MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-b9b618b5-71bb-4bdf-8c10-a00595410c56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-b9b618b5-71bb-4bdf-8c10-a00595410c56-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమా ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి కొన్ని వార్తలు హల్చల్ అవుతున్నాయి.. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రేణుదేశాయ్ హీరోయిన్ గా స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జానీ . గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2003 వ సంవత్సరం ఏప్రిల్ 25న ఈ చిత్రం విPAWAN KALYAN;pawan;allu aravind;geetha;johnny;kalyan;kushi;pawan kalyan;renu desai;cinema;director;cancer;christian;wife;heroine;johnny1ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!PAWAN KALYAN;pawan;allu aravind;geetha;johnny;kalyan;kushi;pawan kalyan;renu desai;cinema;director;cancer;christian;wife;heroine;johnny1Mon, 26 Apr 2021 12:00:00 GMT

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమా ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి కొన్ని వార్తలు హల్చల్ అవుతున్నాయి.. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రేణుదేశాయ్ హీరోయిన్ గా స్వీయ  దర్శకత్వంలో వచ్చిన చిత్రం జానీ . గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2003 వ సంవత్సరం ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదలైంది.. ఈ చిత్రం విడుదలై దాదాపు 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో అప్పటి వరకు అపజయం అంటే ఎరుగని రోజులవి. ఇక జానీ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఖుషి. అది ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు..

ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పవన్ నుండి రెండేళ్ల తర్వాత వచ్చిన చిత్రం జానీ కావడంతో,  జానీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. కానీ ఆ అంచనాలను నిజం చేయడంలో జానీ సినిమా పూర్తిగా విఫలమైంది.. ఈ సినిమాలో ఓ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా , ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అబ్బాయిగా పవన్ కళ్యాణ్ మనకు కనిపించాడు. ఇక అతని భార్యగా రేణు దేశాయ్ కూడా కనిపించింది.. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తన భార్య క్యాన్సర్ బారిన పడితే ,ఆమెను ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ కథ. చెప్పడానికి బాగానే ఉన్నా ఆ కథనం చాలా స్లోగా ఉంటుంది .ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉంటుంది .కానీ ఈ సినిమాను  మాత్రం డిజాస్టర్ నుండి కాపాడలేకపోయాడు..

ఇక ఓ సందర్భంలో పవన్సినిమా ఫలితాల గురించి మాట్లాడుతూ .."నేను ఒక కొత్త డైరెక్టర్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాను. కానీ అతను నన్ను  మోసం చేశాడు .సినిమాని బాగా తీయలేదు."  అని అన్నాడు.. ఇక అంటూ తన పైన తనే సెటైర్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్.. అంటే దీని అర్థం తనలో ఉన్న దర్శకుడు తనను మోసం చేశాడంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరో కూతురు.. అయినా ఆఫర్స్ కోసం అలా చేస్తుంది..!!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>