EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ys-jagan9e6695df-275b-4af0-9f93-8d51d45b8836-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ys-jagan9e6695df-275b-4af0-9f93-8d51d45b8836-415x250-IndiaHerald.jpgసీఎం జగన్.. చాలా మొండివాడు అన్న పేరుంది. తను చెప్పిన మాట వినాల్సిందే తప్ప.. ఒకరి మాట వినేరకంగా కాదని చాలా మంది చెబుతారు. అంతే కాదు.. ఏదైనా అనుకున్నాడంటే.. ఇక ఎవరు నచ్చజెప్పినా అంత సులభంగా స్టాండ్ మార్చుకునే రకం కూడా కాదు. ఈ లక్షణాలకు గిట్టని మీడియా మరి కొన్ని లక్షణాలు కలిపి ప్రచారం చేసింది. మొత్తానికి జగన్ అంటే.. ఓ మోనార్క్ అన్న అభిప్రాయం కలుగ జేశాయి ఇన్నాళ్లూ.. కానీ ఇప్పుడు జగన్ మారిపోయాడా అన్న సందేహం వస్తోంది. జగన్ అంటేనే ఓ మొండి ఘటం.. అందులో అనుమానమే లేదు. లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సోys-jagan;ramana;tara;tiru;jagan;congress;smart phone;media;wife;ycp;v;andhra jyothiషాకింగ్ : జగన్.. ఇంత మంచి వాడు ఎప్పుడయ్యాడబ్బా..!?షాకింగ్ : జగన్.. ఇంత మంచి వాడు ఎప్పుడయ్యాడబ్బా..!?ys-jagan;ramana;tara;tiru;jagan;congress;smart phone;media;wife;ycp;v;andhra jyothiWed, 28 Apr 2021 06:00:00 GMTసీఎం జగన్.. చాలా మొండివాడు అన్న పేరుంది. తను చెప్పిన మాట వినాల్సిందే తప్ప.. ఒకరి మాట వినేరకంగా కాదని చాలా మంది చెబుతారు. అంతే కాదు.. ఏదైనా అనుకున్నాడంటే.. ఇక ఎవరు నచ్చజెప్పినా అంత సులభంగా స్టాండ్ మార్చుకునే రకం కూడా కాదు. ఈ లక్షణాలకు గిట్టని మీడియా మరి కొన్ని లక్షణాలు కలిపి ప్రచారం చేసింది. మొత్తానికి జగన్ అంటే.. ఓ మోనార్క్ అన్న అభిప్రాయం కలుగ జేశాయి ఇన్నాళ్లూ..

కానీ ఇప్పుడు జగన్ మారిపోయాడా అన్న సందేహం వస్తోంది. జగన్ అంటేనే ఓ మొండి ఘటం.. అందులో అనుమానమే లేదు. లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సోనియాను ఎదిరించే సాహసం చేసేవాడా.. బెయిల్ పై బయట తిరుగుతూ.. ఏకంగా కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే సీజేఐకి ఫిర్యాదు చేస్తాడా. అయితే అలాంటి జగమొండి జగన్ ఇప్పుడు కాస్త మారినట్టు కనిపిస్తోంది. ఇందుకు రెండు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.

జస్టిస్ ఎన్‌.వి. రమణపై ఏకంగా సీజేఐ బోబ్డేకు సీఎం జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బహుశా  దేశంలో ఏ రాజకీయ నాయకుడు అలాంటి సాహసం చేసి ఉండడు. కానీ జగన్ చేశాడు. అయితే ఆయన ఫిర్యాదును అప్పటి సీజేఐ అంతగా పట్టించుకోలేదు. దాంతో ఎన్వీ రమణ సీజేఐ అయ్యారు. అయితే ఎన్వీ రమణపై అన్ని ఫిర్యాదులు చేసిన ఆయన.. అదే రమణ సీజేఐ అయినప్పుడు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే జగన్ కూ ఏబీఎన్ రాధాకృష్ణకూ ఉన్న వైరం తెలిసిందే. జగన్ పై తరచూ నెగిటివ్ కథనాలు వస్తుంటాయి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో. ఆర్కే నేరుగా జగన్ ను తప్పుబడుతూ వ్యాసాలు రాస్తుంటారు. అదే ఆర్కేను వైసీపీ నేతలు బండబూతులు తిడుతుంటారు. కానీ.. నిన్న ఆర్కే భార్య చనిపోయినప్పుడు.. జగన్ స్వయంగా ఆర్కేకు ఫోన్ చేశారట. ఈ విషయాన్ని ఆర్కే మీడియానే తెలిపింది. మొత్తం మీద ఈ రెండు ఘటన తర్వాత జగన్ కాస్త మారినట్టు అనిపిస్తోంది. కాదంటారా..?



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>