PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down8fd6c2a8-b74c-4a64-8a3d-a5c75a9d043b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down8fd6c2a8-b74c-4a64-8a3d-a5c75a9d043b-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూస్తుంటే లాక్‌డౌన్ త‌ప్ప‌దా అనే అంశం తెర‌పైకి వ‌స్తుంది. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను విధించ‌గా, లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తుంది. లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో గ‌తేడాది అంద‌రికీ అనుభ‌వ‌మే. దీంతో లాక్‌డౌన్ పేరుచెప్ప‌గానే కొన్ని రంగాలవారు బెంబేలెత్తిపోతున్నారు.Lock down;kcr;mini;telanganaవీరు మార‌రు.. లాక్‌డౌన్ అనివార్య‌మా? బాబోయ్ వారికి క‌ష్టాలే!వీరు మార‌రు.. లాక్‌డౌన్ అనివార్య‌మా? బాబోయ్ వారికి క‌ష్టాలే!Lock down;kcr;mini;telanganaThu, 29 Apr 2021 09:11:43 GMTచ‌దువుకోమ‌ని మాట‌ల‌తో ఉపాధ్యాయులు ఎంత చెప్పినా కొంద‌రి ఆక‌తాయి విద్యార్థుల బుర్ర‌ల‌కెక్క‌దు.. అదే బెత్తంతోనో, మ‌రో విధ‌మైన దండ‌న‌తో చెబితే అప్పుడు భ‌యంతో దారికొచ్చి పాఠాన్ని బుర్ర‌కెక్కించుకుంటారు.. తెల‌గాణ‌లోనూ ఇప్పుడు ఇదే తీరు సాగుతుంది. క‌రోనా సెకండ్‌వేవ్ విజృంభ‌ణ వేళ ప్ర‌భుత్వం ఎన్నిహెచ్చ‌రిక‌లు, ఎన్నిసూచ‌న‌లు చేసినా కొంద‌రిలో మార్పురావ‌డం లేదు. మాస్క్ ధ‌రించ‌మ‌న్నా, భౌతిక‌దూరం పాటించ‌మ‌న్నా వినిపించుకోరు. ఫ‌లితంగా వీరి ద్వారా జాగ్ర‌త్త‌లు పాటించిన‌వారూ వైర‌స్ బారిన ప‌డాల్సి వ‌స్తుంది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం కేసుల పెరుగుద‌ల కార‌ణాల్లో ఇదొక‌ట‌ని స్ప‌ష్టం అవుతుంది. ప్ర‌భుత్వం చేసేదేమీలేక లాక్‌డౌన్ వైపు అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి. మ‌రోవైపు లాక్‌డౌన్ అంటేనే కొన్ని వ‌ర్గాల వారికి వ‌ణుకు వ‌చ్చేసింది.

తెలంగాణ‌లో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూస్తుంటే లాక్‌డౌన్ త‌ప్ప‌దా అనే అంశం తెర‌పైకి వ‌స్తుంది. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను విధించ‌గా, లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తుంది. లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో గ‌తేడాది అంద‌రికీ అనుభ‌వ‌మే. దీంతో లాక్‌డౌన్ పేరుచెప్ప‌గానే కొన్ని రంగాలవారు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్న‌చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవ‌నోపాధిపొందే వారు లాక్‌డౌన్‌వ‌ల్ల ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతామ‌ని భ‌య‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వీధివ్యాపారులు, వ‌ల‌స కూలీలు, రోజువారి కూలీలు, ర‌వాణా రంగంపై, రియ‌ల్ ఎస్టేట్‌, భ‌వ‌న నిర్మాణాల‌పై ఆధార‌ప‌డి జీవ‌నంసాగించే వారికి ఇబ్బందులు ఎదుర‌వుతాయి. గ‌తేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలోనే ఈ రంగాల‌వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌రోసారి లాక్‌డౌన్ అంటే బెంబేలెత్తిపోతున్నారు.

లాక్‌డౌన్ ప్ర‌భావం ప్ర‌భుత్వంపైనా ప‌డుతుంది. ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం కోల్పోవ‌టంతో పాటు ఉన్న ఆదాయం ఖ‌ర్చ‌వుతుంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ విధించేందుకు వెనుక‌డుగు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నైట్ క‌ర్ఫ్యూ వ‌ల్ల‌నే కొన్నిరంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని సీఎం గ్ర‌హించినా ప్ర‌జారోగ్యం దృష్ట్యా త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ కాకుండా క‌రోనా క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న అంశంపై కేసీఆర్ ప‌లు రంగాల నిపుణులు, ఉన్న‌తాధికారులతో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తే రాష్ట్రం చేసేదేమీ ఉండ‌ద‌ని, అలాఅని మ‌న‌మే సొంతంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించే ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ భావ‌న అట‌.

ఈ ప‌రిస్థితుల్లో త‌ప్ప‌దు అనుకుంటే మినీ లాక్‌డౌన్ విధిస్తే స‌రిపోతుంద‌న్న భావ‌న‌కు కేసీఆర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 15రోజులు క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేసి, ఇదే స‌మ‌యంలో 18యేళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేస్తే క‌రోనాను క‌ట్ట‌డిచేయ‌గ‌ల‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. మ‌రి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎలాంటినిర్ణ‌యం తీసుకుంటారు..? ఒక‌వేళ లాక్‌డౌన్ విధిస్తే ఆదాయం కోల్పోయే రంగాల‌వారికి ఎలాంటి స‌హాయం అందిస్తార‌న్న‌దానిపై ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌సాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>