PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virusdccbb64d-cb98-478b-a851-3a92b7079aed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virusdccbb64d-cb98-478b-a851-3a92b7079aed-415x250-IndiaHerald.jpg బెంగాల్లో అధికారంలోకి రావటమే ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వారికి వీలైన స‌మయాల్లో ఎన్నిక‌ల ప్ర‌చార తేదీలు ఖ‌రారు చేసుకోవ‌డంతోపాటు సీఈసీతో ఎనిమిది ద‌శ‌ల ఎన్నిక‌ల తేదీలు కూడా ప్ర‌క‌టింప చేసుకున్నారు. ఇప్ప‌టికి ఆరు ద‌శ‌లు ముగిశాయి. ఇంకా రెండుద‌శ‌లు మిగిలివున్నాయి. ఈనెల 26, 29 తేదీల‌తో అవికూడా ముగియ‌నున్నాయి. మే రెండోతేదీన ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. మ‌మ‌తా బెన‌ర్జీని క‌ట్ట‌డి చేయ‌డానికి వారిద్ద‌రూ చేయ‌ని ప్ర‌య‌corona virus;modi;amit shah;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;amith shah;bihar;minister;central government;partyక‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!corona virus;modi;amit shah;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;amith shah;bihar;minister;central government;partySun, 25 Apr 2021 10:32:17 GMTబెంగాల్లో అధికారంలోకి రావటమే ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వారికి వీలైన స‌మయాల్లో ఎన్నిక‌ల ప్ర‌చార తేదీలు ఖ‌రారు చేసుకోవ‌డంతోపాటు సీఈసీతో ఎనిమిది ద‌శ‌ల ఎన్నిక‌ల తేదీలు కూడా ప్ర‌క‌టింప చేసుకున్నారు. ఇప్ప‌టికి ఆరు ద‌శ‌లు ముగిశాయి. ఇంకా రెండుద‌శ‌లు మిగిలివున్నాయి. ఈనెల 26, 29 తేదీల‌తో అవికూడా ముగియ‌నున్నాయి. మే రెండోతేదీన ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. మ‌మ‌తా బెన‌ర్జీని క‌ట్ట‌డి చేయ‌డానికి వారిద్ద‌రూ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. చేసిన ప‌నీ లేదు!!.

గెలుస్తామ‌నే న‌మ్మ‌కం క‌ల‌గ‌డంలేదు!
ఆరు ద‌శ‌ల్లో పోలింగ్ ముగిసిన త‌ర్వాత క‌మ‌ల‌నాథుల‌కు గెలుస్తామ‌నే న‌మ్మ‌కం క‌ల‌గ‌డంలేద‌ని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే ఫ్రీ వ్యాక్సినేషన్ అంటూ ప్ర‌క‌ట‌న చేశార‌నే గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అధికారంతో సంబంధం లేకుండా జనాలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలంటూ ప్ర‌ధాన‌మంత్రిని ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల‌న్నీ డిమాండ్ చేస్తున్నాయి.  ఒక‌వేళ బెంగాల్‌లో బీజేపీ అధికారం సంపాదించ‌లేక‌పోతే ఉచిత వ్యాక్సిన్ లేన‌ట్లేనా? అనే సందేహం అక్క‌డి ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

గెలిచినా హోదా క‌ష్ట‌మే!
భార‌తీయ జ‌న‌తాపార్టీ కూడా ఎన్నికల సమయంలో తప్పుడు హామీలే ఇస్తుంటుందనే విషయం గతంలోనే రుజువైంది. బీహార్ ఎన్నికల్లో గెలిపిప్తే లక్షల కోట్ల రూపాయ‌ల‌తో ప్యాకేజీ అని స్వయంగా మోడీనే ప్రకటించారు. మోడీ హామీని నమ్మని జనాలు బీజేపీని గెలిపించలేదు. దాంతో ప్యాకేజీ అటకెక్కింది. ఇపుడు పాండిచ్చేరికి ప్రత్యేకహోదా అంటూ మరో హామీ ఇచ్చారు. ఒకవేళ పాండిచ్చేరిలో విజ‌యం సాధించినా ప్రత్యేకహోదా ఇచ్చేది అనుమానమే. ఎందుకంటే ఆ పార్టీ గ‌త చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే హామీల‌ను నిల‌బెట్టుకున్న దాఖ‌లాలు ఎక్క‌డా క‌న‌ప‌డ‌వు.

చ‌వ‌క‌బారు రాజ‌కీయాలు త‌గునా?
అధికారంలోకి రావటానికి బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేట‌ట్లు క‌న‌ప‌డ‌టంలేదు. బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చవకబారు రాజకీయానికి తెరలేపింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చింది. క‌రోనా ఉధృతంగా వ్యాపిస్తూ ప్ర‌జ‌లంతా భ‌యం భ‌యంగా బ‌తుకులు వెళ్ల‌దీస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో కూడా బీజేపీ రాజ‌కీయాలు చేయ‌డ‌మేంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇక‌నైనా త‌మ రాజ‌కీయాల‌న్ని ప‌క్క‌న‌పెట్టి క‌రోనా క‌ట్ట‌డిపై కేంద్రం దృష్టిసారిస్తే మంచిద‌ని నెటిజ‌న్లు పోస్టులు ఎడుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2024 ఎన్నిక‌ల‌పై హింటిచ్చిన `మీడియా అధిప‌తి`..

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>