MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-aiswarya-break-upda242b6a-5c7e-4bdf-8e76-314fae950783-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-aiswarya-break-upda242b6a-5c7e-4bdf-8e76-314fae950783-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక రంగుల ప్రపంచం. ఒక్కసారి ఈ రంగంలోకి అడుగు పెట్టామంటే మనకు తెలియకుండానే ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతాము. ఇలా కొంతమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇలా సహనటులుగా ఉన్న సమయంలోనే మాటా మాటా కలిసి, మనసు మనసు కలిసి ప్రేమలో పడతారు. కానీ కొందరి విషయంలో ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంటుంది. SALMAN-AISWARYA-BREAK UP;salman khan;shahrukh khan;aishwarya;ali;jeevitha rajaseskhar;prema;tara;vishwa;american samoa;bollywood;cinema;rajani kanth;marriage;love;industry;director;hero;heroine;traffic police;father;prema katha;sharukh khan;santosham"ఐశ్వర్య - సల్మాన్" ల బ్రేకప్ కు కారణం తెలిస్తే షాక్ అవుతారు...?"ఐశ్వర్య - సల్మాన్" ల బ్రేకప్ కు కారణం తెలిస్తే షాక్ అవుతారు...?SALMAN-AISWARYA-BREAK UP;salman khan;shahrukh khan;aishwarya;ali;jeevitha rajaseskhar;prema;tara;vishwa;american samoa;bollywood;cinema;rajani kanth;marriage;love;industry;director;hero;heroine;traffic police;father;prema katha;sharukh khan;santoshamSun, 25 Apr 2021 11:00:00 GMTసినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక రంగుల ప్రపంచం. ఒక్కసారి ఈ రంగంలోకి అడుగు పెట్టామంటే మనకు తెలియకుండానే ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతాము. ఇలా కొంతమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇలా సహనటులుగా ఉన్న సమయంలోనే మాటా మాటా కలిసి, మనసు మనసు కలిసి ప్రేమలో పడతారు. కానీ కొందరి విషయంలో ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంటుంది. కానీ మరి కొందరి జీవితంలో ప్రేమతోనే ఆగిపోతుంది. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. అందులో ఒక మంచి ఉదాహరణ సల్మాన్ ఖాన్ ప్రేమాయణం. అప్పట్లో అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ ని వివాహం చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు.

అయితే వీరి ప్రేమ విఫలం కావడానికి సల్మాన్ కారణం అని ఇప్పటికీ అతని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అసలేం జరిగిందో చూద్దాం. ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీ కి వచ్చే సమయంలో సల్మాన్ ఖాన్ ఒక సూపర్ స్టార్. కానీ అప్పటికే సల్మాన్ సోమి అలీ తో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సమయం అది. సల్మాన్ ఖాన్ ఆ సమయంలో 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు మంచి హీరోయిన్ కోసం డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ వెతుకుతున్నాడు. అప్పుడు సల్మాన్ అప్పటికే తనకు పరిచయం అయిన ఐశ్వర్యారాయ్ ను చూపిస్తాడు. డైరెక్టర్ ఆమెను నచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా పూర్తయేలోపు వీరిద్దరూ ప్రేమలో పడిపోతారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న సోమి అలీ మనసు విరిగిపోయి సల్మాన్ మీద కోపంతో అమెరికా వెళ్ళిపోతుంది.

ఇదే సమయంలో సల్మాన్ కుటుంబంతో ఐశ్వర్య బాగా దగ్గరయింది. కానీ ఐశ్వర్య తల్లితండ్రులకు ఈమె చేసిన పని నచ్చలేదు. ఇందులో మనస్పర్థలు వచ్చి తనే విడిగా ఒక అపార్ట్మెంట్ తీసుకుని జీవించడం మొదలెట్టింది. సల్మాన్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఈ విషయాన్ని పలు సార్లు ఐశ్వర్యను అడిగాడు. కానీ అప్పుడప్పుడే నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో పెళ్లి వద్దనేది ఆమె ఆలోచన. ఈ విషయంపై ఐశ్వర్య ఎటూ తేల్చకపోవడంతో సల్మాన్ అభద్రతా భావానికి లోనయ్యాడు. ఆ తరువాత ఒకరోజు సల్మాన్ అర్ధరాత్రి సమయంలో ఐశ్వర్య ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్ళి తలుపులను గట్టిగా కొట్టడం...తాను ఎంతకీ తీయకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో డోర్ తీసింది. ఇది చుట్టుపక్కల ఉన్న వారి మాట. ఆ తరువాత ఐశ్వర్య తండ్రి పోలీస్ కేసు పెట్టడం జరిగింది.

కానీ అప్పుడు కూడా సల్మాన్ నేను చేసింది తప్పు కాబట్టే కేసు పెట్టారు అని వారినే సమర్ధించారట. అంతే కాకుండా ఒకసారి సినిమా షూటింగ్ సమయంలో సెట్ కి వెళ్లి ఐశ్వర్యపై అరిచాడట, అడ్డొచ్చిన హీరో షారుఖ్ ఖాన్ మరియు డైరెక్టర్ మీద కూడా కోప్పడ్డాడని సమాచారం. దానితో ఆ సినిమా నుండి ఐశ్వర్యారాయ్ ని తొలగించారట. ఇక చేసేదేమీలేక ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ చేసుకోవడానికి 2002 మార్చిన నిర్ణయించుకుంది. ఇలా సల్మాన్ ఖాన్ యొక్క తొందరపాటు తనమే ఐశ్వర్యతో విడిపోవడానికి ప్రధాన కారణం అయింది. ఆ తరువాత సల్మాన్ తో ఐశ్వర్య మళ్ళీ నటించలేదు. ఇలా వారి ప్రేమ కథ ముగిసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: మేలో రోజుకు అన్ని ల‌క్షల కేసులా... భార‌త్ నాశ‌న‌మేనా ?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>