PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress33b409f5-8487-48af-ad26-13c393bc0209-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress33b409f5-8487-48af-ad26-13c393bc0209-415x250-IndiaHerald.jpgఐదు మున్సిపాలిటీల్లోనూ అదే ప‌రిస్థితి. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఏఒక్క మున్సిపాలిటీపైన కాంగ్రెస్ పాగా వేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న కాంగ్రెస్ నేత‌ల నుంచి వినిపిస్తుంది. ఇప్ప‌టికే తీవ్ర క‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ మున్సిపాలిటీల్లోనూ స‌త్తాచాట‌కుంటే ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చసాగుతుంది. ఒక‌వైపు వ‌రుస విజ‌యాల‌తో దూసుకొస్తున్న బీజేపీ, మ‌రోవైపు ష‌ర్మిల రూపంలో పొంచిఉన్న ప్ర‌మాదం. Telangana Congress;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;district;tpcc;mla;minister;dookuduమినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..Telangana Congress;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;district;tpcc;mla;minister;dookuduSun, 25 Apr 2021 15:25:00 GMTతెలంగాణ‌లో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు మినీ పుర‌పోరు రూపంలో అతిపెద్ద స‌వాల్ ఎదురైంది. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ల‌తో పాటు ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే నామినేష‌న్ల ప‌ర్వం పూర్తికావ‌టంతో ప్ర‌చార ప‌ర్వం ప్రారంభ‌మైంది. దీంతో కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం బాటప‌ట్టారు. ముఖ్యంగా ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌ల‌పై కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుంది. మ్యాజిక్‌ఫిగ‌ర్‌కు స‌రిప‌డా డివిజ‌న్‌ల‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌క‌పోయినా క‌నీసం.. రెండ‌వ స్థానంలోనైనా ఉండాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.

ఖ‌మ్మం కార్పొరేష‌న్ కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మ‌ధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క జిల్లా కావ‌డంతో ఎలాగైనా తెరాస‌కు గ‌ట్టిపోటీ ఇవ్వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీనేత‌లు కృషిచేస్తున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌, ప్ర‌చార బాధ్య‌త‌లు భ‌ట్టి తీసుకున్నాడు. కార్పొరేష‌న్‌లో తెరాస బ‌లంగా ఉండ‌టం, మంత్రి పువ్వాడ దూకుడుతో కాంగ్రెస్ ప్ర‌చారం తేలిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. కేవ‌లం ఐదారు డివిజ‌న్‌ల‌లో మిన‌హా కాంగ్రెస్ జెండా ఎగిరే ప‌రిస్థితి లేద‌న్న చ‌ర్చ సాగుతుంది. మ‌రోవైపు వ‌రంగ‌ల్‌లోనూ అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఈ రెండు కార్పొరేష‌న్‌ల‌లో కాంగ్రెస్ రెండ‌వ స్థానం కోసం పోరాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఐదు మున్సిపాలిటీల్లోనూ అదే ప‌రిస్థితి. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఏఒక్క మున్సిపాలిటీపైన కాంగ్రెస్ పాగా వేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న కాంగ్రెస్ నేత‌ల నుంచి వినిపిస్తుంది. ఇప్ప‌టికే తీవ్ర క‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ మున్సిపాలిటీల్లోనూ స‌త్తాచాట‌కుంటే ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చసాగుతుంది. ఒక‌వైపు వ‌రుస విజ‌యాల‌తో దూసుకొస్తున్న బీజేపీ, మ‌రోవైపు ష‌ర్మిల రూపంలో పొంచిఉన్న ప్ర‌మాదం. ఈ రెండింటిని త‌ట్టుకొని క్యాడ‌ర్‌ను కాపాడుకోవ‌టం ఎలాంటి నేత‌కైనా స‌వాలే. మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్‌లోని చాలా మంది ప్ర‌థ‌మ‌, ద్వితీయ శ్రేణి నేత‌లు ష‌ర్మిల పార్టీకానీ, బీజేపీలో కానీ చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కాంగ్రెస్ నేత‌ల్లోనే చ‌ర్చ సాగుతుంది. అదే జ‌రిగితే కాంగ్రెస్ తెలంగాణ‌లో మ‌రో ప‌దేళ్లు వెన‌క్కు పోయిన‌ట్లే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>