PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sagar7145b15c-226a-4192-91f8-4a0a8a630859-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sagar7145b15c-226a-4192-91f8-4a0a8a630859-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో మళ్ళీ అగ్గి రాజేసే రాజకీయాలకు రగం సిద్ధమవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. తెలంగాణాలో లేటెస్ట్ గా జరిగిన ఉప ఎన్నిక నాగార్జున సాగర్ ఫలితం ఎలా ఉంటుంది అన్న దాని మీద చర్చలు సాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్న వేళ ఒక్క సారిగా రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది. sagar;kcr;nagarjuna akkineni;bharatiya janata party;congress;king;assembly;minister;janareddy;dookuduయమ టెన్షన్ పెడుతున్న సాగర్ రిజల్ట్...?యమ టెన్షన్ పెడుతున్న సాగర్ రిజల్ట్...?sagar;kcr;nagarjuna akkineni;bharatiya janata party;congress;king;assembly;minister;janareddy;dookuduWed, 28 Apr 2021 22:00:00 GMT
తెలంగాణాలో మళ్ళీ అగ్గి రాజేసే రాజకీయాలకు  రగం సిద్ధమవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. తెలంగాణాలో లేటెస్ట్ గా జరిగిన ఉప ఎన్నిక నాగార్జున సాగర్ ఫలితం ఎలా ఉంటుంది అన్న దాని మీద చర్చలు సాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్న వేళ ఒక్క సారిగా రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ఇటు టీయారెస్ హోరా హోరీ పోరాడాయి. మధ్యలో బీజేపీ కూడా గట్టిగానే తలపడింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత కె జానారెడ్డికి మాత్రం విజయావకాశాలు ఉన్నాయన్న మాట అయితే మొదటి నుంచి ఉంది. ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడారు. పైగా అక్కడ ఆయనకు పట్టుంది.

ఇక అనుభవం వయసు అన్నీ కలసి జానారెడ్డికి ఈసరి విజయం కచ్చితంగా సాధించి పెడతాయి అంటున్నారు. మరో వైపు చూస్తే గెలుపు మీద డౌట్ ఉండబట్టే చివరి నిముషంలో కేసీయార్ సాగర్ లో ఎన్నికల ప్రచారం చేశారు అంటున్నారు. మరి కేసీయార్ పెట్టుకున్న ఆశలు కానీ ఆయన పార్టీకి కలసి వచ్చే సమాజిక వర్గ సమీకరణలు కానీ జానారెడ్డి దూకుడుని ఎంత మేరకు అడ్డు కట్ట వేస్తాయి అన్న దామి మీద కూడా చర్చ ఉంది.

అయితే జానారెడ్డి తన రాజకీయ జీవితానికి ఇదే చివరి ఎన్నిక అంటూ సెంటిమెంట్ ని ప్రయోగించారు. పైగా ఆయన వివాదాస్పదుడు కావడం, అందరి మన్ననలు పొందిన నేత కావడంతో జనాలు కూడా ఆయన వైపు టర్న్ అయ్యారు అంటున్నారు. అదే కనుక జరిగితే జానారెడ్డి జయభేరి మోగించడం ఖాయమే. మరి కాంగ్రెస్ కనుక నాగార్జున సాగర్ లో గెలిస్తే టీయారెస్ డేంజర్ బెల్స్ మోగినట్లే. ఇప్పటికే బీజేపీకి దుబ్బాకను వదిలేసుకున్న టీయారెస్ మరో అసెంబ్లీ సీటుని కూడా విపక్షానికి వదిలేసుకుంటే రేపటి ఎన్నికల మీద ఆ ప్రభావం చాలానే చూపుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డెలివ‌రీకి ఒంట‌రిగా వెళ్లా...హ‌రితేజ ఎమోష‌న‌ల్..!

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>