PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corporation-electionadad315a-afe1-4aea-8b4a-15bee25ca15d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corporation-electionadad315a-afe1-4aea-8b4a-15bee25ca15d-415x250-IndiaHerald.jpgరెండు కార్పొరేష‌న్‌లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారాన్ని హోరెత్తించాయి. ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ర్యాలీల‌లు, స‌భ‌ల ద్వారా మాకు ఓటేస్తే అదిచేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీవ‌ర్షం కురిపించారు. క‌రోనా ఉధృతినిసైతం లెక్క‌చేయ‌క అభ్య‌ర్థులు గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌తి గ‌డ‌ప తొక్కారు. ప్ర‌తీఒక్క ఓట‌రును క‌లిసి ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించారు. ప్ర‌చార ప‌ర్వంలో అధికార పార్టీదే హ‌వా కొన‌సాగిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. corporation election;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;minister;local language;election commission;v;dookudu;partyలాభంలే..! వారి దూకుడు.. వీరి బేజారు! అన్నిచోట్ల అంతేనా?లాభంలే..! వారి దూకుడు.. వీరి బేజారు! అన్నిచోట్ల అంతేనా?corporation election;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;minister;local language;election commission;v;dookudu;partyThu, 29 Apr 2021 07:36:47 GMTచేతిలో బెత్త‌మున్నోడిదే పెత్త‌నం అన్న‌ట్లు.. అధికారంలో ఉన్న‌వారిదే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌వా సాగుతుంది. ఇది ఎప్ప‌టి నుంచో చూస్తున్న‌, వింటున్న వ్య‌వ‌హారం. కానీ ఓట‌ర్లు త‌ల‌చుకుంటే ఫ‌లితాలు త‌ల‌కిందుల‌యిన ఎన్నిక‌లు ఎన్నో చూశాం. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక‌, హైద‌రాబాద్ జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లు ఇదే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న మినీ పుర‌పోరులో ప్ర‌తిప‌క్షాలు ఇలాంటి ఆశ‌లే పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. రెండు కార్పొరేష‌న్‌లు, ఐదు మున్సిపాలిటీల్లో 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ప్ర‌చార‌ప‌ర్వం ముగిసిపోవ‌టంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి.

రెండు కార్పొరేష‌న్‌లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారాన్ని హోరెత్తించాయి. ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ర్యాలీల‌లు, స‌భ‌ల ద్వారా మాకు ఓటేస్తే అదిచేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీవ‌ర్షం కురిపించారు. క‌రోనా ఉధృతినిసైతం లెక్క‌చేయ‌క అభ్య‌ర్థులు గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌తి గ‌డ‌ప తొక్కారు. ప్ర‌తీఒక్క ఓట‌రును క‌లిసి ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించారు. ప్ర‌చార ప‌ర్వంలో అధికార పార్టీదే హ‌వా కొన‌సాగిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ముఖ్యంగా రెండు కార్పొరేష‌న్‌ల‌పై అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు దృష్టిసారించాయి. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిప‌క్షాలు అధికార పార్టీకి పోటీనిచ్చే ద‌శ‌లో క‌నిపించినా, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో మాత్రం తెరాస హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించింది. మంత్రి పువ్వాడ అజ‌య్ దూకుడు ముందు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల ప్ర‌చారం తేలిపోయిన‌ట్లు స్థానికంగా చ‌ర్చ‌సాగుతుంది.

30న జ‌రిగే ఎన్నిక‌ల‌కు కొవిడ్ ఉధృతి కార‌ణంగా రెండురోజుల ముందే ఈసీ ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ గ్యాప్‌ను అధికార పార్టీ స‌ద్వినియోగం చేసుకుంటుంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే నిర్వ‌హించిన స‌ర్వేల ఆధారంగా ప్ర‌తిప‌క్షాలకు ప‌ట్టు ఉంద‌న్న డివిజ‌న్‌లు, వార్డుల‌పై అధికార పార్టీ నేత‌లు ఫోక‌స్‌పెట్టి.. రాత్రికిరాత్రే ఓట‌ర్ల మ‌ద్ద‌తు పొందుతున్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ నేత‌లు కావ‌డంతో అధికారులు సైతం చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నార‌ట‌. ఈ ప‌రిస్థితి అన్ని కార్పొరేష‌న్‌లు, మున్సిపాలిటీల్లో ఉండ‌టంతో అధికార పార్టీ దూకుడుతో.. ప్ర‌తిప‌క్షాలు బేజార‌వుతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌కు అందిన స‌ర్వే నివేదికల ప్ర‌కారం.. ఖ‌మ్మం, సిద్ధిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేటల్లో 90శాతం మంది తెరాస అభ్య‌ర్థులు, వ‌రంగ‌ల్‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌పై గులాబీ జెండా ఎగర‌డం ఖాయ‌మైనా 70 నుంచి 80 శాతం అధికార పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారని తేలింద‌ట‌. క‌రోనా ఉధృతి న‌డుమసాగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తార‌న్న‌ది వేచిచూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నం

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>