PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus0bef174c-a7ac-4a4f-8149-86e78ce8c041-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus0bef174c-a7ac-4a4f-8149-86e78ce8c041-415x250-IndiaHerald.jpgకరోనా రోగుల్లో గుండె, ఊపిరితిత్తులపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం పడుతుందని మన అందరికీ తెలిసిందే. అయితే కొవిడ్-19 వ్యాధిగ్రస్తులలో మెదడుపై కూడా ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మెదడుపై పడే దుష్ప్రభావాలు కారణంగానే వాసన తెలియక పోవడం, రుచి కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయని న్యూరోవైద్యనిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ బారిన పడుతున్న రోగులలో అనేక కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలిసినవారిని గుర్తుపట్టక పోవటం, కాళ్లు, చేతులు పని చేయకపోవడం, మూతి వంకరపోవడం వంటి లక్షణాలు కరోనా రcoronavirus;heart;doctor;sugar;oxygen;coronavirusకని "కరోనా": మెదడుపై కూడా తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్న కొవిడ్-19..కని "కరోనా": మెదడుపై కూడా తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్న కొవిడ్-19..coronavirus;heart;doctor;sugar;oxygen;coronavirusSun, 25 Apr 2021 15:00:00 GMTగుండె, ఊపిరితిత్తులపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం పడుతుందని మన అందరికీ తెలిసిందే. అయితే కొవిడ్-19 వ్యాధిగ్రస్తులలో మెదడుపై కూడా ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మెదడుపై పడే దుష్ప్రభావాలు కారణంగానే వాసన తెలియక పోవడం, రుచి కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయని న్యూరోవైద్యనిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ బారిన పడుతున్న రోగులలో అనేక కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలిసినవారిని గుర్తుపట్టక పోవటం, కాళ్లు, చేతులు పని చేయకపోవడం, మూతి వంకరపోవడం వంటి లక్షణాలు కరోనా రోగుల్లో కనిపిస్తుండటం తో నిపుణులు కొత్త అధ్యయనాలు చేయడం ప్రారంభించారు.

కరోనా రోగుల్లో ఇటువంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతాయో తెలుసుకునేందుకు సీటీ స్కాన్, ఎమ్మారై మెడికల్‌ టెస్ట్ చేసి మెదడులో కొన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు తేల్చారు. కరోనా నుంచి రికవరీ అయిన మూడు, నాలుగు నెలల తర్వాత ఇటువంటి దుష్ప్రభావాలు బయట పడుతున్నాయి. డయాబెటిస్, హైబీపీ వ్యాధిగ్రస్తులతో పాటు ఊబకాయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారిలో మాత్రమే ఇలా జరుగుతోందని నిపుణులు తమ పరిశీలనలో గుర్తించారు.

కరోనా కారణంగా నాడీ మండలానికి చెందిన ప్రతి ఒక్కటీ దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. మైలీన్‌ షీత్‌ అనే పొర ద్వారా మెదడు ఇచ్చే ఆదేశాలు నరాలకు చేరుతాయి. మెదడు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా స్పందిస్తూ బాడీలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మైలీన్‌ షీత్‌ పొరకి ఇన్ఫెక్షన్ సోకితే పొర దెబ్బ తిని మైలైటిస్‌ వ్యాధి వస్తుంది. అయితే ఏ అవయవాలపైన మైలీన్‌ షీత్‌ పొర దెబ్బ తింటుందో ఆ అవయవాలకు మెదడు నుంచి ఆదేశాలు అందవు. ఫలితంగా ఆ అవయవం చచ్చుబడి పోతుంది.

అయితే ఈ పొర రెండు మూడు నెలల్లో అదంతట అదే బాగవుతుందని.. అప్పుడు మళ్ళీ అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయని వైద్యులు అంటున్నారు. కాళ్లు, చేతులు చచ్చుపడిపోతే ప్రాణహాని ఉండదు కానీ ఊపిరితిత్తుల పైన మైలీన్‌ షీత్‌ పొర దెబ్బ తింటే అవి పనిచేయక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి రికవర్ అయిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, మాటలు మాట్లాడ లేక తడబడటం, కాళ్లు చేతులు పని చేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ బ్రెయిన్‌ లేదా ఎమ్మారై బ్రెయిన్‌ మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. వైద్యుల సలహాల మేరకు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. కరోనా రోగులు ఇటువంటి లక్షణాలు నుంచి కొద్ది రోజుల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇటువంటి సమస్యలు తగ్గకపోతే డాక్టర్ ని కలిసి సంబంధిత టెస్టులు చేయించుకోవడం అవసరమవుతుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా :వామ్మో! ఏపీలో ఆ ఐదు జిల్లాల్లో కరోనా విలయతాండవం....

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>