PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao-vs-raghunandan-raof2440a92-5b2d-42ab-96a6-dba66cfa3426-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao-vs-raghunandan-raof2440a92-5b2d-42ab-96a6-dba66cfa3426-415x250-IndiaHerald.jpgమున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ముందునుంచే బీజేపీ సిద్ధిపేట‌పై గురిపెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో అనూహ్య‌రీతిలో విజ‌యం సాధించి తెలంగాణ బీజేపీలో కీల‌క నేత‌గా మారిన ర‌ఘునంద‌న్‌కు సిద్ధిపేట బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. దీంతో సిద్ధిపేట బ‌ల్దియాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆయ‌న‌.. త‌న‌దైన శైలిలో బీజేపీ ప్ర‌చార‌ప‌ర్వాన్ని ఉరుకులుపెట్టిస్తున్నారు. అధిక వార్డుల్లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని హ‌రీష్‌రావుకు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ర‌ఘునంద‌న్‌రావు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుందిharish rao vs raghunandan rao;view;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;minister;local language;central government;dookuduఅక్క‌డుంది హ‌రీష్‌రావు..! ర‌ఘునంద‌న్ వ్యూహాలు ఫ‌లిస్తాయా?అక్క‌డుంది హ‌రీష్‌రావు..! ర‌ఘునంద‌న్ వ్యూహాలు ఫ‌లిస్తాయా?harish rao vs raghunandan rao;view;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;minister;local language;central government;dookuduMon, 26 Apr 2021 10:19:00 GMTబ‌లానికి వ్యూహాన్నిజోడించి దాడికిదిగే సింహాన్ని ఎదుర్కోవాలంటే అదేస్థాయిలో వ్యూహం, తెగువ ఉండాలి.. అలాంట‌ప్పుడే సింహాన్ని మ‌ట్టిక‌రిపించ‌లేక పోయినా దానిపై విజ‌యం సాధించ‌టంలో త‌మ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది.. ఇప్పుడిదే వ్యూహాన్ని బీజేపీ సిద్ధిపేట‌లో అనుస‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. సిద్ధిపేట పేరు చెబితేనే తెరాస డ‌బుల్ షూట‌ర్, మంత్రి హ‌రీష్‌రావు గ‌డ్డ అన్నప‌దం ప్ర‌తీఒక్క‌రి నోట వినిపిస్తుంది. సిద్ధిపేట ప్ర‌జ‌ల‌ను అంత‌లా త‌న‌వైపుకు తిప్పుకున్నాడు హ‌రీష్‌రావు. ప్ర‌స్తుతం సిద్ధిపేట‌లో మున్సిప‌ల్ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. హ‌రీష్‌రావును ఢీకొట్టేందుకు బ‌లం, వ్యూహం, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు తెలిసిన ర‌ఘునంద‌న్‌రావును బీజేపీ రంగంలోకి దింపింది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ముందునుంచే బీజేపీ సిద్ధిపేట‌పై గురిపెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో అనూహ్య‌రీతిలో విజ‌యం సాధించి తెలంగాణ బీజేపీలో కీల‌క నేత‌గా మారిన ర‌ఘునంద‌న్‌కు సిద్ధిపేట బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. దీంతో సిద్ధిపేట బ‌ల్దియాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆయ‌న‌.. త‌న‌దైన శైలిలో బీజేపీ ప్ర‌చార‌ప‌ర్వాన్ని ఉరుకులుపెట్టిస్తున్నారు. అధిక వార్డుల్లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని హ‌రీష్‌రావుకు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ర‌ఘునంద‌న్‌రావు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఇప్ప‌టికే హ‌రీష్‌రావు వార్డువార్డు, గ‌ల్లీగ‌ల్లీకి తిరుగుతూ ఓట‌ర్ల‌ను క‌లుస్తున్నాడు. బీజేపీ వ‌ల్ల అయ్యేది ఏమీలేద‌ని, తెరాస అభ్య‌ర్థుల గెలుపుతోనే మ‌నం మ‌న సిద్ధిపేట‌ను మ‌రింత అభివృద్ధి చేసుకోవ‌చ్చ‌ని హ‌రీష్‌రావు ఓట‌ర్ల‌కు వివ‌రిస్తున్నారు.

హ‌రీష్‌రావుకు ధీటుగా ర‌ఘునంద‌న్‌రావుసైతం త‌న‌దైన మాట‌ల చాతుర్యంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాడ‌ట‌. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో జ‌రిగిన ల‌బ్ధి, కేంద్రం నిధుల‌తో జ‌రిగిన అభివృద్ధిని ర‌ఘునంద‌న్‌రావు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్తున్నారు. దీనికితోడు సిద్ధిపేట మున్సిపాలిటీలో మెడిక‌ల్ క‌ళాశాల‌, రాబోయే రైల్వే లైన్‌, న‌వోద‌య కేంద్రీయ విద్యాల‌యం, అమృత్ ప‌థ‌కం ద్వారా వ‌చ్చిన నిధులు, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ద్వారా వ‌చ్చిన నిధులు వంటి అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ బీజేపీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్న‌ట్లు స్థానికంగా చ‌ర్చ‌సాగుతుంది. ర‌ఘునంద‌న్‌రావు ప్ర‌చార దూకుడుతో క్యాడ‌ర్‌లోనూ ఉత్సాహం వ‌స్తుంద‌ట‌. ర‌ఘునంద‌న్‌రావుకు తోడు రాష్ట్ర, కేంద్ర స్థాయి బీజేపీ నేత‌లుసైతం ప్ర‌చారంలోకి వ‌స్తుండ‌టంతో హ‌రీష్‌రావుకు ఈ ద‌ఫా సిద్ధిపేట‌లో చేదు అనుభ‌వం ఎదుర‌వ‌క త‌ప్ప‌దా అన్నచ‌ర్చ తెర‌పైకి వ‌స్తుంది. తెరాస శ్రేణులు మాత్రం సిద్ధిపేట‌లో హ‌రీష్‌రావును ఢీకొట్టి కార్పొరేష‌న్‌ను కైవ‌సం చేసుకొనే స‌త్తా ఏ పార్టీకి లేద‌ని, మ‌ళ్లీ సిద్ధిపేట మున్సిపాలిటీపై ఎగిరేది తెరాస జెండానే అంటూ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. మ‌రి హ‌రీష్‌రావుకు ర‌ఘునంద‌న్‌రావు ఎలాంటి పోటీ ఇచ్చాడో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>