MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naag7a343199-fc45-459e-bfa8-b652d222db0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naag7a343199-fc45-459e-bfa8-b652d222db0e-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించిన నాగార్జున తన సత్తా చాటుకున్నారు. తండ్రి లాగానే రొమాంటిక్ కింగ్ గా నాగ్ పేరు నిలబెట్టుకున్నారు. అలాగే భక్తి పాత్రలకు కూడా తాను సరిసాటి అనిపించుకున్నారు. ఒక్కసారి కెరీర్ వెనక్కి వెళ్ళి చూస్తే బ్లాక్ బస్టర్లే కాదు మంచి సినిమాలు కూడా నాగ్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. naag;ntr;nagarjuna akkineni;shiva;nageshwara rao akkineni;ramu;cinema;telugu;television;king;hindi;lord siva;king 1;romantic;fatherనాగ్ కి నచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ?నాగ్ కి నచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ?naag;ntr;nagarjuna akkineni;shiva;nageshwara rao akkineni;ramu;cinema;telugu;television;king;hindi;lord siva;king 1;romantic;fatherSun, 25 Apr 2021 12:00:00 GMTఅక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించిన నాగార్జున తన సత్తా చాటుకున్నారు. తండ్రి లాగానే రొమాంటిక్ కింగ్ గా నాగ్ పేరు నిలబెట్టుకున్నారు. అలాగే భక్తి పాత్రలకు కూడా తాను సరిసాటి అనిపించుకున్నారు. ఒక్కసారి కెరీర్ వెనక్కి వెళ్ళి చూస్తే బ్లాక్ బస్టర్లే కాదు మంచి సినిమాలు కూడా నాగ్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఒక టీవీ షోకి వచ్చిన నాగార్జున తన మనసులో మాటలను అక్కడ పంచుకున్నారు. తనకు తెలుగులో ఇష్టమైన సినిమా ఏంటో కూడా నాగ్ చెప్పేశారు. ఆల్ టైమ్  హిట్ గా నిలిచిన  మాయాబజార్ తనకు ఎంతో ఇష్టమైన మూవీ అని నాగ్ పేర్కొనడం విశేషం. మాయాబజార్ ఎన్ని సార్లు చూసినా తనివి తీరని ఆనందం కలుగుతుందని కూడా నాగ్ అన్నారు. ఈ మూవీ ఒక క్లాసిక్ అందులో ప్రతీ పాత్ర అద్భుతం. కాలాలు ఎన్ని మారినా కూడా ఎప్పటికీ చెరిగిపోని మధురానుభూతిగా మాయాబజార్ నిలుస్తుంది అని నాగ్ చెప్పారు.

ఇక ఆయనకు సీనియర్ ఎన్టీయార్ నటించిన అడవి రాముడు మూవీ కూడా చాలా ఇష్టమట. ఈ మూవీ కమర్షియల్ ఫార్మెట్ లో తీసినా కూడా చాలా చక్కని సినిమా, ఎపుడు చూసినా బోర్ కొట్టదని కూడా నాగ్ అంటున్నారు. ఇక హిందీ సినిమాల్లో తనకు అప్పటికీ ఇప్పటికీ నచ్చిన ఏకైక సినిమా షోలే అని నాగ్ చెప్పారు. తను విద్యార్ధి దశలో ఉన్నపుడు షోలే రిలీజ్ అయితే ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తు లేదని నాగ్ అంటున్నారు. మొత్తానికి నాగ్ కి నచ్చిన సినిమాలు ఈ మూడూ జనాలకు కూడా ఎప్పటికీ హాట్ ఫేవరేట్లు కావడం విశేషమే మరి. ఇక తన సినిమాల్లో నచ్చినవి చెప్పమంటే శివ, మనం, సోగ్గాడే చిన్ని నాయన అంటూ నాగ్ చెప్పడం విశేషం. మొత్తానికి నాగ్ టేస్ట్ కూడా క్లాస్ గా ఉండడం విశేషం.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ విషయంలో జగన్ పట్టుదల చూపిస్తే నష్టపోతారా...?

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>