Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricket0f6ef3d8-3864-4581-b838-75826a6eacfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricket0f6ef3d8-3864-4581-b838-75826a6eacfb-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో గుర్తింపు ఉన్న సౌత్‌ఆఫ్రికా ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉంది. అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశపు క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్‌కు ఏకంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభం కారణంగా సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. సౌతాఫ్రికా ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వినియోగించుకుని..cricket;sports;cricket;south africa;government;international;sara shrawanఅంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న సౌత్‌ఆఫ్రికా..!అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న సౌత్‌ఆఫ్రికా..!cricket;sports;cricket;south africa;government;international;sara shrawanSun, 25 Apr 2021 11:39:28 GMTఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో గుర్తింపు ఉన్న సౌత్‌ఆఫ్రికా ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉంది. అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశపు క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్‌కు ఏకంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభం కారణంగా సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. సౌతాఫ్రికా ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వినియోగించుకుని సీఎస్‌ఏ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు సిద్దం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఓ నోటీసు కూడా అందినట్లు తెలుస్తోంది. సీఎస్‌ఏలో సమస్యల పరిష్కారానికి బోర్డు సభ్యులు ఏకాభిప్రాయానికి రాకుంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఆ నోటీసులోని సారాంశం.

ఒకవేళ ఈ నోటీసు అమలైతే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో సీఎస్‌ఏ స్థానం కోల్పోతుంది. అంటే ఐసీసీ పరిథి నుంచి బయటకు వెళ్లిపోతుంది. అదే జరిగితే ఐసీసీ పరిథిలో జరిగే ఏ క్రికెట్ టోర్నీలో కూడా  సౌతాఫ్రికా జట్టు పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది.

ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని దేశాల క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం వల్ల ఆయా దేశాల క్రికెట్ బోర్డుల సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది. అయితే, సౌతాఫ్రికా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి సీఎస్‌ఏ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఐసీసీ శుక్రవారం తెలిపింది.

సీఎస్‌ఏలో ఇలాంటి వివాదాలు తరచుగా బయటకొస్తూనే ఉంటాయి. అయితే, గత వారం జరిగిన మీటింగ్‌లో సీఎస్‌ఏ కొత్త రాజ్యాంగాన్ని బోర్డు తాత్కలిక సభ్యుల బృందం ఆమోదించలేదు. ప్రభుత్వం మద్దతుతో రూపొందించిన ఈ రాజ్యాంగం తిరస్కరణకు గురికావడంతో క్రీడా మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా వ్యతిరేకిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సీఎస్‌ఏ తాత్కాలిక బోర్డు ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. ఒకవేళ ఆ చర్చలు ఫలించకపోతే సౌతాఫ్రికా క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కాక తప్పదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌చారానికి కేటీఆర్ దూరం.. గెలుపు బాధ్య‌త‌లు వారివే!

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>