PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-cm-turns-5-star-hotel-into-kovid-hub-judges-talking6486ef95-7d69-4de9-8f71-c8f573419555-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-cm-turns-5-star-hotel-into-kovid-hub-judges-talking6486ef95-7d69-4de9-8f71-c8f573419555-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక దేశం రాజధాని అయినా ఢిల్లీలో కరోనా బారినపడే వారి మృతి చెందేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ టెస్ట్ కోసం ఆసుపత్రి దగ్గర క్యూ నిలబడితే.. శ్మశానవాటిక దగ్గర మృతదేహాలు క్యూ కడుతున్నాయి. Arvind Kejriwal, Delhi CM, establishment of 5 star hotel, judicial officers, judges, corona centers;allu aravind;hari;hari music;delhi;arvind kejriwal;capital;chief minister;central government5 స్టార్ హోటల్ కోవిడ్ కేంద్రంగా మార్చిన ఢిల్లీ సీఎం.. వద్దంటున్న జడ్జీలు..!5 స్టార్ హోటల్ కోవిడ్ కేంద్రంగా మార్చిన ఢిల్లీ సీఎం.. వద్దంటున్న జడ్జీలు..!Arvind Kejriwal, Delhi CM, establishment of 5 star hotel, judicial officers, judges, corona centers;allu aravind;hari;hari music;delhi;arvind kejriwal;capital;chief minister;central governmentWed, 28 Apr 2021 13:40:17 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక దేశం రాజధాని అయినా ఢిల్లీలో కరోనా బారినపడే వారి మృతి చెందేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ టెస్ట్ కోసం ఆసుపత్రి దగ్గర క్యూ నిలబడితే.. శ్మశానవాటిక దగ్గర మృతదేహాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఢిల్లీ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో కోవిడ్ సౌకర్యాలను తాము కోరలేదని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. హోటల్ అశోకాలో తమకు 100 గదులను కేటాయించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని హైకోర్టు జడ్జీలు, జ్యూడిషియల్ అధికారులకు కేటాయించాలని సర్కార్ నిర్ణయించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ  తాము ఎప్పుడు ఇలా కోరామని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఓ జ్యూడిషియల్ అధికారి గానీ, జడ్జి గానీ కరోనా పాజిటివ్‌కి గురైతే వారికి ఆసుపత్రి అడ్మిషన్ సౌకర్యం కల్పించాలని  మాత్రమే కోరామని వారన్నారు.


అంతేకాక.. దిగువస్థాయి జ్యూడిషియరీ అధికారుల గురించే తమ యోచన అని, ఇద్దరు జ్యూడిషియల్ ఆఫీసర్లు ఇప్పటికే మరణించారని వారు పేర్కొన్నారు. ఇలాంటి వివాదాలు ఎందుకని, తామేమీ ప్రత్యేక సౌకర్యాలు కోరలేదని స్పష్టం  చేశారు. హాస్పిటల్స్‌లో బెడ్స్ కోసం రోగులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఈ స్థితిలో మేం ఇలా స్పెషల్ ఫెసిలిటీస్ కోసం కోరుతామని ఎలా అనుకున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది.


కాగా ఈ వార్తలను మీడియాయే సృష్టించిందని ప్రభుత్వ లాయర్  పేర్కొన్నారు. సిటీలోని పలు హోటళ్లు, హాస్పిటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని  కోవిడ్ కేంద్రాలుగా మారాయని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంపై మండిపడిన కోర్టు మీడియాపై నెపం వేయరాదని, వారే కరెక్ట్ అని, మీ ఉత్తర్వులు తప్పు అని పేర్కొంది. దీంతో ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. నగరంలోని ఫైవ్ స్టార్ అశోకా హోటల్‌లో ఢిల్లీ హైకోర్టు జడ్జీలకు, జ్యూడిషియల్ అధికారులకు ప్రత్యేకంగా వంద గదులను కేటాయించాలని  ప్రభుత్వం ఆదేశించినట్టు మంగళవారం వార్తలు వచ్చాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఫార్మా కంపెనీ లో భారీ అగ్నిప్రమాదం..

అదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>