PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfb0d3c30-c43d-4f6a-8bc0-d440835d93c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfb0d3c30-c43d-4f6a-8bc0-d440835d93c9-415x250-IndiaHerald.jpg కరోనా కేసులు భారత దేశంలో అడుగు పెట్టిన మొదటి రోజుల్లో మీకు గుర్తుందా.. ప్రతి కరోనా రోగినీ ట్రేస్ చేసేవారు.. అంతే కాదు.. వారి కాంటాక్టులను నిశితంగా పరిశీలించే వారు.. వారం రోజులుగా ఆ రోగి ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరిని కలిశాడు.. అన్నీ ట్రేస్ చేసేవారు.. ఆయన్ను కలిసిన వారిని క్వారంటైన్‌లో ఉంచేవారు.. చాలా పకడ్బందీగా ఈ వ్యవహారం సాగేది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ పాజిటివ్ రోగుల ట్రేసింగ్ చాలా కష్ట సాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో కర్నాటక సర్కారు ఓ బాంబు coronavirus;ashok;india;karnataka - bengaluru;smart phone;police;karnataka 1;bengaluru 1;minister;kshanamబాబోయ్.. 3 వేల మంది కరోనా పాజిటివ్‌ రోగులు మిస్సింగ్..?బాబోయ్.. 3 వేల మంది కరోనా పాజిటివ్‌ రోగులు మిస్సింగ్..?coronavirus;ashok;india;karnataka - bengaluru;smart phone;police;karnataka 1;bengaluru 1;minister;kshanamThu, 29 Apr 2021 08:02:00 GMT
కరోనా కేసులు భారత దేశంలో అడుగు పెట్టిన మొదటి రోజుల్లో మీకు గుర్తుందా.. ప్రతి కరోనా రోగినీ ట్రేస్ చేసేవారు.. అంతే కాదు.. వారి కాంటాక్టులను నిశితంగా పరిశీలించే వారు.. వారం రోజులుగా ఆ రోగి ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరిని కలిశాడు.. అన్నీ ట్రేస్ చేసేవారు.. ఆయన్ను కలిసిన వారిని క్వారంటైన్‌లో ఉంచేవారు.. చాలా పకడ్బందీగా ఈ వ్యవహారం సాగేది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ పాజిటివ్ రోగుల ట్రేసింగ్ చాలా కష్ట సాధ్యంగా మారింది.

ఈ నేపథ్యంలో కర్నాటక సర్కారు ఓ బాంబు లాంటి వార్త బయటపెట్టింది. బెంగళూరులో 3వేల మంది కొవిడ్‌ రోగుల జాడ తెలియడం లేదని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. కొవిడ్‌ నిర్ధారణ అయిన తర్వాత చాలా మంది రోగులు వారి మొబైల్‌ ఫోన్లను స్విచాఫ్‌ చేసుకుంటున్నారట. దీని వల్ల వారి ట్రేసింగ్ కష్టమవుతోంది. ఇలాంటి పాజిటివ్ రోగులను నియంత్రించకపోవడం వల్ల కర్నాటకలో కొవిడ్‌ ఉద్ధృతి మరింత పెరుగుతుందని  కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి అశోక్ చెబుతున్నారు.

అందుకే కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను ట్రేస్ చేసేందుకు  పోలీసుల సహాయం తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ సోకిన దాదాపు 2 నుంచి 3వేల మంది కొవిడ్‌ బాధితులు స్విచాఫ్‌ చేసుకున్నారట. అంతే కాదు.. వారు  ఇళ్లలోనూ లేరట. అంటే అధికారికంగా వీరంతా గల్లంతయ్యారన్న మాట. సాధారణంగా వీరి ఫోన్ ఆన్‌లో ఉంటే.. ప్రభుత్వ అధికారులు వీరిని సంప్రదించి సాయం చేసే వీలుంటుంది. వైరస్‌ సోకినవారికి ఉచితంగానే ఔషధాలు కూడా ఇస్తున్నారు. 90శాతం బాధితులు ఇంటివద్దే కోలుకుంటున్నారు.

కొందరు మాత్రం కరోనా పాజిటివ్ అని తెలిస్తే చుట్టుపక్కల ఏమనుకుంటారో అన్న ఆందోళనతోనో.. ఏమీ కాదన్న దీమాతోనో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారు సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. తీరా ఆరోగ్యం విషమించి చివరి క్షణంలో ఆసుపత్రులకు వస్తూ ఐసీయూ పడకలు కావాలని అడుగుతున్నారు. అలా చేయకండ్రా బాబోయ్ అని ఇప్పుడు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక ఇలాంటి వాళ్లను కాపాడేదెవరు..?



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటీమార్ సాంగ్ బాలీవుడ్ కి ఇవ్వడం దిల్ రాజు కి నచ్చలేదా.. దేవిశ్రీ పై గుస్సా..!!

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>