MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/anasuya-will-appear-in-a-negative-rolec56a89ad-2e12-405d-a6c1-d3f5904ce1ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/anasuya-will-appear-in-a-negative-rolec56a89ad-2e12-405d-a6c1-d3f5904ce1ab-415x250-IndiaHerald.jpgబుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్డస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రేక్షకులను తన మాటలతో మైమరిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.Anasuya;ram charan teja;kumaar;anasuya bharadwaj;arjuna;krishna vamshi;ram pothineni;ravi teja;sukumar;sunil;tollywood;cinema;silver;ranga marthanda;anasuya 1నెగిటివ్ రోల్ లో కనిపించనున్న అనసూయ..!నెగిటివ్ రోల్ లో కనిపించనున్న అనసూయ..!Anasuya;ram charan teja;kumaar;anasuya bharadwaj;arjuna;krishna vamshi;ram pothineni;ravi teja;sukumar;sunil;tollywood;cinema;silver;ranga marthanda;anasuya 1Sun, 25 Apr 2021 11:00:00 GMTబుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్డస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రేక్షకులను తన మాటలతో మైమరిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం అనసూయ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అనసూయ కథనం సినిమాతో వెండి తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ అందాల యాంకరమ్మకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటించింది.

ఇక ఈ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుకుంది. ఇక స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ తోనే కాదు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలోనూ నటించింది అనసూయ.

అయితే ఈ అమ్మడు ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తుంది. అలాగే సుకుమార్, అల్లు అర్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో అనసూయ కనిపించనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నారు. అనసూయ సునీల్ కు జోడీగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్.

అంతేకాదు.. ఆమె పాత్రను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట సుకుమార్. అంతే కాదు ఆమె ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడనుందట. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాతోపాటు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తుంది. అలాగే  ‘ది చేజ్’ ‘థాంక్ యు బ్రదర్’ వంటి సినిమాలలో కూడా నటిస్తోంది ఈ రంగమ్మత్త.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: మేలో రోజుకు అన్ని ల‌క్షల కేసులా... భార‌త్ నాశ‌న‌మేనా ?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>