PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus822982fb-c17b-44a2-83ad-44a31caf240a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus822982fb-c17b-44a2-83ad-44a31caf240a-415x250-IndiaHerald.jpgభారతాన్ని మొత్తం కరోనా కమ్మేసింది. సెకండ్ వేవ్ ఇలా సునామీలా పడిపోతుందని ఎవరూ కనీసంగా కూడా ఊహించలేదు. మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న ట్రాక్ రికార్డ్ ఒక వైపు ఉంది. దనికి తోడు భారత దేశానికి కరోనా ముప్పు పెద్దగా ఉండదన్న అతి ధీమా కూడా ఉంది. caronavirus;indiaకని కరోనా : కరోనాను కట్టడి చేసేది అదొక్కటే...?కని కరోనా : కరోనాను కట్టడి చేసేది అదొక్కటే...?caronavirus;indiaMon, 26 Apr 2021 10:00:00 GMTభారతాన్ని మొత్తం కరోనా కమ్మేసింది. సెకండ్ వేవ్ ఇలా సునామీలా పడిపోతుందని ఎవరూ కనీసంగా కూడా ఊహించలేదు. మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న ట్రాక్ రికార్డ్ ఒక వైపు ఉంది. దనికి తోడు భారత దేశానికి కరోనా ముప్పు పెద్దగా ఉండదన్న అతి ధీమా కూడా ఉంది.

చివరికి ఇవన్నీ కలసి నిర్లక్ష్యాన్ని అటు పాలకులలో ఇటు ప్రజలలో కూడా పెంచేశాయి. దీంతో కరోనా విషయంలో అంతా లైట్ తీసుకున్నారు. ఏప్రిల్ దాకా టైమ్ ఇచ్చిన కరోనా ఇపుడు వీర విహారమే చేస్తోంది. దీనికి ఎవరిది తప్పు అనే కంటే అందరిదీ అనుకుంటేనే బాగుంటుంది. సరే కరోనా నియంత్రణకు ఏం చేయాలి అన్నదే ఇపుడు అంతా ఆలోచించాలి.

కరోనా కట్టడికి మనకు ఉన్న ఏకైక ఆయుధం వాక్సిన్ మాత్ర్రమే. వ్యాక్సిన్ వేసుకుంటే కచ్చితంగా కరోనా తగ్గుతుందా. ఇది నూరు శాతం పని చేస్తుందా, కరోనా మళ్లీ రాదా ఇలాంటి అనుమానాలు ఇది సమయం కాదు, వ్యాక్సిన్ ఇపుడున్న చీకటి పరిస్థితుల్లో ఆశాకిరణం. వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాదం అంచుల నుంచి బయట పడతారు. వ్యాక్సిన్ తీసుకుంటే భయాలు పోతాయి. వ్యాక్సిన్ తో అన్ని రకాలుగా శరీరానికీ మనసుకు కూడా రక్షణ ఉంటుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి వ్యక్సిన్ ఈ సమయంలో చాలా ముఖ్యం. ఇప్పటికే భారత్ వ్యాక్సినేషన్ లో బాగా ముందుంది. ఆ విషయంలో మన దేశం ప్రపంచ రికార్డునే సాధించింది. ఇప్పటికే దగ్గర దగ్గర 15 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయింది.
రోజుకు పాతిక లక్షల మందికి తక్కువ కాకుండా జనాభాకు వ్యాక్సిన్ వేస్తున్నారు.

దాంతో వ్యాక్సిన్ వేసుకోవడం అన్నది అందరి కర్తవ్యం  కావాలి. ఇప్పటికే సినీ ప్రముఖులు, సెలిబ్రిటీలు కూడా ముందుకు కదిలి తామూ వ్యాక్సిన్ వేసుకున్నామని చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారం మరింత ఎక్కువగా జరిగితే వ్యాక్సినేషన్ దేశంలో సాఫీగా సాగుతుంది. దేశంలో అరవై శాతం వ్యాక్సినేషన్ జరిగినా కూడా కరోనాను నియంత్రించడం సులభం అవుతుంది. అంటే 60 నుంచి 70 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ పడాలన్న మాట. ఆ దిశగా భారత్ సాగాలంటే మరి కొన్ని నెలలు అవుతుంది. అంతవరకూ అప్రమత్తంగా ఉండడమే మేలు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్‌పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు: మంత్రి బుగ్గ‌నే రీజ‌నా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>