MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonusood-smantha-following58f854c6-86b7-463a-b37b-37890b1e7b43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonusood-smantha-following58f854c6-86b7-463a-b37b-37890b1e7b43-415x250-IndiaHerald.jpgఅడిగిన వారికి లేదనకుండా, తన ఆస్తులను సైతం అమ్ముకొని , కరోనా సమయంలో సోనుసూద్ ప్రేక్షకులకు ఎంత అండగా నిలుస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో రకంగా పేద ప్రజలకు సహాయం చేస్తూ, న్యూస్ లో నిలుస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇక ఈయన బాటలోనే ఎంతోమంది స్టార్స్ నడుస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా అక్కినేని వారి కోడలు అక్కినేని సమంత కూడా నడవబోతోంది.. పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తోంది.. అయితే ఈమె ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా చిన్న పిల్లలకు సహాయం చేయాలని ముందSONUSOOD SMANTHA FOLLOWING;naga chaitanya;maya;naga;nageshwara rao akkineni;samantha;vidya;tollywood;cinema;naga aswin;marriage;girl;heroine;chaitanya 1;joshసోనూసూద్ బాటలో సమంత అక్కినేని .. ఈ సారి ఏమి చేసింది ..?సోనూసూద్ బాటలో సమంత అక్కినేని .. ఈ సారి ఏమి చేసింది ..?SONUSOOD SMANTHA FOLLOWING;naga chaitanya;maya;naga;nageshwara rao akkineni;samantha;vidya;tollywood;cinema;naga aswin;marriage;girl;heroine;chaitanya 1;joshWed, 28 Apr 2021 16:00:00 GMT
అడిగిన వారికి లేదనకుండా, తన ఆస్తులను సైతం అమ్ముకొని , కరోనా సమయంలో సోనుసూద్ ప్రేక్షకులకు ఎంత అండగా నిలుస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో రకంగా పేద ప్రజలకు సహాయం చేస్తూ, న్యూస్ లో నిలుస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇక ఈయన బాటలోనే ఎంతోమంది స్టార్స్  నడుస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా అక్కినేని వారి కోడలు  అక్కినేని సమంత కూడా నడవబోతోంది.. పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తోంది.. అయితే ఈమె ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా చిన్న పిల్లలకు సహాయం చేయాలని ముందుకొచ్చింది. అయితే ఈ విషయాలను  తన పుట్టినరోజు సందర్భంగా వెల్లడించింది..అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


ఏప్రిల్ 28వ తేదీ 1987 వ సంవత్సరంలో జన్మించిన సమంత, నేడు తన 34వ పుట్టినరోజు వేడుకలను ,కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవడం విశేషం." ఏ మాయ చేసావే " అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత, క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత నాగ చైతన్య  ను ప్రేమించి, పెళ్లి చేసుకుని , ప్రస్తుతం అక్కినేని వారి కోడలిగా తన సత్తా ఏంటో చాటుతోంది..


సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ సినిమాలకు దూరం అవుతున్నారు. కానీ సమంత మాత్రం అందుకు భిన్నం అని అనిపించుకుంటూనే, అక్కినేని కోడలు  అనే మార్క్ ను యాడ్ చేసి , తన క్రేజ్ ను మరింత పెంచి , స్టార్ హీరోయిన్ గా  దూసుకుపోతోంది.. ఇక అంతే కాకుండా ఈమె అక్కడ ఇక్కడ అనే కాదు ఎక్కడైనా సరే తగ్గేది లేదంటూ తన జోష్ తో ఎంతోమంది హీరోయిన్ లకు  స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన కెరియర్ ను కొనసాగిస్తూనే, మనసున్న అమ్మాయి గా పలువురి చేత శభాష్ అనిపించుకుంటోంది అక్కినేని కోడలు.. ఇక ఈ నేపథ్యంలోనే సామాజిక కోణంలో ఆలోచించి, సాటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచనతోనే "ప్రత్యూష సపోర్ట్ " అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ముందుకు సాగుతోంది.. ఇక ఈ సంస్థ ద్వారా బడుగు , బలహీన వర్గాల పిల్లలకు కావలసిన విద్య, వైద్యం అన్నింటినీ ఉచితంగా అందిస్తూ, తన గొప్ప మనసును  చాటుకుంటోంది సమంత.. ఇక  అందరూ సోనుసూద్ బాటలో  సమంత అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇది విన్న ప్రతి ఒక్కరూ సమంతను శభాష్ అనాల్సిందే..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!

9 ఏళ్ళ పాత సినిమా ఇప్పుడు సూపర్ : ఆది నీ అదృష్టం ఏందయ్యా..?

దారుణం: హాస్పిటల్లో బెడ్ నుండి స్మశానంలో అంత్యక్రియలు పొందడం వరకు అంతా యుద్ధమే...?

ఊరికే మెగాస్టార్ అయిపోరు . ఈ ఒక్క పనితో మెగాస్టార్ అంటే ఏంటో రుజువు చేశాడు..!!

మహిళల టీ 20 ఛాలెంజ్ నిర్వహణపై నీలినీడలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>