PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/warangal-corporationbee33434-f7bb-4586-89a1-a2f0e1963109-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/warangal-corporationbee33434-f7bb-4586-89a1-a2f0e1963109-415x250-IndiaHerald.jpgకార్పొరేష‌న్‌లో ఎన్నిడివిజ‌న్‌ల‌లో మ‌నం గెలుస్తాం.. అస‌లు అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఉంద‌ని తెలుసుకొనేందుకు తెరాస అధిష్టానం స‌ర్వేను నిర్వ‌హిచిన‌ట్లు స‌మాచారం. ఈ స‌ర్వేలో వ‌చ్చిన రిపోర్టుల ఆధారంగా ఇలానే ముందుకెళ్తే కార్పొరేష‌న్‌లో అనుకున్న స్థానాల‌ను గెలుచుకోవ‌టం క‌ష్ట‌మేన‌ని తేలింద‌ట‌. దీంతో అధిష్టానం పెద్ద‌లు రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. డివిజ‌న్‌ల వారీగా అభ్య‌ర్థుల‌ను, ఇన్‌ఛార్జిల‌ను, స్థానిక నేత‌ల‌ను అల‌ర్ట్ చేశార‌ట‌warangal corporation;view;telangana rashtra samithi trs;smart phone;local language;partyవ‌రంగ‌ల్‌లో కారు వ్యూహం బెడిసి కొడుతుందా..! స‌ర్వేలు ఏం చెబుతున్నాయి.?వ‌రంగ‌ల్‌లో కారు వ్యూహం బెడిసి కొడుతుందా..! స‌ర్వేలు ఏం చెబుతున్నాయి.?warangal corporation;view;telangana rashtra samithi trs;smart phone;local language;partyMon, 26 Apr 2021 09:05:00 GMTవ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో తెరాస వ్యూహం బెడిసికొడుతుందా..? స‌ర్వేల్లో ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించ‌టం లేదా..?  ఇప్పుడిదే అంశం ఆ పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తుంద‌ట‌. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. హైద‌రాబాద్ త‌రువాత రాజ‌ధానిగా పేరుగాంచిన ప్రాంతం వ‌రంగ‌ల్ కావ‌టంతో అక్క‌డ కార్పొరేష‌న్‌పై ఎలాగైనా పాగావేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో పార్టీలు ఉన్నాయి. గ‌తంలో అధికార పార్టీ మేయ‌ర్ స్థానాన్ని ద‌క్కించుకుంది. ఈ ద‌ఫాకూడా అత్య‌ధిక డివిజ‌న్‌ల‌లో గెలుపే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు ప్ర‌చారాన్నినిర్వ‌హిస్తున్నారు.

కార్పొరేష‌న్‌లో ఎన్నిడివిజ‌న్‌ల‌లో మ‌నం గెలుస్తాం.. అస‌లు అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఉంద‌ని తెలుసుకొనేందుకు తెరాస అధిష్టానం స‌ర్వేను నిర్వ‌హిచిన‌ట్లు స‌మాచారం. ఈ స‌ర్వేలో వ‌చ్చిన రిపోర్టుల ఆధారంగా ఇలానే ముందుకెళ్తే కార్పొరేష‌న్‌లో అనుకున్న స్థానాల‌ను గెలుచుకోవ‌టం క‌ష్ట‌మేన‌ని తేలింద‌ట‌. దీంతో అధిష్టానం పెద్ద‌లు రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. డివిజ‌న్‌ల వారీగా అభ్య‌ర్థుల‌ను, ఇన్‌ఛార్జిల‌ను, స్థానిక నేత‌ల‌ను అల‌ర్ట్ చేశార‌ట‌. ప్ర‌చారానికి మూడు రోజులే గ‌డువు ఉండ‌టంతో ఎలాగైనా మూడు రోజుల్లో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేఖ‌త‌ను పోగొట్టేందుకు ఆ పార్టీల నేత‌లు ప్ర‌య‌త్నాలు షురూ చేశార‌ని తెలుస్తోంది.

ముఖ్యంగా తెరాస‌కు రెబ‌ల్ అభ్య‌ర్థుల నుంచి ఇబ్బంది ఎదుర‌వుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన అధిష్టానం. స‌ద‌రు డివిజ‌న్‌ల‌పై ఎక్కువగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. తెరాస నుంచి వివిధ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిపొందిన  ఓట‌ర్ల వివ‌రాలు, వారి ఫోన్ నెంబ‌ర్ల‌ను ఇప్ప‌టికే సేక‌రించిన బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌లు రెగ్యుల‌ర్ ప్ర‌చారంతో పాటు ఫోన్ల‌లో అధికార పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓటెయ్యాల‌ని విజ్ఞ‌ప్తులు, ఒత్తిడి చేస్తున్నార‌ట‌. ఒక‌వేళ మీ డివిజ‌న్‌లో తెరాస అభ్య‌ర్థి ఓట‌మిపాలైతే మీరే ఇబ్బందులు ప‌డ‌తార‌ని ఓర‌కంగా బెదిరింపుల‌కుసైతం పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో 50కిపైగా డివిజ‌న్‌ల‌లో గెలుస్తామ‌ని భావిస్తున్న తెరాస‌కు రెబ‌ల్స్ బెడ‌ద‌, ప‌లు డివిజ‌న్‌ల‌లో రౌడీ షీట‌ర్ల‌కు టికెట్ల కేటాయింపు వంటి అంశాలు ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయ‌ని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ లో ఇంత మంచితనం ఉందా...? లేక మానవత్వమా...?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>