Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0adee4bb-489b-4951-a02e-8877027c76c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0adee4bb-489b-4951-a02e-8877027c76c4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదంటే వెంటనే ఫ్యాన్స్ చెప్పే సినిమా పోకిరి. మ‌హేష్ బాబును టాలీవుడ్ స్టార్ హీరోగా టాప్ ప్లేస్‌కు చేర్చిన సినిమా ఇది. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి ఎన్నడూ క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు సునామీ సృష్టించింది. అప్పటివరకు ఉన్న ఏన్నో రికార్డులను తిర‌గ‌రాసింది. అల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి..mahesh babu;pawan;cbn;mahesh;mumaith khan;puri jagannadh;tollywood;cinema;rajani kanth;industry;tsunami;pokiri;mass;chitramపోకిరి సినిమా మొదటి టైటిల్ ఇదేనా.. ఎలా మారిందంటే..పోకిరి సినిమా మొదటి టైటిల్ ఇదేనా.. ఎలా మారిందంటే..mahesh babu;pawan;cbn;mahesh;mumaith khan;puri jagannadh;tollywood;cinema;rajani kanth;industry;tsunami;pokiri;mass;chitramSun, 25 Apr 2021 12:14:03 GMTఇంటర్నెట్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదంటే వెంటనే ఫ్యాన్స్ చెప్పే సినిమా పోకిరి. మ‌హేష్ బాబును టాలీవుడ్ స్టార్ హీరోగా టాప్ ప్లేస్‌కు చేర్చిన సినిమా ఇది. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి ఎన్నడూ క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు సునామీ సృష్టించింది. అప్పటివరకు ఉన్న ఏన్నో రికార్డులను తిర‌గ‌రాసింది. అల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలున్నాయి. వాటిలో ఆ సినిమా టైటిల్ కూడా ఒకటి. ఈ సినిమా అంత హిట్ కావడానికి దీని టైటిల్ కూడా అంతే కారణం. అయితే ఈ సినిమాకు మొదట ఆ టైటిల్ అనుకోలేదట. వేరే టైటిల్ అనుకున్నప్పటికీ.. చివరకు పోకిరి టైటిల్‌ను అనుకున్నాడట.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో బ‌ద్రి సినిమా చేస్తున్న స‌మయంలోనే పూరీ జ‌గ‌న్నాథ్ పోకిరి కథ రాసుకున్నాడట. ప‌వ‌న్‌కు దీని కథ కూడా చెప్పాడట. అయితే ఈ స్టోరీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ంటూ పవన్ రిజెక్ట్ చేశాడట. ఆ త‌ర్వాత ర‌వితేజ‌తో చేయాలని కూడా పోకిరి ప్రయత్నించాడట. డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో మాస్ మహారాజ కూడా తప్పుకున్నాడు. అయితే అనుకోకుండా ఓ రోజు మ‌హేష్ బాబుకు పూరీ జగన్నాథ్ ఈ స్టోరీ వినిపించాడట. అయితే స్టోరీ విన్న వెంటనే న‌చ్చ‌డంతో మహేశ్ ఓకే చెప్పాడట. కానీ పూరీ తొలుత ఈ సినిమాకు ఓ టైటిల్ అనుకున్నాడట. ఆ టైటిల్ ఏంటంటే.. ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ. అయితే ఈ టైటిల్ మహేశ్‌కు నచ్చకపోవడంతో, టైటిల్ మార్చాలని పూరికి మహేష్ సలహా ఇచ్చాడ‌ట‌.

మహేష్ సూచనతో పూరి ఆలోచనలో పడ్డాడట. ఆ సమయంలోనే పండు, పోకిరి అనే టైటిల్స్‌ను మహేష్ బాబు స్వయంగా సూచించాడట. అయితే అందులో పోకిరి అనే టైటిల్ నచ్చడంతో పూరి జగన్నాథ్ కూడా ఓకే చేశాడ‌ట‌. అలా ఈ సినిమాకు పోకిరి టైటిల్ ఓకే అయింది.

ఈ సినిమాను 9 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించడం జరిగింది. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2006 ఏప్రిల్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా మూవీ రిలీజ్ కాగా.. మొదట అంతగా హిట్ టాక్ దక్కలేదు. కానీ నెమ్మదిగా.. హిట్ టాక్ దక్కించుకుంది. కొద్ది రోజుల్లోనే జనాలు సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టారు. థియేటర్లు నిండిపోయాయి. ఈ సినిమాలోని పాట‌లు, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ జ‌నాల‌కు ఎంతగానో నచ్చాయి. ఇక సినిమా క్లైమాక్స్‌ సీన్స్ థియేటర్లలో జనాలను కూర్చోనివ్వలేదు. విజిల్స్, కేకలతో దద్దరిల్లేలా చేశాయి. 175 రోజులు ఆడిన ఈ సినిమా.. 75 ఏళ్ల ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఈ సినిమాకు డైలాగులు కూడా పూరీ జ‌గ‌న్నాథ్ స్వయంగా రాసుకున్నాడు. ఆ డైలాగ్స్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలోని ముమైత్ ఖాన్ ఐటం సాగ్ ‘ఇప్ప‌టికింకా నాయ‌వ‌సు..’ ఇప్పటికీ ఐటం సాగ్స్‌లో టాప్ ప్లేస్‌లోనే ఉంటుందనడంలో సందేహం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ విషయంలో జగన్ పట్టుదల చూపిస్తే నష్టపోతారా...?

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>