MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb373cf3b56-ac5d-4ac3-959c-131bb780a599-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb373cf3b56-ac5d-4ac3-959c-131bb780a599-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ గురించి, ఆయన గొప్పతనం గురించి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు.. తండ్రికి తగ్గ తనయుడు అని , తండ్రికి ఏ మాత్రం తీసిపోని పుత్రుడు అని చాలామంది పొగడ్తల వర్షం కురిపించారు.. బాలకృష్ణ కూడా చాలా విషయాల్లో చాలామందికి హెల్ప్ చేశాడు అనే పేరుbalayya;ntr;balakrishna;boyapati srinu;prasad;varsha;cinema;nandamuri balakrishna;car;interview;industry;hero;nandamuri taraka rama rao;nirbayaఅతడిని క్షమించమని కోరిన బాలకృష్ణ..కారణం ఏంటి..?అతడిని క్షమించమని కోరిన బాలకృష్ణ..కారణం ఏంటి..?balayya;ntr;balakrishna;boyapati srinu;prasad;varsha;cinema;nandamuri balakrishna;car;interview;industry;hero;nandamuri taraka rama rao;nirbayaTue, 27 Apr 2021 14:00:00 GMTనందమూరి బాలకృష్ణ గురించి, ఆయన గొప్పతనం గురించి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు.. తండ్రికి తగ్గ తనయుడు అని , తండ్రికి ఏ మాత్రం తీసిపోని పుత్రుడు అని చాలామంది పొగడ్తల వర్షం కురిపించారు.. బాలకృష్ణ కూడా చాలా విషయాల్లో చాలామందికి హెల్ప్ చేశాడు అనే పేరు కూడా ఉంది.. ఇంత చేసే బాలయ్య అభిమానుల విషయంలో కూడా ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటాడో అన్న విషయం తెలిసిందే.. అభిమానం హద్దు మీరితే సహించడు నందమూరి బాలకృష్ణ..

బహుశా ఏ ఇండస్ట్రీలో అయినా అభిమానిని కొట్టే, తిట్టే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బాలకృష్ణ అని అని చెప్పాలి.. బాలకృష్ణకు ఒక మంచి అలవాటు ఉంటుంది. అదే ఏ విషయమైనా నిర్మోహమాటంగా నిర్భయంగా బయటకు చెప్పడం.. అందుకే కావచ్చు బాలకృష్ణ అంటే ఇండస్ట్రీ లో కొంతమందికి పడదు.. కాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ ఎలాంటి వాడో వివరించాడు.. సీనియర్ ఫిలిం జర్నలిస్టు లలో ఒకరైన వినాయకరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ గొప్పతనం గురించి చెప్పారు.. తన వైపు తప్పు ఉంటే క్షమించమని కోరడానికి బాలకృష్ణ వెనుకాడరని ఆయన అన్నారు..

తాను ఎన్టీఆర్ పై రెండు పుస్తకాలు రాశానని, యుగానికి ఒక్కడు, యుగపురుషుడు అనే పేర్లతో ఆ పుస్తకాలు ఎంతో ప్రేమతో రాశాను అని వెల్లడించారు వినాయకరావు. ఎన్టీఆర్ పై రాసిన బుక్స్ లాంచ్ కోసం బాలకృష్ణ ను సంప్రదించగా ఆయన వెంటనే బుక్ లాంచ్ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారని వినాయక రావు తెలిపారు.. ఆ సమయంలో బాలకృష్ణ దాసరి నారాయణరావు డైరెక్షన్లో పరమవీరచక్ర సినిమా లో నటిస్తుండటంతో బుక్ లాంచ్ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారని చెప్పుకొచ్చారు..6 గంటల వరకు షూటింగ్ లో పాల్గొన్న బాలకృష్ణ సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ప్రసాద్ లాబ్స్ కి 8:30 కు చేరుకున్నారని వినాయకరావు తెలపగా, లేటుగా వచ్చినందుకు బాలకృష్ణ ఆ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ క్షమాపణ చెప్పడం నన్ను కదిలించింది అన్నారు వినాయకరావు.. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>