WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe5ed37235-6958-48f6-a443-81032cb9bd45-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe5ed37235-6958-48f6-a443-81032cb9bd45-415x250-IndiaHerald.jpgజీవితమనే పయనంలో మన కుటుంబం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అలాగే మన స్నేహితులు, సన్నిహితులు మనతో ఉంటారు. మనం ఎప్పుడూ సత్యం వైపే నిలబడాలి. సత్ప్రవర్తనతో ఇతరుల పట్ల గౌరవంగా మెలగాలి. ఎప్పుడూ మంచి ఆలోచనతో... సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ ఇతరులకు రోల్ మోడల్ గా ఉంటూ.. వీలైనంత వరకు అందరితో సరదాగా ఉంటూ.. ఇతరులకు సహాయ పడుతూ అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. VIJAYAM MEEDHE;deva;jeevitha rajaseskhar;prema;satya;tara;love;war;shaktiవిజయం మీదే: ఇతరులకు సాయం చేయడమే అసలైన విజయం...!విజయం మీదే: ఇతరులకు సాయం చేయడమే అసలైన విజయం...!VIJAYAM MEEDHE;deva;jeevitha rajaseskhar;prema;satya;tara;love;war;shaktiTue, 27 Apr 2021 23:19:30 GMTజీవితమనే పయనంలో మన కుటుంబం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అలాగే మన స్నేహితులు, సన్నిహితులు మనతో ఉంటారు. మనం ఎప్పుడూ సత్యం వైపే నిలబడాలి. సత్ప్రవర్తనతో ఇతరుల పట్ల గౌరవంగా మెలగాలి. ఎప్పుడూ మంచి ఆలోచనతో... సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ ఇతరులకు రోల్ మోడల్ గా ఉంటూ.. వీలైనంత వరకు అందరితో సరదాగా ఉంటూ.. ఇతరులకు సహాయ పడుతూ అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం. సాయం కోసం ఎదురు చూసే వారికి మీ వంతు సహాయం చేస్తూ మానవసేవే మాధవసేవ అని భావించడం ద్వారా ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. 

ఈ జీవితం అనే పడవ ప్రయాణంలో ప్రేమ, జాలి, దయ, కరుణ, వంటి గుణాలను కలిగి నిస్వార్ధంగా పరులకు సహాయపడితే ఆ దేవుడు మనపై కరుణ చూపి మన జీవితాన్ని ఒడ్డుకు తీసుకెళతాడు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగా వుంటుంది. మన ఆలోచనలు ఎంత నిర్మలంగా ఉంటాయో... మన జీవితం అంత అందంగా రూపుదిద్దుకుని మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆపదలో ఉన్న వారికి, ఆదరణ కోరే వారికి మంచి చేయడం వలన, మనకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే మన కుటుంబ సభ్యులకు శ్రీరామరక్ష గా మారుతుంది.

ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి మనం చేసే సాయం వందరోజులు భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేస్తే వచ్చే ఫలితం తో సమానమని పెద్దవాళ్ళు చెబుతుంటారు. సహాయానికి అంతటి శక్తి ఉంది. వీలైనంత వరకు తోటి వారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. అందులోనూ ప్రస్తుతం కరోనా ముంచుకొస్తున్న వేళ మీ సహాయ సహకారాలు ఎంతో అమూల్యమైనవి. కావున కరోనాతో మానవుడు చేస్తున్న యుద్ధంలో ప్రతి మనిషి.. సాటి మనిషికి అండగా  ఉంటూ ఈ మహమ్మారిని తరిమికొట్టాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>