MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinimaa21a20116-784c-4f80-9712-aeec99a6ae33-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinimaa21a20116-784c-4f80-9712-aeec99a6ae33-415x250-IndiaHerald.jpgసినిమా హాల్ అంటే అది సినీ దేవతలు నివసించే దేవాలయం. అక్కడకు తారలు దిగి వస్తారు. వెండి తెర మీద వారు చేసే విన్యాసాలకు అభిమానులే కాదు ఆడియన్స్ మొత్తం ఫిదా అవుతారు. ఒక విధంగా హీరోలకు, ఫ్యాన్స్ కి మధ్య అనుసంధానం కుదిర్చేవే సినిమా హాళ్ళు. cinimaa;technology;tara;vijay;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;ram madhav;cinema;telugu;cinema theater;kollywood;festival;audience;cinema theatre;hero;silver;joseph vijay;silver screen;research and analysis wing;master;fidaaథియేటర్ల కొంప కూల్చేస్తున్నారు...?థియేటర్ల కొంప కూల్చేస్తున్నారు...?cinimaa;technology;tara;vijay;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;ram madhav;cinema;telugu;cinema theater;kollywood;festival;audience;cinema theatre;hero;silver;joseph vijay;silver screen;research and analysis wing;master;fidaaWed, 28 Apr 2021 19:00:00 GMTసినిమా హాల్ అంటే అది సినీ దేవతలు నివసించే దేవాలయం. అక్కడకు తారలు దిగి వస్తారు. వెండి తెర మీద వారు చేసే విన్యాసాలకు అభిమానులే కాదు ఆడియన్స్ మొత్తం ఫిదా అవుతారు. ఒక విధంగా హీరోలకు, ఫ్యాన్స్ కి మధ్య అనుసంధానం కుదిర్చేవే సినిమా హాళ్ళు.

అటువంటి హాళ్ళకు చెడ్డ రోజులు వచ్చేశాయా అనిపిస్తోంది. గత పదేళ్ళుగా పైరసీతో సినిమాలకు వచ్చే జనాలు సగానికి సగం తగ్గిపోయారు. మరో వైపు చూస్తే ఎప్పటికపుడు మారుతున్న టెక్నాలజీ కూడా సినిమా హాళ్ళకు పెను సవాల్ గా పరిణమించింది.  దీంతో సింగిల్ ధియేటర్లు ముందు కుప్ప కూలుతున్నాయి. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు వేల దాకా ఉండే థియేటర్లు ఇపుడు సగానికి సగం అయ్యాయి. పెద్ద హీరో సినిమా వస్తేనే పండుగ లేకపోతే థియేటర్లలో ఈగలు తోలుకోవడమే. ఈ నేపధ్యంలో వరసపెట్టి రెండేళ్ళుగా వచ్చి పడుతున్న కరోనా మహమ్మారి కారణంగా అతి పెద్ద ముప్పు సినిమా హాళ్ళకే వచ్చింది.

ఇపుడు కొత్త సినిమా థియేటర్లో  రిలీజ్  చేసినా కూడా వెంటనే ఓటీటీలలో రిలీజ్ చేయడం కూడా థియేటర్ల వ్యవస్థను కుప్ప కూల్చే పరిణామమే అని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ లో విజయ్ నటించిన మాస్టర్ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసిన కేవలం పదహారు రోజుల వ్యవధిలోనే ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల థియేటర్ల  యాజమాన్యాల సంఘాలు  నిరసన వ్యక్తం చేశాయి. ఇపుడు తెలుగులో వకీల్ సాబ్ మూవీ రిలీజ్ అయి మూడు వారాలు కూడా కాక ముందే ఈ నెల 30న ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది రాంగ్ సిగ్నల్స్ ని పంపించేదే అంటున్నారు. దీని వల్ల ఆడియన్స్ టికెట్ కొనుక్కుని థియేటర్లో సినిమా చూడరని, ఓటీటీకే అలవాటు పడతారు అని అంటున్నారు. మొత్తంగా అంతా కలసి థియేటర్లను లేకుండా చేస్తున్నారు అన్నదే వారి ఆవేదన.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>