PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus8a3d3718-7a24-48dc-b2fa-e76c3c988378-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus8a3d3718-7a24-48dc-b2fa-e76c3c988378-415x250-IndiaHerald.jpgదేశంలోని 135 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాల్ని కేంద్రం అందిస్తోంది. అది కూడా రెండు నెలల పాటు పది కేజీల చొప్పున‌ ఇస్తారు.బహిరంగ మార్కెట్లో కిలో రూ.40చొప్పున పది కేజీలకు రూ.400 అవుతుంది. కరోనాపై ప్రజల ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక్కో మనిషిపై కేంద్రం పెడుతున్న ఖర్చు రూ.400. మొత్తం కలిపి రూ.26వేల కోట్లు అవుతోంది. సంవత్సరం వ్యవధిలో ఈ రూ.26వేల కోట్లు వైద్యసౌకర్యాల కల్పనపై ఖర్చుపెట్టి ఉంటే కరోనా రెండోదశకు దేశం చిగురుటాకులా ఒణికిపోవాల్సిన అవసరం ఉండేదికాcorona virus;tara;cricket;west bengal - kolkata;central governmentకని కరోనా: రూ.400తో క‌రోనా త‌గ్గిపోతుందా??కని కరోనా: రూ.400తో క‌రోనా త‌గ్గిపోతుందా??corona virus;tara;cricket;west bengal - kolkata;central governmentSun, 25 Apr 2021 09:03:14 GMT
దేశంలోని 135 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాల్ని కేంద్రం అందిస్తోంది. అది కూడా రెండు నెలల పాటు పది కేజీల చొప్పున‌ ఇస్తారు.బహిరంగ మార్కెట్లో కిలో రూ.40చొప్పున పది కేజీలకు రూ.400 అవుతుంది. కరోనాపై ప్రజల ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక్కో మనిషిపై కేంద్రం పెడుతున్న ఖర్చు రూ.400. మొత్తం కలిపి రూ.26వేల కోట్లు అవుతోంది. సంవత్సరం వ్యవధిలో ఈ రూ.26వేల కోట్లు వైద్యసౌకర్యాల కల్పనపై ఖర్చుపెట్టి ఉంటే కరోనా రెండోదశకు దేశం చిగురుటాకులా ఒణికిపోవాల్సిన అవసరం ఉండేదికాదు.

ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు కావాలి!
ఏడాది క్రితం కరోనా కార‌ణంగా గజగజలాడిపోయాం. రాబోయే ముప్పును ప‌సిగ‌ట్టి అందుకు తగ్గట్లుగా సిద్ధం కావటమ‌నేది ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యంగా మారింది. అలాంటిది దేశాన్ని పాలించే పాల‌కులు ఇంకా ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి? అలాంటిదేమైనా ఈ సంవ‌త్స‌రంలో జ‌రిగిందా? అంటే లేద‌ని క‌రాఖండిగా చెప్ప‌వ‌చ్చు. దేశ ప్ర‌జ‌ల కోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నాని చెప్పే ప్ర‌ధాన‌మంత్రి  కరోనా 2.0ను ఎందుకు గుర్తించలేకపోయారు? అన్నది ప్రశ్న. గుర్తించారుకానీ ప‌ట్టించుకోలేద‌న్న‌ది ప్ర‌తిప‌క్షాల భావ‌న‌గా ఉంది. ఎందుకంటే ప్ర‌ధాన‌మంత్రికి ప‌శ్చిమ బెంగాల్ కావాలి.. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఐపీఎల్ కావాలి.. భ‌క్తి కోసం కుంభ‌మేళా కావాలి.. ప్ర‌జ‌ల‌కు వినోదం కావాలి.. రాష్ట్రాలకు ఆదాయం కావాలి.. ఎవ‌రికి కావ‌ల్సింది వారు చూసుకుంటున్నారుకానీ క‌రోనాను మాత్రం ప‌ట్టించుకోలేదు. ప్రజల శ్రేయస్సు ఎవ‌రికీ అక్క‌ర్లేకుండా పోయింది.

పోయిన ప్రాణాలు తిరిగి వ‌స్తాయా?
ఎనిమిది ద‌శ‌ల్లో బెంగాల్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టింప‌చేసి దృష్టి మొత్తం రాజ‌కీయాల‌పై పెట్టిన ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల సంక్షేమం ఎందుకు ప‌డుతుంది? జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే క‌రోనాతో చికిత్స పొందుతూ ఆక్సిజ‌న్ అంద‌క మ‌ర‌ణించిన‌వారి ప్రాణాల‌ను ఎవ‌రు తిరిగితెస్తారు? మ‌నిషికి రూ.400 చొప్పున రూ.26వేల కోట్ల తిండిగింజ‌లిస్తే శ‌రీరంలోకి ప్ర‌వేశించిన వైర‌స్ బ‌య‌ట‌కు వెళ్లిపోతుందా?  బెంగాల్‌లో విజ‌యం సాధిస్తే దేశం నుంచి క‌రోనా రూపుమాసిపోతుందా?  క్రికెట్ స్టేడియాల్లో అభిమానులు లేకుండా మ్యాచ్‌లు జ‌రిగితే క‌రోనా సోక‌దా?  కుంభ‌మేళా ఇప్పుడు క‌రోనా హాట్‌స్పాట్‌గా మార‌లేదా?... ఎవ‌రు చెపుతారు ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధానం అని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. మౌన‌మే నా భాష ఓ మూగ‌మ‌న‌సా అనే పాల‌కులున్నంత‌కాలం క‌రోనా భార‌తం ఇలాగే ఉంటుంది!!.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>