HealthThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virusc30aa4df-35eb-419b-8991-81e5262a3097-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virusc30aa4df-35eb-419b-8991-81e5262a3097-415x250-IndiaHerald.jpgవ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఉమ్మ‌డి జిల్లా నుంచి అనేక మంది కొవిడ్ చికిత్సకోసం ఎంజీఎంకు వ‌స్తున్నారు. బాడీలో వైర‌స్ తీవ్ర‌త ఎక్కువైన త‌రువాత ఆస్ప‌త్రికి వ‌స్తుండ‌టంతో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు.corona virus;district;king;minister;panjaaక‌ని క‌రోనా : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో 27మంది మృతి..క‌ని క‌రోనా : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో 27మంది మృతి..corona virus;district;king;minister;panjaaWed, 28 Apr 2021 12:19:00 GMT
వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఉమ్మ‌డి జిల్లా నుంచి అనేక మంది కొవిడ్ చికిత్సకోసం ఎంజీఎంకు వ‌స్తున్నారు. బాడీలో వైర‌స్ తీవ్ర‌త ఎక్కువైన త‌రువాత ఆస్ప‌త్రికి వ‌స్తుండ‌టంతో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో చికిత్స పూర్తిస్థాయిలో అందించేలోపే మృత్యువాత ప‌డుతున్నార‌ని పేర్కొంటున్నారు. మ‌రోవైపు మ‌హ‌బూబాబాద్ జిల్లా చిన్న‌గూడురు మండ‌లం గండంరాజుప‌ల్లిలో క‌రోనా పంజా విసురుతోంది. వారంలో క‌రోనా బారిన‌ప‌డి ఇద్ద‌రు మృతిచెందారు.

ఎంజీఎంలో 21గంట‌ల వ్య‌వ‌ధిలోనే క‌రోనాతో 27మంది మృతిచెందార‌న్న వార్త తెలుసుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు హుటాహుటీన ఆస్ప‌త్రికి బ‌య‌లుదేరి వెళ్లారు.అ క్క‌డి ప‌రిస్థితిని ఆయ‌న వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప‌త్రికి రోజుకు ఎంత మంది వ‌స్తున్నారు. వైద్య‌సేవ‌లు అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎంజీఎంలో మ‌ర‌ణాల మాట వాస్త‌వేన‌ని అన్నారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకొని ఆరోగ్య ప‌రిస్థితి చివ‌రిద‌శ‌లోకి వ‌చ్చాక ఎంజీఎంకు వ‌స్తున్నార‌ని, దీని కార‌ణంగానే ఎక్కువ మృతులు చోటు చేసుకున్నాయ‌ని అన్నారు. ఎంజీఎంలో వైద్యులు బాగా వైద్య సేవ‌లు అందిస్తున్నార‌ని, ఏ చిన్న స‌మ‌స్య అనిపించినా ఎంజీఎంకు వ‌చ్చి వైద్య‌సేవ‌లు పొంద‌వ‌చ్చ‌ని ఎర్ర‌బెల్లి తెలిపారు. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున ప్ర‌తీఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ఈ జిల్లాల్లో లాక్ డౌన్ ఉండవచ్చా...?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>