MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-satha-ott-relige-seriese70dd3ae-23d8-4376-b230-c4faacdaa36c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-satha-ott-relige-seriese70dd3ae-23d8-4376-b230-c4faacdaa36c-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలా మంది ఓటీటీ ల వైపు మొగ్గు చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా హీరోయిన్లు సినిమాలను సైతం వదులుకొని , ఓటీటీలో నటించడానికి పోటీ పడుతున్నారు. సాధారణంగా మన దేశంలో ఓటీటీ ప్రవేశించి చాలా రోజులైనా, వాడుకలోకి వచ్చి, పెద్దగా ఊపు వచ్చింది మాత్రం కరోనా కారణంగే. కరోనా తొలి రోజుల్లో ప్రజలు ఇళ్లల్లో ఉండి ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు .ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ తమ ప్రతిభను చూపించేందుకు మన సినిమా జనాలు కూడా ఓటీటీలపై దృష్టి సారించారు.. ఇక ఇదే కోవలో మన టాలీవుడ్ నుండి చాలా మంది హీరోయHEROINES SATHA OTT RELIGE SERIES;shruti;shruti haasan;kajal aggarwal;samantha;sruthi;tamannaah bhatia;bollywood;tollywood;cinema;telugu;producer;love;remake;producer1;heroine;net flixఈసారైనా మన స్టార్ హీరోయిన్స్ ఓటీటీ లో తమ సత్తా ఏంటో చూపిస్తారా.. ?ఈసారైనా మన స్టార్ హీరోయిన్స్ ఓటీటీ లో తమ సత్తా ఏంటో చూపిస్తారా.. ?HEROINES SATHA OTT RELIGE SERIES;shruti;shruti haasan;kajal aggarwal;samantha;sruthi;tamannaah bhatia;bollywood;tollywood;cinema;telugu;producer;love;remake;producer1;heroine;net flixMon, 26 Apr 2021 10:00:00 GMT
ఇటీవల కాలంలో చాలా మంది ఓటీటీ ల వైపు మొగ్గు చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా హీరోయిన్లు సినిమాలను సైతం వదులుకొని , ఓటీటీలో నటించడానికి పోటీ పడుతున్నారు. సాధారణంగా మన దేశంలో ఓటీటీ ప్రవేశించి చాలా రోజులైనా,  వాడుకలోకి  వచ్చి, పెద్దగా ఊపు వచ్చింది మాత్రం కరోనా కారణంగే. కరోనా తొలి రోజుల్లో ప్రజలు ఇళ్లల్లో ఉండి ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు .ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ తమ ప్రతిభను చూపించేందుకు మన సినిమా జనాలు కూడా ఓటీటీలపై దృష్టి సారించారు..

ఇక ఇదే కోవలో మన టాలీవుడ్ నుండి చాలా మంది హీరోయిన్లు కూడా ఓటీటీ ల  వైపు వెళ్లారు
అయితే టాలీవుడ్ టు  బాలీవుడ్ మన హీరోయిన్లకు ఎలా కలసిరాలేదో , ఇక ఓటీటీ ప్రయత్నం కూడా మన హీరోయిన్లకు అలాగే కలిసి రావడం లేదు.. ఇక ఇదంతా పక్కన పెట్టితే,  టాలీవుడ్ నుండి ఓటీటీల  వైపు వెళ్లిన  హీరోయిన్ల జాబితా తీసుకుంటే, ముందుగా గుర్తుకు వచ్చే హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కాజల్ అగర్వాల్ లైవ్ స్ట్రీమింగ్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక సీరీస్ చేసింది.. ఇక ఈ వెబ్ సీరీస్ మొత్తం ఏడు భాషల్లో విడుదల అయినప్పటికీ, ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..

ఇక ఆ తర్వాత శృతి హాసన్.. ఈమె కూడా ప్రధాన పాత్రలో నెట్ ఫ్లిక్స్ లో  పిట్టకథలు అనే ఒక వెబ్ సిరీస్ లో చేసింది. అయితే ఇది హిందీలో లవ్ స్టోరీస్ నుంచి తెలుగులో రీమేక్ చేసి విడుదల చేశారు. అయితే ఇది కూడా బోల్తా కొట్టింది. హిందీలో అంత పేరు తెచ్చుకున్న ఈ సీరీస్ ఇక్కడ జనాలకు మాత్రం పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.. ఆ తర్వాత తమన్నా తన రెండు సీరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహా లో వచ్చిన 11 త్ అవర్ నిరాశపరిచింది .అయితే తమన్నా ఆహా కోసం ఇంకో  సీరీస్ చేయబోతోందని టాక్..


ఇక ఇప్పుడు టాలీవుడ్ లో  మిగిలింది సమంత మాత్రమే..  ఫ్యామిలీ మెన్ 2 సీరీస్ లో  సమంత నటించింది. అయితే ఈ సిరీస్  ఇప్పటికే ఓ టీ టీ లో  విడుదల కావాల్సి ఉంది.  కాకపోతే కొన్ని కారణాల వల్ల నిర్మాత సంస్థ విడుదల చేయలేదు.. అయితే ఇప్పుడు త్వరలోనే విడుదల చేస్తామని పుకార్లు వినిపిస్తున్నాయి.. ఇక ఇప్పటి వరకు కాజల్, తమన్నా శృతిహాసన్ లు కూడా తమ సత్తా ఏంటో ఓటీటీలో చూపుకోలేకపోయారు . ఇప్పుడు సమంతా వల్ల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్‌పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు: మంత్రి బుగ్గ‌నే రీజ‌నా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>