PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/atchannaidub587ff34-6da7-468b-a678-d7341dbc2185-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/atchannaidub587ff34-6da7-468b-a678-d7341dbc2185-415x250-IndiaHerald.jpgకింజరాపు అచ్చెన్నాయుడు...దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ పార్టీకి అండగా నిలబడుతున్న నేత. 2019 ఎన్నికల తర్వాత ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న టీడీపీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అచ్చెన్నాయుడు, ఈ మధ్య పార్టీ తరుపున బలమైన గళం వినిపిస్తున్నట్లు లేదు.atchannaidu;tiru;atchannaidu kinjarapu;andhra pradesh;2019;telugu;tirupati;parliment;husband;tdp;ycp;lokesh kanagaraj;dookudu;partyబాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?atchannaidu;tiru;atchannaidu kinjarapu;andhra pradesh;2019;telugu;tirupati;parliment;husband;tdp;ycp;lokesh kanagaraj;dookudu;partyThu, 29 Apr 2021 04:00:00 GMTకింజరాపు అచ్చెన్నాయుడు...దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ పార్టీకి అండగా నిలబడుతున్న నేత. 2019 ఎన్నికల తర్వాత ఘోరంగా ఓడిపోయి  కష్టాల్లో ఉన్న టీడీపీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అచ్చెన్నాయుడు, ఈ మధ్య పార్టీ తరుపున బలమైన గళం వినిపిస్తున్నట్లు లేదు.


ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్న, వైసీపీ ప్రభుత్వం మీద దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. తనపై కేసులు పెట్టి జైలుకు పంపినా సరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అచ్చెన్నాయుడు దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక దీనికి కారణం లేకుండా లేదు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో అచ్చెన్నాయుడు, లోకేష్‌ని తిట్టిన ఓ వీడియో బయట పడిన విషయం తెలిసిందే.


టీడీపీని నమ్ముకుని తాను రోడ్డున పడ్డానని, కుటుంబం మొత్తం కట్టుబట్టలతో మిగిలానని వెంకట్రావ్ అనే నాయకుడు అచ్చెన్నాయుడుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయమై నారా లోకేష్‌ను కలిస్తే.. అంతకు ముందు మర్యాద అయినా ఇచ్చేవాడని, ఇప్పుడు దొంగను చూసినట్లు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.


ఇక దీనిపై అచ్చెన్న స్పందిస్తూ, అందరి పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనే (లోకేష్) సరిగ్గా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సముదాయించడం ఈ వీడియోలో రికార్డయింది. ఈ వీడియో బయటపడ్డాక అచ్చెన్నాయుడు కాస్త దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది. వీడియో బయటకొచ్చాక, ఇది వైసీపీ కుట్ర అని మాట్లాడిన అచ్చెన్న, ఆ తర్వాత నుంచి పెద్దగా వైసీపీ ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్ళడం లేదు. ఏదో పేపర్ స్టేట్‌మెంట్స్ వరకు హడావిడి కనిపిస్తుంది తప్పా, రియాలిటీకి వస్తే అచ్చెన్న అంత ఫైర్ అవ్వడం లేదు. అయితే ఆ వీడియో విషయంలో చంద్రబాబు లైట్ తీసుకోకపోవడం వల్లే, ఈ పరిస్తితి ఉందని టాక్. మొత్తానికైతే ఈ మధ్య అచ్చెన్న అరుపులు అయితే పెద్దగా వినబడటం లేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>