ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virald175b6f6-3ff7-473f-a95e-eb26511e5fdb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virald175b6f6-3ff7-473f-a95e-eb26511e5fdb-415x250-IndiaHerald.jpgమాములుగా 14 రోజుల పాటు ఐసొలేషన్ లో వుండాలంటేనే నరకంలా ఉంటుంది.ఒకే చోట ఎక్కడికి తిరగకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉండి ఐసొలేషన్ లో వుండాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అంతేగాక చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటిది ఎలాంటి సదుపాయాలు లేని చీకటి గుహలో ఉంటే ఎలా ఉంటుంది. అందులోను 14 రోజులు కూడా ఏకంగా 40 రోజులు ఉంటే ఇంకెలా ఉంటుంది... ఇక అది నరకమే అని చెప్పాలి...అలాంటి ఘటనే అక్కడ జరిగిందట.. వివరాల్లోకి వెళితే...ఫ్రాన్స్‌లో 15 మంది 40 రోజులపాటు చీకటి గుహలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ 40 రోజులు కనviral;rakshita;vidya;electricity;coronavirus;helloవామ్మో! చీకటి గుహలో అన్ని రోజులు ఐసొలేషన్ లో వున్నారా...వామ్మో! చీకటి గుహలో అన్ని రోజులు ఐసొలేషన్ లో వున్నారా...viral;rakshita;vidya;electricity;coronavirus;helloWed, 28 Apr 2021 23:00:00 GMTమాములుగా 14 రోజుల పాటు ఐసొలేషన్ లో వుండాలంటేనే నరకంలా ఉంటుంది.ఒకే చోట ఎక్కడికి తిరగకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉండి ఐసొలేషన్ లో వుండాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అంతేగాక చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటిది ఎలాంటి సదుపాయాలు లేని చీకటి గుహలో ఉంటే ఎలా ఉంటుంది. అందులోను 14 రోజులు కూడా ఏకంగా 40 రోజులు ఉంటే ఇంకెలా ఉంటుంది... ఇక అది నరకమే అని చెప్పాలి...అలాంటి ఘటనే అక్కడ జరిగిందట.. వివరాల్లోకి వెళితే...ఫ్రాన్స్‌లో 15 మంది 40 రోజులపాటు చీకటి గుహలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ 40 రోజులు కనీసం బయట ప్రపంచంతో కూడా సంబంధం లేదు. ఈ బృందంలో మొత్తం ఎనిమిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. అయితే, వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నది కరోనా మహమ్మారి వల్ల కాదు. ఓ ప్రయోగం కోసమట.



పైరినీస్ పర్వత ప్రాంతాల్లో ఉన్న అత్యంత లోతైన చీకటి గుహలో కనీసం ఎలాంటి విద్యుత్ దీపాలు కూడా లేకుండా బ్రతికారు.మరో విషయం ఏమిటంటే ఆ చీకటి గుహలో ఉన్నంత సేపు తమకు అలసటగా అనిపించలేదని, చాలా చలిగా అనిపించిందని ఆ గుహలో గడిపిన సభ్యులు తెలిపారు. గుహలో చీకటితోపాటు 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని, తేమ 100 శాతం ఉందన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధం లేకుండా 40 రోజులు, 40 రాత్రులు గుహలో గడిపారని పరిశోధకులు తెలిపారు. చీకటి నుంచి బయటకు వచ్చిన వీరంతా కాంతిని చూడలేక ఇబ్బందిపడ్డారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన కళ్లజోళ్లు ఇచ్చారు. హ్యూమన్ అడాప్షన్ ఇనిస్ట్యూట్ ఈ పరిశోధన నిర్వహించింది. కరోనా వైరస్ వల్ల చాలామంది ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉంటున్నారని, ఈ సందర్భంగా వారి మానసిక స్థితి అలవాట్లు ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. చీకటి గుహలో ఉండటం వల్ల వారంతా రాత్రి, పగలు తేడా తెలియకుండా గడిపారని పరిశోధకులు తెలిపారు. వారు కేవలం నిద్రపోయే సమయాలు ఆధారంగా రోజులు లెక్కించారని తెలిపారు. అయితే, 40 రోజులు గడిచినా.. వారిలో చాలామంది ఇంకా పది రోజులు సమయం ఉందని భావించారన్నారు.అయితే ఆ బృందంలో వున్న అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంతో తిరిగి బయటకు వచ్చారని తెలిపారు.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.
" style="height: 206px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మా హీరోనే తక్కువగా చూస్తావా..? దీపిక పదుకొణేపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా..!

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>