GMTవిజయవాడ టీడీపీలో విభేదాలు తగ్గలేదా? తమ్ముళ్ళ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తూనే ఉందా? అంటే ఇంకా బెజవాడ టీడీపీలో రచ్చ జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మామూలుగానే టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఇక ఆ గ్రూపులు మధ్య అంతర్గత వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తమ్ముళ్ళ మధ్య పోరు బయటపడింది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం జరిగింది.


కేశినేని...బోండా, బుద్దాల టార్గెట్‌గా విమర్శలు చేశారు. అలాగే రివర్స్‌లో వారు కూడా కేశినేనిపై విరుచుకుపడ్డారు. దీంతో అధినాయకుడు చంద్రబాబు ఈ రచ్చకు కాస్త బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు. అయినా సరే నాయకుల మధ్య విభేదాలు సర్దుకోలేదు. ఫలితంగా గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్ చేజారింది. ఇక ఇలా ఓటమి వచ్చాక కూడా తమ్ముళ్ళ మధ్య గొడవలు తగ్గలేదని తెలుస్తోంది. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది.


పైగా రెండు గ్రూపుల మధ్య వెస్ట్ సీటు విషయంలో హాట్ హాట్ ఫైట్ జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వెస్ట్‌లో జలీల్ ఖాన్ ఉన్నారు. ఈయన 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా, తన కుమార్తెని నిలబెట్టారు. అయితే సొంత పార్టీలో ఉన్న విభేదాలు కారణంగా జలీల్ కుమార్తె ఓటమి పాలైంది. ఓడిపోయాక ఆమె విదేశాలకు వెళ్లిపోయింది. దీంతో వెస్ట్ బాధ్యతలు జలీల్ చూసుకుంటున్నారు. ఇక జలీల్‌కు సపోర్ట్‌గా కేశినేని ఉన్నారు.


అయితే ఈ సీటుని దక్కించుకోవాలని బుద్దా చూస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే తన వర్గంలోని నాగుల్ మీరాకు సీటు వచ్చేలా చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ జలీల్, కేశినేని వర్గాలే బలంగా ఉన్నాయి. కాబట్టి వెస్ట్ సీటు అంత తేలికగా బుద్దాకు రాదని తెలుస్తోంది. మొత్తానికైతే వెస్ట్‌లో జలీల్‌ని సైడ్ చేయడం కష్టమని తెలుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అదిరిపోయే సినిమాలు.. అంతకుమించిన సమంత క్యారెక్టర్స్.. మీకు నచ్చినదేదో..?

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>