PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancbe40f81-4ca2-4cc7-a2fe-1591ce457ca8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancbe40f81-4ca2-4cc7-a2fe-1591ce457ca8-415x250-IndiaHerald.jpgజగన్ ఒకే ఒక్కడుగా ఏపీ రాజకీయాలను పదేళ్ళుగా శాసిస్తూ వస్తున్నారు. జగన్ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఏపీకి సీఎం అయ్యారు. మరో నెలలో రెండేళ్ల పాలన కూడా ఆయన పూర్తి చేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే జగన్ కి కొత్త చిక్కులు ఇపుడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. jagan;raghu;tara;jagan;andhra pradesh;mp;government;court;cbi;letter;ycp;okkaduజగన్ వ్యతిరేకులు అంతా ఒక్కటిగా...?జగన్ వ్యతిరేకులు అంతా ఒక్కటిగా...?jagan;raghu;tara;jagan;andhra pradesh;mp;government;court;cbi;letter;ycp;okkaduWed, 28 Apr 2021 19:00:00 GMTజగన్ ఒకే ఒక్కడుగా ఏపీ రాజకీయాలను పదేళ్ళుగా శాసిస్తూ వస్తున్నారు. జగన్ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఏపీకి సీఎం అయ్యారు. మరో నెలలో రెండేళ్ల పాలన కూడా ఆయన పూర్తి చేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే జగన్ కి కొత్త చిక్కులు ఇపుడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

జగన్ బెయిల్ ని రద్దు చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు కూడా కోర్టు స్వీకరించింది. దీని మీద సీబీఐకి, జగన్ కి కూడా నోటీసులు జారీ చేస్తారు. మరి రఘురామ క్రిష్ణం రాజు పిటిషన్ లో దాఖలు చేసిన అంశాలు చాలా కీలకమైనవిగా చెబుతారు. రెండేళ్ళ కాలంలో జగన్ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడని, అదే సమయంలో ఆయన సాక్ష్యులను కూడా తనకు ఉన్న అధికారిక హోదాతో ప్రభావితం చేస్తున్నారని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

మరి దీని మీద జగన్ తరఫున న్యాయవాదులు ఏ విధంగా వాదిస్తారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. జగన్ కోర్టుకు సరిగ్గా హాజరు కాకపోవడం అంటే ఒక విధంగా బెయిల్ షరతులను ఉల్లఘించడమే. అదే విధంగా జగన్ తో పాటు పలు కేసులల్లో ఉన్న వారికి జగన్ తన ప్రభుత్వంలో పదోన్నతులు కల్పించిన దాన్ని కూడా రాజు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది సాక్ష్యాలను ప్రభావితం చేయడమే అంటున్నారు. మరి బలమైన ఆధారాలతో పాటు తగిన లాజిక్ పాయింట్లు కూడా జత చేస్తూ రాజు కోర్టు ముందుకు అనేక అంశాలు తీసుకెళ్లారు. దీని మీద సమర్ధమైన వాదన జగన్ తరఫున న్యాయవాదులు వినిపించకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవనే అంటున్నారు.

ఇక ఈ మధ్యన జరిగిన అనేక పరిణామాలను బట్టి చూస్తే జగన్ కి వ్యతిరేక వర్గం బలంగా ఉందని అంటున్నారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసిన రాజు పైకి కనిపిస్తున్నా కూడా ఆయన వెనక చాలా మందే ఉన్నారు అన్న అనుమానాలు అయితే వైసీపీ నేతలకూ ఉన్నాయట. జగన్ మరో మూడేళ్ళు అధికారంలో కనుక కొనసాగితే ఏపీలో విపక్షానికి గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో వరసగా జరిగిన  అన్ని ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయాలను నమోదు చేసుకున్న జగన్ని కదల్చడం అంటే ఇప్పట్లో కష్టమే. మరి ఆ దారి లేక వేరే రూటు కొంతమంది ఎంచుకున్నారా అన్న డౌట్లూ కూడా వస్తున్నాయి. మొత్తానికి ఆ మధ్యన న్యాయ వ్యవస్థతో కూడా జగన్ ఒక వివాదాస్పద లేఖ రాసి పెట్టుకున్న వైనం కూడా ఇపుడు చర్చకు వస్తోంది. అన్నీ కలసి జగన్ బెయిల్ రద్దు అయ్యే సీన్ ఉందా అంటే ఏమో చెప్పలేమనే సమాధానం వస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

థియేటర్ల కొంప కూల్చేస్తున్నారు...?

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>