Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9cfabf1b-c506-4317-86e3-1f144ce58ce9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9cfabf1b-c506-4317-86e3-1f144ce58ce9-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ప్యాన్ ఇండియి సినిమాలు ఎక్కువైపోయాయి. అందుకు అనుగుణంగానే బాలీవుడ్ హీరోయిన్లు సైతం మన హీరోల సరసన నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రద్ధా కపూర్, ఆలియా భట్, దీపిక పదుకొణె వంటి బాలీవుడ్ అగ్ర కథానాయికలు సైతం ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు సదరు బాలీవుడ్ హీరోయిన్లపై టాలీవుడ్ ఫ్యాన్స్ గుర్రుగా ..prabhas;prabhas;ram charan teja;alia bhatt;amitabh bachchan;deepika;nag ashwin;nayana harshita;ram pothineni;rajamouli;vyjayanthi;bollywood;tollywood;rrr movie;cinema;rajani kanth;smart phone;naga aswin;media;heroine;shradda kapoor;chitramమా హీరోనే తక్కువగా చూస్తావా..? దీపిక పదుకొణేపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా..!మా హీరోనే తక్కువగా చూస్తావా..? దీపిక పదుకొణేపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా..!prabhas;prabhas;ram charan teja;alia bhatt;amitabh bachchan;deepika;nag ashwin;nayana harshita;ram pothineni;rajamouli;vyjayanthi;bollywood;tollywood;rrr movie;cinema;rajani kanth;smart phone;naga aswin;media;heroine;shradda kapoor;chitramWed, 28 Apr 2021 22:58:10 GMTఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ప్యాన్ ఇండియి సినిమాలు ఎక్కువైపోయాయి. అందుకు అనుగుణంగానే బాలీవుడ్ హీరోయిన్లు సైతం మన హీరోల సరసన నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రద్ధా కపూర్, ఆలియా భట్, దీపిక పదుకొణె వంటి బాలీవుడ్ అగ్ర కథానాయికలు సైతం ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు సదరు బాలీవుడ్ హీరోయిన్లపై టాలీవుడ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం వారంతా స్టార్ హీరోయిన్లు కావడంతో మన హీరోలను వారు లైట్ తీసుకుంటున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా నటిస్తోంది. ఈ క్రమంలోనే  ఆలియా భట్ రాజమౌళిని నానా ఇబ్బందులు పెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆలియా వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఏకంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఆమె వైదొలగిందని కూడా ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. రాజమౌళి సినిమాలో ఆలియా పూర్తిగా ఇన్‌వాల్వ్ అయింది. దర్శకుడు కోరినట్లు పూర్తిగా సహకరించింది. తదుపరి షెడ్యూల్‌కు కూడా అందుబాటులో ఉంటానని చెప్పింది. ఈ మద్యనే కరోనా బారిన పడినా.. కోలుకున్న వెంటనే రాజమౌళితో అన్ని విషయాలనూ పంచుకుంది. దీంతో ఈ సమస్య సర్దుమణిగింది. ఈ క్రమంలోనే కొత్త సమస్య తెరమీదకొచ్చింది.

తాజాగా దీపిక పదుకొనే గురించి కూడా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీలో దీపిక హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలకు దీపిక చుక్కలు చూపిస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. నిర్మాతలకు సరిగ్గా స్పందించడం లేదని, కనీసం ఫోన్ చేసినా సమాధానమివ్వడం లేదని రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు దీపికపై సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపిక వల్ల ప్రభాస్ మూవీకి చిక్కులు తప్పవని, ఆమె ఈ సినిమాను కనీసం పట్టించుకోవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌లు వైరల్ చేస్తున్నారు. తాను లేడీ సూపర్ స్టార్ అని ప్రభాస్‌ని డామినేట్ చేయాలనే అహంతోనే ఇలా చేస్తోందని అభిమానులు ఆరోపిస్తున్నారు.

కాగా.. దీపిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. హృతిక్ రోషన్‌తో ఓ సినిమా, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే ద్రౌపది అనే చిత్రంలోనూ నటించబోతోంది. అయితే కరోనా నేపథ్యంలో ఓవైపు కోవిడ్ షెడ్యూళ్లను మార్చేయడంతో కాల్షీట్ల సర్దుబాటులోనే దీపిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.  అటు బాలీవుడ్ సినిమాలకు, ఇటు తెలుగు సినిమాలకు కాల్షీట్లను సర్ధుబాటు చేయడంలోనే ఆమె ఇబ్బందులు పడుతున్నట్లు మరికొంత మంది అంచనా వేస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్లో లేట్ అవుతున్నవన్నీ అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అదే సమయంలో ప్రారంభం కాబోతున్న నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమాకు దీపిక కాల్షీట్లతో సమస్య ఏర్పడవచ్చని అనుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>