MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa6917a59b-8b1e-486b-b25a-83303207b396-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa6917a59b-8b1e-486b-b25a-83303207b396-415x250-IndiaHerald.jpgఈ సోషల్ మీడియా అనేది వాడకంలోకి వచ్చినప్పటి నుంచి మన తెలుగు చిత్ర పరిశ్రమ చాలా మారిపోయింది.. నిజం చెప్పాలంటే ఒకప్పటి సినిమా పరిశ్రమకి ఇప్పటి సినిమా పరిశ్రమకి అస్సలు పొంతనే లేదు.. ఒకప్పుడు మా సినిమా వంద రోజులు ఆడింది, రెండు వందల రోజులు ఆడింది అంటూ రికార్డ్స్ గురించి చెబుతూ అవే మాకు ప్రేక్షకులు ఇచ్చిన అవార్డ్స్ అంటూ తెగ మురిసిపొయ్యేవాళ్ళు. కానీ, డిజిటల్ విప్లవం వచ్చిన తరువాత, మా టీజర్ కి ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, మా ట్రైలర్ కి ఏభై అరవై మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటూ అదే అన్నిటికి కAllu Arjun Pushpa;view;allu arjun;audi;industries;cinema;media;youtube;you tube;film industry;audience;hero;arjun 1'పుష్ప' సినిమా కోసం అల్లు అర్జున్ మరీ ఇంత దిగజారడం ఏంటబ్బా..??'పుష్ప' సినిమా కోసం అల్లు అర్జున్ మరీ ఇంత దిగజారడం ఏంటబ్బా..??Allu Arjun Pushpa;view;allu arjun;audi;industries;cinema;media;youtube;you tube;film industry;audience;hero;arjun 1Thu, 29 Apr 2021 15:00:00 GMTఈ సోషల్ మీడియా అనేది వాడకంలోకి వచ్చినప్పటి నుంచి మన తెలుగు చిత్ర పరిశ్రమ చాలా మారిపోయింది.. నిజం చెప్పాలంటే ఒకప్పటి సినిమా పరిశ్రమకి ఇప్పటి సినిమా పరిశ్రమకి అస్సలు పొంతనే లేదు.. ఒకప్పుడు మా సినిమా వంద రోజులు ఆడింది, రెండు వందల రోజులు ఆడింది అంటూ రికార్డ్స్ గురించి చెబుతూ అవే మాకు ప్రేక్షకులు ఇచ్చిన అవార్డ్స్ అంటూ తెగ మురిసిపొయ్యేవాళ్ళు. కానీ, డిజిటల్ విప్లవం వచ్చిన తరువాత, మా టీజర్ కి ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, మా ట్రైలర్ కి ఏభై అరవై మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటూ అదే అన్నిటికి కంటే రికార్డ్స్ అంటూ పోస్టర్స్ వదులుతున్నారు.అయితే, ఒక సినిమాకి ఉన్న క్రేజ్ ను బట్టే కదా వ్యూస్ వచ్చేది, కాబట్టి ఫలానా సినిమా టీజర్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి.. 

కచ్చితంగా ఆ సినిమాకి దక్కిన రికార్డే అని ప్రేక్షకులు కూడా ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చారు. కానీ ఆ నమ్మకాల వెనుక దిగజారిన ఆలోచన ఉందని, రికార్డ్ వ్యూస్ వెనుక బోగస్ ప్లానింగ్ ఉందని ప్రేక్షక లోకానికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది.ముఖ్యంగా యూట్యూబ్ లో టీజర్లకు, ట్రైలర్లకు వ్యూస్ కొనడం అనేది కామన్ అయిపోయిందని ఇప్పుడున్న వస్తోన్న రికార్డ్ వ్యూస్ అన్నీ అదే బాపతు అని ఆడియన్స్ కూడా తెలుసుకుంటున్నారు. అయినా ఫస్ట్ డే మిలియన్ల కొద్దీ వ్యూస్ ఎందుకు వస్తాయి ? ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమా అయితే ఏం ? వ్యూస్ విచ్చలవిడిగా రావాలంటే కష్టమే.

అందుకే వ్యూస్ కొనుక్కునే మార్కెటింగ్ ట్రిక్కులు తప్పడం లేదు. అందుకే స్టార్ హీరోలు కూడా పోటీ పడి వ్యూస్ కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.లేకపోతే 'పుష్ప' టీజర్ చాలా రోజులుగా 45 మిలియన్ల వ్యూస్ దగ్గర కొట్టుమిట్టాడతా ఉంది. రోజులు గడుస్తున్నా వ్యూస్ పెరగలేదు. కానీ అంతలో 'అఖండ' టైటిల్ టీజర్ 47 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయే సరికి, పుష్ప టీజర్ కేవలం రెండు రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. వారాలు గడుస్తోన్నా రాని వ్యూస్, కేవలం రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి ? వ్యూస్ కొనుక్కోవడం అనే ట్రిక్ ఉందని ఈజీగా అర్ధమైపోతుంది.ఏదేమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కూడా వ్యూస్ కోసం ఇలా దిగజారడం అనేది ఒకింత ఆశ్చర్య పడాల్సిన విషయమే...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్‌కు షాకిచ్చిన కరోనా.. ఇక ఇప్పట్లో లేనట్లే..!?

10 రోజుల్లో అంతా అయిపోవాల్సింది...కానీ ?

కాళ్ళు పట్టుకున్న కనికరించలే.. చివరికి ప్రాణం పాయే..?

రేషన్ కార్డు ఉందా.. మీకే గుడ్ న్యూస్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>