SportsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-14-season20cb78ff-2808-4656-9a97-ad5c19fd3d7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-14-season20cb78ff-2808-4656-9a97-ad5c19fd3d7a-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి వలన మన జీవిత విధానమే మారిపోతోంది. ఇప్పటికే దేశమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రోజు రోజుకి కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోవడం అటు ప్రభుత్వాలను ఇటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. IPL 14 SEASON;ms dhoni;jeevitha rajaseskhar;richard;yajamanya;delhi;hyderabad;cricket;australia;cinema;naga aswin;twitter;chennai;sardar vallabhai patel;anti-corruption bureauఆర్సీబికి కీలక ఆటగాళ్లు దూరం...?ఆర్సీబికి కీలక ఆటగాళ్లు దూరం...?IPL 14 SEASON;ms dhoni;jeevitha rajaseskhar;richard;yajamanya;delhi;hyderabad;cricket;australia;cinema;naga aswin;twitter;chennai;sardar vallabhai patel;anti-corruption bureauMon, 26 Apr 2021 13:00:00 GMT" style="height: 355px;">
కరోనా మహమ్మారి వలన మన జీవిత విధానమే మారిపోతోంది. ఇప్పటికే దేశమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రోజు రోజుకి కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోవడం అటు ప్రభుత్వాలను ఇటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా ప్రభావం వలన అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా ప్రభావం వలన మెల్ల మెల్లగా అన్ని రంగాలు షట్ డౌన్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా మెల్ల మెల్లగా ఈ కరోనా ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ఐపీఎల్ 14 వ సీజన్ మీద పడేలా ఉంది. ఈ సీజన్ ఆరంభానికి ముందు పలు ప్రాంచైజీల ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

తరువాత వారు కరోనా నుండి కోలుకుని వారి జట్లతో కలిశారు. వారిలో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన అక్షర్ పటేల్ మరియు బెంగుళూరు రాయల్ ఛాలంజెర్స్ కి చెందిన దేవదత్ పడిక్కల్ ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టోర్నీకి దూరమవుతున్నానని నిన్న హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ప్రకటించాడు. అశ్విన్ కుటుంబంలో వారికి కరోనా సోకిన కారణంగా టోర్నీ నుండి దూరమవుతున్నానని చెప్పాడు. ఇకపోతే వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న ఆర్సీబి కి ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వారి విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. కాగా తాజాగా ఆర్సీబి కి మరో షాక్ తగిలింది.

ఆజట్టులోని కీలక ఆటగాళ్లు ఇద్దరు టోర్నీ మధ్యలోనే నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. వారిద్దరూ కూడా  ఆస్ట్రేలియా ఆటగాళ్లే కావడం గమనార్హం. ఒకరు ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్ కాగా, మరొకరు మిస్టరీ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా. వీరు దీనికి కారణాన్ని చెబుతూ ఇండియాలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడంతోనే మేము వెళ్ళిపోతున్నామని తెలిపారు. దీనితో ఆర్సీబికి డబల్ షాక్ తగిలినట్లయింది. ఈ విషయాన్ని ప్రాంచైజీ యాజమాన్యం "వారి నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నామని..వారికి మేమెప్పుడూ మద్దతుగా ఉంటామని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. దీని వెనుక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ సూచన మేరకే వీరిద్దరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>