PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscae4304f-10e0-42ac-8c7f-ddcf8b55a71e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscae4304f-10e0-42ac-8c7f-ddcf8b55a71e-415x250-IndiaHerald.jpgమొదట్లో నెగిటివ్ ప్రచారాలు విని కరోనా వ్యాక్సిన్ అంటేనే భయపడిపోయిన ప్రజలు. ఆ తర్వాత ఓ వైపు ప్రభుత్వాలు, మరో వైపు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కి భరోసా ఇస్తూ అవగాహన కల్పించడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.CORONAVIRUS;smart phone;protiens;proteinకని "కరోనా": తొలి టీకా తీసుకున్న నాలుగు రోజులు ఇవి తప్పక పాటించండి...?కని "కరోనా": తొలి టీకా తీసుకున్న నాలుగు రోజులు ఇవి తప్పక పాటించండి...?CORONAVIRUS;smart phone;protiens;proteinMon, 26 Apr 2021 14:00:00 GMTమొదట్లో నెగిటివ్ ప్రచారాలు విని కరోనా వ్యాక్సిన్ అంటేనే భయపడిపోయిన ప్రజలు. ఆ తర్వాత ఓ వైపు ప్రభుత్వాలు, మరో వైపు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కి భరోసా ఇస్తూ అవగాహన కల్పించడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు మాత్రం వారి డాక్టర్ల సలహా మేరకు డాక్టర్ల పర్యవేక్షణలోనే..వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ గానే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని గుర్తు చేస్తున్నారు వైద్య శాస్త్ర నిపుణులు.

కరోనా వ్యాక్సిన్  మొదటి డోసు ఇచ్చిన తర్వాత 28 రోజులకు రెండవ డోసును ఇస్తారు. ఈ పీరియడ్ లో అంటే మొత్తం 42 రోజులకు శరీరంలో ఆంటీబాడీస్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి  అయ్యి వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతాయి అన్నమాట. ఈ క్రమంలో ఆంటీబాడీస్ వృద్ధి చెందే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి బలమైన పోషక ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు , కోడిగుడ్లు, పళ్ళు.. పళ్ళరసాలు ఎక్కువగా తీసుకోవటం మంచిదని చెబుతున్నారు.  ఇకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులు, ఈ ఆంటీ బాడీస్ అభివృద్ధి చెందే సమయంలో  మరియు రెండవ డోసు తీసుకునే 10 నుండి15 రోజుల వరకు ధూమపానం, మద్యపానం చేయకూడదని సూచిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి.

ఇకపోతే వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న తర్వాత ఎవరికైనా అలర్జీ వంటి సమస్యలు ఎదురైతే, అప్పుడు వారికి సెకండ్ డోసు వేయరు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత... సాధారణంగా జ్వరం, కాస్త ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ ఐదారు రోజులు మించి కొనసాగినా లేక ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా డాక్టర్లను ను సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 104 లేదా 108 నంబర్లకు ఫోన్  చేయాలి. ఆ తర్వాత డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటించాలి. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాలల్లో భూతద్దం పెట్టిన ఏసీబీ, హడావుడిగా వెతుకులాట...!

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>