MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunae633a749-54dd-4a53-89f9-842fc78a87a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunae633a749-54dd-4a53-89f9-842fc78a87a1-415x250-IndiaHerald.jpgతెలుగు పరిశ్రమలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున. సినిమాల్లోకి వచ్చి దాదాపు 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న మన్మథుడు ఇప్పటికీ నవమన్మధుడిలానే కనిపించడం విశేషం. అంతే కాకుండా అరవై ఏళ్ల వయస్సులోనూ నాగ్ కుర్రహీరోలకు పోటీ ఇస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు చేస్తే అన్నీ క్లాస్ సినిమాలు లేదంటే అన్నీ మాస్ సినిమాలు చేస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం ఏ జోనర్ వదిలిపెట్టకుండా అన్ని జోనర్ లను కవర్ చేయడం ఆయనNAgarjuna;nagarjuna akkineni;tollywood;cinema;genre;interview;hero;heroine;traffic police;romantic;nuvve kavali;annamayya;mass;loverనేషనల్ లెవల్ వెబ్ సిరీస్ తో రాబోతున్న నాగార్జున..!నేషనల్ లెవల్ వెబ్ సిరీస్ తో రాబోతున్న నాగార్జున..!NAgarjuna;nagarjuna akkineni;tollywood;cinema;genre;interview;hero;heroine;traffic police;romantic;nuvve kavali;annamayya;mass;loverSun, 25 Apr 2021 22:18:00 GMTతెలుగు పరిశ్రమలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున. సినిమాల్లోకి వచ్చి దాదాపు 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న మన్మథుడు ఇప్పటికీ నవమన్మధుడిలానే కనిపించడం విశేషం. అంతే కాకుండా అరవై ఏళ్ల వయస్సులోనూ నాగ్ కుర్రహీరోలకు పోటీ ఇస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు చేస్తే అన్నీ క్లాస్ సినిమాలు లేదంటే అన్నీ మాస్ సినిమాలు చేస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం ఏ జోనర్ వదిలిపెట్టకుండా అన్ని జోనర్ లను కవర్ చేయడం ఆయన ప్రత్యేకత. ఎన్నో మాస్ సినిమాలతో అలరించిన నాగ్..మన్మథుడు, నువ్వే కావాలి సినిమాలతో లవర్ బాయ్ లా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి లాంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పటికీ నాగ్ ప్రయోగాలు చేయడం అంటే ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సినిమా కూడా ఒక ప్రయోగమనే చెప్పాలి. ఈ సినిమాలో సీక్రెట్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నాగ్ నటించగా..సినిమాలో ఒక్క పాట గాని...రొమాంటిక్ సీన్లు గాని లేవు.

ఇక ఎప్రిల్ 2న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ టాక్ రాగా ఓటీటీని మాత్రం షేక్ చేస్తోంది. దాదాపు ఐదు భాషల్లో ఓటీటీ విడుదల చేసిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో నాగ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా నేరుగా ఓటీటీ పై మెరిసేందుకు నాగ్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ..ఓటీటీ లో డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అన్నారు. అంతే కాకుండా తనకు రెండు నేషనల్ వెబ్ సిరీస్ లలో నటించే ఆఫర్ వచ్చిందని చెప్పారు. ప్రస్థుతం అవి పరిశీలనలో ఉన్నాయని..ఖచ్చితంగా ఓకే అవుతాయని వెల్లడించారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు హీరోయిన్ లు వెబ్ సిరీస్ లలో అలరిస్తున్నారు. కానీ హీరోలు మాత్రం వెబ్ సిరీస్ లలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక నాగర్జున వెబ్ సిరీస్ లు మొదలు పెడితే మరికొందరు టాప్ హీరోలు కూడా నాగ్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా డిఫరెంట్ కథలు రావడానికి ఆస్కారం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>