PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8cb04d06-6625-4709-ba50-64e203960c04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8cb04d06-6625-4709-ba50-64e203960c04-415x250-IndiaHerald.jpgఏమాత్రం కనికరం చూపించని కరోనా... పేద వారు గొప్పవారు అనే స్థాయిని అటుంచితే... పుణ్యాత్ములను సైతం వదలడం లేదు. దుర్మార్గాలు చేసి పాపం మూట కట్టుకునే వారిని... బ్రతికినంత కాలం ఇతరులకు సహాయపడుతూ మానవత్వాన్ని చాటి చెప్పే మంచి వారిని సైతం విడిచి పెట్టడం లేదు.CORONAVIRUS;deva;manu;nijam;v;santoshamకని "కరోనా": పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు...?కని "కరోనా": పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు...?CORONAVIRUS;deva;manu;nijam;v;santoshamMon, 26 Apr 2021 12:09:26 GMTఏమాత్రం కనికరం చూపించని కరోనా... పేద వారు గొప్పవారు అనే స్థాయిని అటుంచితే... పుణ్యాత్ములను సైతం వదలడం లేదు. దుర్మార్గాలు చేసి పాపం మూట కట్టుకునే వారిని... బ్రతికినంత కాలం ఇతరులకు సహాయపడుతూ మానవత్వాన్ని చాటి చెప్పే మంచి వారిని సైతం విడిచి పెట్టడం లేదు. కరోనా సెకండ్ వేవ్ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. వ్యాధి తీవ్రత పెరిగింది, లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే మరణాల రేటు కూడా పెద్ద సంఖ్యలో పెరిగింది. అయితే కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు జరపడానికి కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా రావడం లేదు. వైరస్ వారికి ఎక్కడ సోకుతుందో అనే భయంతో ఆ బాధ్యతలను అంబులెన్స్ సిబ్బంది కి అప్పగిస్తున్నారు.

దాంతో..అంబులెన్సు డ్రైవర్లు, సిబ్బంది కలిసి రూ.25 వేల నుంచి  రూ.40 వేల వరకు డిమాండ్ చేస్తూ... డబ్బులు తీసుకొని.. కుటుంబ సభ్యులు లేకుండానే కరోనా రోగుల శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అలా చేసే సమయంలో వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు చివరి చూపు చూపిస్తున్నారు. మన సంప్రదాయాలను మట్టుపెట్టి... ఎటువంటి తతంగాలు లేకుండానే కరోనాతో మరణించినవారిని  కాల్చేస్తున్నారు. అందులోనూ చాలా చోట్ల... ఒకేసారి నాలుగైదు శవాలను కలిపి కాల్చేస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ తర్వాత కరోనా  మృతుల చితాభస్మాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. ఆ చితాభస్మాలు ఎవరివో కూడా అర్థం కాని పరిస్థితి.. అయినా తీసుకోక తప్పదు.

మంటలలో అధిక వేడితో కాలిన కరోనా మృతులపై వైరస్ ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే... అందుకనే వారి చితాభస్మాలను మరుసటిరోజు తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఏదేమైనా కరోనా కారణంగా మనుషులు చీమల్లా కుప్పలు కుప్పలుగా చనిపోతూ ఉండడం ఒక దారుణం అయితే, వారి అంత్యక్రియలు పద్ధతి ప్రకారం జరగకపోవడం, కనీసం కుటుంబ సభ్యులు దగ్గరుండి చివరి చూపు చూసుకోలేకపోవడం విషాదం. ఇది నిజంగా దయనీయ పరిస్థితులు. ఇలాంటి పరిస్థితిని అనుభవాయిస్తున్న మృతుల కుటుంబాలు ఈ పరిస్తతి పగవాడికి కూడా రాకూడదని దేవుని వేడుకుంటున్నారు. ఇవన్నీ ఎప్పటికి మారుతాయో, మళ్లీ ఎప్పుడు ప్రజలు సంతోషంగా కనబడతారో తెలియని వింత పరిస్థితి. ఇకనైనా ఆ దేవుడు కరుణించి కరోనాను అంతమొందించి.. ఈ విషమ పరిస్థితుల నుండి బయట పడేయాలని కోరుకుందాం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాతిరత్నాలు సినిమా బాలీవుడ్ రీమేక్ లో హీరో ఎవరంటే..!!

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>