Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/illiana0431ad4d-ab88-430f-890b-49e1748f1f36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/illiana0431ad4d-ab88-430f-890b-49e1748f1f36-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇలియానా డీక్రూజ్ ఉంది. ఇక్కడ స్టార్‌డమ్‌తో అక్కడ కూడా మంచి ఆఫర్లు పట్టేయొచ్చని ఇలియానా అనుకుంది. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఇక బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయినట్లే అనుకుంది. ఇలియానా టాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోయే..ILLIANA;ajay devgn;akshay kumar;kumaar;abhishek;ajay;akshay;bollywood;cinema;media;ileana d'cruzయాక్షన్ మూవీలో చేయాలని ఉంది అంటున్న ఇలియానాయాక్షన్ మూవీలో చేయాలని ఉంది అంటున్న ఇలియానాILLIANA;ajay devgn;akshay kumar;kumaar;abhishek;ajay;akshay;bollywood;cinema;media;ileana d'cruzSun, 25 Apr 2021 13:14:03 GMTఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇలియానా డీక్రూజ్ ఉంది. ఇక్కడ స్టార్‌డమ్‌తో అక్కడ కూడా మంచి ఆఫర్లు పట్టేయొచ్చని ఇలియానా అనుకుంది. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఇక బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయినట్లే అనుకుంది. ఇలియానా టాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోయే సమయానికి ఆమెకు ఇక్కడ చేతినిండా సినిమాలున్నాయి. కానీ వాటన్నింటినీ వదులుకుని మరీ బాలీవుడ్ చెక్కేసింది. కానీ విధి అడ్డం తిరిగి ఆ తర్వాత అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ.. అవకాశాలు మాత్రం అనుకున్నట్లు రాలేదు. దీంతో ఆమె ఫేడ్ అవుట్ అయిపోయింది.

ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రేమలో పడిందీ అమ్మడు. కొంత కాలం తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో మునిగి తేలిన ఎందుకో అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మధ్య మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తనకు కలిసొచ్చిన టాలీవుడ్‌‌పై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు సీనియర్ హీరోలైన అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ సరసన నటించిన ఇల్లీ బేబీ.. తాజాగా అభిషేక్ బచ్చన్‌ భార్యగా.. బిగ్ బుల్ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలో ఓ పెద్ద ఛాన్స్ కొట్టేసింది.

ఈ క్రమంలోనే ఇలియానా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను వరుస సినిమాలు చేయలేకపోవడానికి గల కారణాన్ని ఈ పోస్ట్ ద్వారా వివరించింది ఇల్లీ బేబీ. రెగ్యులర్ సినిమాలు తనకు నచ్చవని.. బలమైన కథ, తన క్యారెక్టర్‌కి ప్రత్యేకత ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నానని ఆ పోస్ట్‌లో ఇలియానా చెప్పుకొచ్చింది. ఈ కారణంగా ఇప్పటి వరకు బాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేశానని అందులో పేర్కొంది. అలాగే యాక్షన్ కథాంశంతో తెరకెక్కే సినిమాలో ఫైట్స్ సీక్వెన్స్‌లో నటించాలని ఉందని, అలాంటి సినిమా అవకాశం వస్తే అస్సలు వదులుకోనని ఇలియానా అనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలే సినిమాలు తక్కువగా ఉన్నాయి.. ఇంకా ఇలాంటి పోస్టులు అవసరమా ఇల్లీ బేబీ అంటు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: కోవిడ్‌ను మ‌హిళే ముందుగా జ‌యిస్తారా... రీజ‌న్ ఇదే ?

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>