PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus601f94e6-9096-4ad7-837e-0977828caa89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus601f94e6-9096-4ad7-837e-0977828caa89-415x250-IndiaHerald.jpgభారతదేశం ఘోరమైన COVID-19 వేవ్ ను ఎదుర్కుంటోంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ దారుణమైన పరిస్థితుల్లో దేశం ఆక్సిజన్ కొరత కూడా ఎదుర్కొంటోంది. ఆదివారం ఉదయం న్యూయార్క్ నుంచి భారతదేశానికి మూడు వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పంపించబడ్డాయని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా యొక్క A102 విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐదు టన్నుల (5000 కిలోల) ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను కార్గcorona virus;ajith kumar;poorna;india;united states;american samoa;white house;jaan;central government;international;oxygen;house;air india;indian;john;ajit pawar;newyorkఅజిత్ ధోవల్ ఎఫెక్ట్ : భారత్ కు అమెరికా సంపూర్ణ సహకారంఅజిత్ ధోవల్ ఎఫెక్ట్ : భారత్ కు అమెరికా సంపూర్ణ సహకారంcorona virus;ajith kumar;poorna;india;united states;american samoa;white house;jaan;central government;international;oxygen;house;air india;indian;john;ajit pawar;newyorkMon, 26 Apr 2021 08:00:00 GMTభారతదేశం ఘోరమైన COVID-19 వేవ్ ను ఎదుర్కుంటోంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ దారుణమైన పరిస్థితుల్లో దేశం ఆక్సిజన్ కొరత కూడా ఎదుర్కొంటోంది. ఆదివారం ఉదయం న్యూయార్క్ నుంచి భారతదేశానికి మూడు వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పంపించబడ్డాయని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా యొక్క A102 విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐదు టన్నుల (5000 కిలోల) ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను కార్గో రవాణా చేస్తోంది. ఈ మొత్తం సోమవారం మధ్యాహ్నం నాటికి ఢిల్లీకి చేరుకోనుంది. ఈ వైడ్-బాడీ ప్యాసింజర్ విమానం 15 గంటలకు పైగా నిరంతరాయంగా పనిచేస్తుంది.

 "ఫిలిప్స్ అట్లాంటా రవాణా చేసిన ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కాకుండా, ఆక్సిజన్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను మోసే అదనపు విమానాలు శాన్ఫ్రాన్సిస్కో మరియు నెవార్క్ నుండి వందలాది ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ రవాణా చేయడానికి బయలుదేరుతాయి. యుఎస్ నుండి భారతదేశానికి తదుపరి విమానం నెవార్క్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుంది. ఇది రేపు ఢిల్లీలో ల్యాండ్ అవుతుందని భారత ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.  యునైటెడ్ స్టేట్స్ లోని ఇండియన్ మిషన్, ఎయిర్ ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న దాతల నుంచి రవాణా ఖర్చులు మాత్రమే కాకుండా ఆక్సిమీటర్లతో సహా ఇతర వైద్య సామాగ్రిని కూడా ఇండియాకి పంపేందుకు సహాయం  చేయమని అభ్యర్థనలు వస్తున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. "భారతీయ అమెరికన్ సమాజం, ఎన్జిఓలు మరియు సాధారణ వ్యల్తులు కూడా భారతదేశంలో మహమ్మారి ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే వారికి సహాయం చేయడానికి ఉన్న మార్గాల గురించి ఆరా తీస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

 అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ, దారుణమైన COVID-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారతదేశానికి "సహాయం" చేయటానికి అమెరికా నిశ్చయించుకుందని అన్నారు. "మహమ్మారి ప్రారంభ దశలోనే మన దేశ ఆస్పత్రులు తట్టుకోలేక పోతున్న నేపథ్యంలో భారతదేశానికి అవసరమైన సమయంలో సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము" అని బిడెన్ ప్రకటించారు. అంతే కాక కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిసరుకును భారత్‌ కు అందిస్తున్నట్లు కూడా  అమెరికా ప్రకటించింది. COVID-19 కేసులు ఇటీవల పెరగడంతో భారత ప్రజల పట్ల ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తూ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారత కౌంటర్ అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఈ ప్రకటన వెలువడింది. వైట్ హౌస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, సుల్లివన్ భారతదేశానికి అమెరికా తరపున సంఘీభావం తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా COVID-19 కేసులు ఉన్న రెండు దేశాలు యుఎస్ మరియు ఇండియా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: క‌రోనా బాధ్య‌త వాళ్లదే.. క్లారిటీ ఇచ్చేసిన జ‌గ‌న్‌

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?

కని కరోనా : కరోనా గురించి వెరీ బ్యాడ్‌ న్యూస్.. ఇంకో రెండేళ్లు..?

కని కరోనా : భారత్‌ కరోనా కష్టంపై అమెరికా సంచలన ప్రకటన..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : వచ్చే ఎన్నికల తర్వాత పరిస్ధితేంటో చెప్పిన ఎల్లోమీడియా

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>