MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bahubali-414bf8ce-e5a1-4f6d-8d02-4d531ea03818-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bahubali-414bf8ce-e5a1-4f6d-8d02-4d531ea03818-415x250-IndiaHerald.jpgచరిత్రను సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ‘బాహుబలి 2’ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక మీడియా సంస్థలు ఆ మూవీ గురించి అనేక ఆసక్తికర విషయాల పై కథనాలు వ్రాస్తున్నాయి. వాస్తవానికి ‘బాహుబలి’ కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాశాడట.అప్పట్లో రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ లు బొంబాయి వెళ్ళి హృతిక్ రోషన్ ను కలిసి కథను వినిపిస్తే హృతిక్ ఇంతటి భారీ సినిమాను తీయగల సత్తా రాజమౌళికి లేదని భావించి సున్bahubali;;prabhas;rana;hrithik roshan;mohanlal;sonam kapoor;sridevi kapoor;deva;editor mohan;kirti;lakshmi;lakshmi manchu;prasad;ramya krishnan;roshan;rajamouli;tamannaah bhatia;mumbai;bollywood;cinema;bahubali;media;jaan;writer;hero;heroine;international;k v vijayendra prasad;father;johnబాహుబలి ని వదులుకున్న దురదృష్టవంతులు !బాహుబలి ని వదులుకున్న దురదృష్టవంతులు !bahubali;;prabhas;rana;hrithik roshan;mohanlal;sonam kapoor;sridevi kapoor;deva;editor mohan;kirti;lakshmi;lakshmi manchu;prasad;ramya krishnan;roshan;rajamouli;tamannaah bhatia;mumbai;bollywood;cinema;bahubali;media;jaan;writer;hero;heroine;international;k v vijayendra prasad;father;johnThu, 29 Apr 2021 08:00:00 GMTచరిత్రను సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ‘బాహుబలి 2’ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక మీడియా సంస్థలు ఆ మూవీ గురించి అనేక ఆసక్తికర విషయాల పై కథనాలు వ్రాస్తున్నాయి. వాస్తవానికి ‘బాహుబలి’ కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాశాడట.



అప్పట్లో రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ లు బొంబాయి వెళ్ళి హృతిక్ రోషన్ ను కలిసి కథను వినిపిస్తే హృతిక్ ఇంతటి భారీ సినిమాను తీయగల సత్తా రాజమౌళికి లేదని భావించి సున్నితంగా తన డేట్స్ ఎడ్జెస్ట్ కావు అని తప్పుకున్నాడట. ఆతరువాత ఈ మూవీ కథను నమ్మే హీరో ఎవరు అని ఆలోచనలు చేస్తు జక్కన్న ప్రభాస్ దగ్గరకు వెళ్ళడం జరిగిందట.



ఈ కథ విన్న తరువాత ప్రభాస్ కు చనిపోయిన తన తండ్రి కోరిక గుర్తుకు వచ్చిందట. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు బ్రతికి ఉన్న రోజులలో తన కొడుకు ఒక చక్రవర్తిగా సినిమాలలో కనిపిస్తే చూడాలని ముచ్చటపడ్డాడట. రాజమౌళి ప్రభాస్ కు ఆకథ చెప్పగానే వెంటనే తన తండ్రి కోరిక గుర్తుకు వచ్చి మరొక క్షణం ఆలోచించకుండా ఆ మూవీని ఓకె చేసాడట. ఇక ఈమూవీలో కట్టప్ప పాత్రకు ముందుగా రాజమౌళి మోహన్ లాల్ ను అనుకుంటే అతడు రిజిక్ట్ చేయడంతో సత్యరాజు వచ్చి చేరాడు.


అదేవిధంగా ఈమూవీలో అత్యంత కీలకమైన భల్లాల దేవుడు పాత్రకు బాలీవుడ్ జాన్ అబ్రహం ను అనుకుంటే అతడు అంగీకరించక పోవడంతో రానా వచ్చి చేరాడు. ఇక శివగామి పాత్రకు సంబంధించి శ్రీదేవి అంగీకరించపోవడంతో ఆ పాత్ర మంచు లక్ష్మి వరకు వెళ్ళి చివరకు ఆ పాత్రలో రమ్యకృష్ణ సెటిల్ అయింది. ఈమూవీలోని ఆవంతిక పాత్ర కోసం ముందుగా రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ను అనుకుంటే ఆమె కూడ ఆశక్తి కనపరచక పోవడంతో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇలా అన్ని విషయాలలోనూ రాజీ పడుతూ రాజమౌళి ‘బాహుబలి’ ని మొదలు పెట్టినప్పుడు ఆమూవీ తనకు జాతీయ స్థాయి కీర్తి తెచ్చి పెడుతుందని అప్పట్లో ఊహించి ఉండడు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా చివ‌ర‌కు ఏపీ మంత్రుల‌కూ ఇలా షాక్ ఇచ్చిందే...!

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>