PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusc0c7cf6e-b1fd-43dd-8d64-b42c70ed167c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusc0c7cf6e-b1fd-43dd-8d64-b42c70ed167c-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్‌ భారత దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు వస్తున్న దేశంగా ఇప్పుడు భారత్ మారింది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతి గడించిన ఇండియా ఇప్పుడు ఆక్సిజన్ కోసం ప్రపంచ దేశాలను అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. అయితే ప్రపంచంలో మనకు ఉన్న మంచి పేరు ఇప్పుడు మేలు చేస్తోంది. భారత్‌కు సాయం చేస్తామంటూ ప్రపంచ దేశాలు ప్రకటనలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ మనపై సానుభూతి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, చైనా వంటి దేశcoronavirus;india;pakistan;australia;singapore;american samoa;central government;oxygenకని కరోనా : భారత్‌ కరోనా కష్టంపై అమెరికా సంచలన ప్రకటన..?కని కరోనా : భారత్‌ కరోనా కష్టంపై అమెరికా సంచలన ప్రకటన..?coronavirus;india;pakistan;australia;singapore;american samoa;central government;oxygenMon, 26 Apr 2021 06:00:00 GMTకరోనా సెకండ్ వేవ్‌ భారత దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు వస్తున్న దేశంగా ఇప్పుడు భారత్ మారింది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతి గడించిన ఇండియా ఇప్పుడు ఆక్సిజన్ కోసం ప్రపంచ దేశాలను అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. అయితే ప్రపంచంలో మనకు ఉన్న మంచి పేరు ఇప్పుడు మేలు చేస్తోంది. భారత్‌కు సాయం చేస్తామంటూ ప్రపంచ దేశాలు ప్రకటనలు చేస్తున్నాయి.

ప్రపంచ దేశాలన్నీ మనపై సానుభూతి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, చైనా వంటి దేశాలు మద్దతు ప్రకటించాయి. సింగపూర్ వంటి దేశాలు ఆక్సిజన్ అందిస్తున్నాయి. ఫ్రాన్స్‌ కూడా సాయం చేస్తామని ప్రకటించింది. ఇక యూరోపియన్ యూనియన్ కూడా భారత్‌లో పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.. సాయం చేస్తామని ముందుకొచ్చింది. ఇక ఇప్పుడు ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా భారత్‌లో కరోనా పరిస్థితిపై స్పందించింది.  

కరోనాను అదుపు చేయడంలో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా  ముందుకొచ్చింది. కరోనా వ్యాక్సీన్ ముడిపదార్థాలు అందజేయాలని నిర్ణయించింది. కొవిషీల్డ్ టీకా ముడిపదార్థాలు వెంటనే భారత్‌కు పంపాలని అగ్ర రాజ్యం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబాల్‌ ఓ ప్రకటన చేశారు. తనకు అమెరికా ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

అంతే కాదు.. ఇండియాకు ర్యాపిడ్‌ టెస్టు కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈలు పంపాలని కూడా అమెరికా నిర్ణయించింది. అలాగే ఇప్పుడు ఇండియాలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అందుకే ఆక్సిజన్‌ ఉత్పత్తి, సంబంధిత పరికరాలు పంపేందుకు అత్యవసరమైన ఏర్పాట్లు చేస్తోంది అమెరికా. భారత్‌కు సాయం అందించేందుకు ప్రజారోగ్య సలహాదారుల నిపుణుల బృందం భారత్‌కు రాబోతోంది. భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి సాయం చేస్తామని ప్రకటనలు వస్తున్నా.. అసలు ఈ పరిస్థితికి కేంద్రం అనుసరించిన లోప భూయిష్టమైన విధానాలే కారణమన్న విమర్శలు సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రతి ఒక్కరూ బాగుండాలి : రితూ వర్మ

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>