MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-potti-virayya9e8acedd-8511-4eb4-8339-1b0b64f0d8b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-potti-virayya9e8acedd-8511-4eb4-8339-1b0b64f0d8b0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. గట్టు వీరయ్య అంటే వెంటనే పోల్చుకోలేరేమో కానీ పొట్టి వీరయ్య అంటే చాలు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.Potti Virayya;tamil;marriage;kannada;heartటాలీవూడ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య మృతి..!టాలీవూడ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య మృతి..!Potti Virayya;tamil;marriage;kannada;heartSun, 25 Apr 2021 18:57:32 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. గట్టు వీరయ్య అంటే వెంటనే పోల్చుకోలేరేమో కానీ పొట్టి వీరయ్య అంటే చాలు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. తన ఆకారంతోనే పాపులర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

పొట్టి వీరయ్య హైద్రాబాద్ చిత్రపురి కోలనీలో నివాసం ఉంటున్నారు.  వీరయ్యకు గతంలో కొంత అనారోగ్యం చేసి తర్వాత కోలుకున్నారు.
అయితే కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య.. ఆదివారం ఉదయం గుండె పోటు వచ్చింది. దీంతో అతడిని సమీపంలోని ఓ సన్ షైన్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. వీర‌య్య ఆదివారం సాయంత్రం 4.33 నిమిషాలకు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. సోమవారం జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

పొట్టివీరయ్య కేవలం రెండడుగులు ఎత్తు మాత్రమే ఉండేవారు. ఆయన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  భాషలతో పాటు ఒరియా భాషలతో కలుపుకొని దాదాపు 500 సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సారిగా 1969లో విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన యన్టీఆర్ ‘అగ్గివీరుడు’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాను తెరకెక్కించిన  చాలా జానపద చిత్రాల్లో వీరయ్యకు  విఠలా చార్య అవకాశాలు ఇచ్చారు.

ఇండస్ట్రీలో రాధమ్మ పెళ్లి’, ‘జగన్మోహిని’, ‘యుగంధర్‌’, ‘గజదొంగ’, ‘గోల నాగమ్మ’, ‘అత్తగారి పెత్తనం’, ‘టార్జాన్‌ సుందరి’ తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. ఆ సినిమాలతో తెచ్చుకున్న పేరుతో, తన రూపంతో  వివిధ భాషల్లో  ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ఆయన నటించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం  నుంచి కలర్ మూవీస్ వరకూ ఉన్న జెనరేషన్స్ లో నటించి మెప్పించారాయన. వీరయ్యకి  ఇద్దరు పిల్లలు. వీరయ్య మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>