PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusdacb1bba-67a0-4e75-a5c8-42c28e5bab01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusdacb1bba-67a0-4e75-a5c8-42c28e5bab01-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తన విజృంభణ కొనసాగిస్తోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రమాదంగా సాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భారీగా పెరిగింది. దేశంలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య చూస్తుంటే... టెన్షన్ తో చమటలు పడుతున్నాయి. ఈ వైరస్ యొక్క ప్రమాద స్థాయి కూడా పెరగడంతో... కరోనా సోకిన ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.CORONAVIRUS;modi;kerala;maharashtra - mumbai;uttarakhand;narendra modi;prime minister;chief minister;uttar pradesh;maharashtra;central government;oxygen;maha;narendra;gaganam;paruguకని "కరోనా": ఆక్సిజన్ కొరతకు బాధ్యులు వీరే...?కని "కరోనా": ఆక్సిజన్ కొరతకు బాధ్యులు వీరే...?CORONAVIRUS;modi;kerala;maharashtra - mumbai;uttarakhand;narendra modi;prime minister;chief minister;uttar pradesh;maharashtra;central government;oxygen;maha;narendra;gaganam;paruguSun, 25 Apr 2021 17:03:03 GMTప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తన విజృంభణ కొనసాగిస్తోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రమాదంగా సాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భారీగా పెరిగింది. దేశంలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య చూస్తుంటే... టెన్షన్ తో చమటలు పడుతున్నాయి. ఈ వైరస్ యొక్క ప్రమాద స్థాయి కూడా పెరగడంతో... కరోనా సోకిన ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులలో బెడ్స్ దొరకడం గగనంగా మారింది. ఇక కరోనా రోగులకు అత్యవసర చికిత్స సమయంలో అవసరమైన అక్సిజన్ కొరత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లది పెద్ద సమస్యగా మారింది.  గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అత్యవసర నిమిత్తం..పిఎం కేర్స్ నుండి పెద్ద ఎత్తున స్వతంత్రం వచ్చినప్పటి నుండి 50000 వెంటిలేటర్లు కొంటే, అయితే లాస్ట్ వన్ ఇయర్ లో 37 వేల వెంటిలేటర్లు కొన్నాము, ఇంకొక 13000 వెంటిలేటర్లు  వివిధ రకాల మిగిలిన నిధుల నుండి సమకూర్చడం జరిగింది. 

ఇలా ఒక్క ఏడాదిలోనే దేశం 50 వేల వెంటిలేటర్లు పోగుచేసి వాటిని అన్ని రాష్ట్రాలకు కేటాయించింది. అయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో... వాటన్నిటిని ఆరోగ్య సిబ్బంది సక్రమంగా వినియోగించక అవన్నీ ఇప్పుడు వినియోగించలేని స్థితిలో పాడైపోయి ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ సమయంలో అవసరం కాగా అవి ఉన్నప్పటికీ వినియోగంలో లేక తుప్పుపట్టిపోవడంతో మళ్లీ వెంటిలేటర్ ల కొరత యధావిధిగా కొనసాగుతోంది.  మరోవైపు ఈ పరిస్థితిని ముందే ఊహించిన ప్రపంచ ఆరోగ్య శాఖ ముందు ముందు ఆక్సిజన్ భారీగా అవసరమవుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ... అన్ని దేశాలకు హెచ్చరించింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు వివరించి... ఆక్సిజన్ ప్లాంట్లకు నిధులు కల్పిస్తామని మీ  ప్రాంతాల్లో ఆక్సిడెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం 10 ఆక్సీజన్ ప్లాంట్ లను నెలకొల్పాడు... కానీ అవి సరిపోవు.

ఉత్తరాఖండ్ కొంత వరకు ఈ అవకాశాన్ని వాడుకుంది. ఇలా అతి తక్కువ రాష్ట్రాలు మాత్రమే వాడాయి... మెజారిటీ రాష్ట్రాలు మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడే ఈ విషయాన్ని పక్కన పెట్టాయి. ఆఖరికి ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న మహారాష్ట్ర, మహా మేధావులు విద్యావంతులు ఉన్న కేరళ రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ ప్లాంట్ లు నెలకొల్పడానికి ముందుకు రాలేదు.  అయితే అదే ఇప్పుడు కీలకమైంది. కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో కరోనా పేషెంట్ లకు ఎవరికీ  ఎమర్జెన్సీ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. అయితే దీనికంతటికీ బాధ్యులెవరు, నిర్లక్ష్యం ఎవరిది అంటే.... ఒక్కసారిగా ఆక్సిజన్ సిలిండర్ లకు వెంటిలేటర్ లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో... అవి సమకూర్చుకోకపోవడం మీదంటే మీది తప్పంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్రాలు ఎవరికీ వారు డబ్బులు వారి దగ్గర ఉన్నా కూడా ఖర్చు పెట్టకుండా..ఎంతసేపు కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడి ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఆ డబ్బులు ఉంటె ఎన్నికల్లో ఓట్ల కోసం ఖర్చు చేయడానికి కాబోలు అంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>