MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthi798513de-3d3a-4ca6-9e7b-f8326234fc8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthi798513de-3d3a-4ca6-9e7b-f8326234fc8b-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ నటుడు సూర్య సోదరుడైన కార్తి తొలిసారిగా యుగానికి ఒక్కడు సినిమా ద్వారా నటుడిగా సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆవారా మూవీ ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు కార్తి. ఇక అక్కడి నుంచి వరుసగా హీరోగా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న కార్తీ ఇటీవల మంచి సక్సెస్ లతో మరింత పాపులారిటీ, క్రేజ్, మార్కెట్ దక్కించుకున్నారు. కొన్నాళ్ల క్రితం కార్తీ హీరోగా తెరకెక్కి రిలీజ్ అయిన ఖైదీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సkarthi;karthik;kumaar;geetha;raasi;rashmika mandanna;surya sivakumar;cinema;sangeetha;kanna lakshminarayana;tamil;audience;blockbuster hit;karthik siva kumar;khaidi.;vegetable market;heroine;gv prakash;success;posters;yuva;sultan;khaidi newసర్దార్ గా రానున్న కార్తీ ..... ఫస్ట్ లుక్ రిలీజ్ ....!!సర్దార్ గా రానున్న కార్తీ ..... ఫస్ట్ లుక్ రిలీజ్ ....!!karthi;karthik;kumaar;geetha;raasi;rashmika mandanna;surya sivakumar;cinema;sangeetha;kanna lakshminarayana;tamil;audience;blockbuster hit;karthik siva kumar;khaidi.;vegetable market;heroine;gv prakash;success;posters;yuva;sultan;khaidi newSun, 25 Apr 2021 17:00:00 GMTతమిళ స్టార్ నటుడు సూర్య సోదరుడైన కార్తి తొలిసారిగా యుగానికి ఒక్కడు సినిమా ద్వారా నటుడిగా సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆవారా మూవీ ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు కార్తి. ఇక అక్కడి నుంచి వరుసగా హీరోగా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న కార్తీ ఇటీవల మంచి సక్సెస్ లతో మరింత పాపులారిటీ, క్రేజ్, మార్కెట్ దక్కించుకున్నారు. కొన్నాళ్ల క్రితం కార్తీ హీరోగా తెరకెక్కి రిలీజ్ అయిన ఖైదీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

ఇటీవల భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కిన సినిమా సుల్తాన్. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుల్తాన్ గా నటించిన కార్తీ పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే కార్తి తాజాగా నటిస్తున్న సినిమాకి సర్దార్ అనే టైటిల్ నిర్ణయించారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి సాంగ్స్ అందిస్తున్నారు.

మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకునే కథ కథనాలతో ఈ సినిమా రూపొందుతుందని ఇక ఈ సినిమాలో కార్తీక్ ఒక నడి వయస్కుడైన వ్యక్తిగా నటిస్తున్నారని అలానే ఈ సినిమాని కార్తీక్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు మిత్రన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని టాక్. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకొని సూపర్ హిట్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి రేపు రిలీజ్ తర్వాత ఈ సినిమా కార్తీకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వరకు వెయిట్ చేయక తప్పదు..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>