PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgఅయితే.. బోడే ప్ర‌సాద్‌పై కాల్ మ‌నీ ఆరోప‌ణ‌లు రావ‌డంతోపాటు.. జ‌గ‌న్ సునామీ.. బంద‌రు రోడ్డు విస్త‌ర‌ణ కార‌ణంగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు, వ్యాపారాలు ఎక్కువ‌గా న‌ష్ట‌పోవ‌డంతోపాటు.. టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వంటివి పెన‌మ‌లూరులో టీడీపీ ప‌రాజయానికి కార‌ణంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అయితే.. ఇప్పుడు అదే సీన్‌.. అవే స‌మ‌స్య‌లు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి. ఎక్క‌డా అభివృద్ధి లేదు.. ఎక్క‌డాtdp;congress;minister;tsunami;letter;tdp;partyకృష్ణాలో మారిన రాజ‌కీయం... టీడీపీకి ప్ల‌స్సేనా ?కృష్ణాలో మారిన రాజ‌కీయం... టీడీపీకి ప్ల‌స్సేనా ?tdp;congress;minister;tsunami;letter;tdp;partySun, 25 Apr 2021 10:47:13 GMTఅవును! కొంచెం క‌ష్ట‌ప‌డితే.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సునాయాసంగా గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే.. కృష్ణాజిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 2014 ఎన్నిక‌ల్లో బోడే ప్ర‌సాద్ ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకు న్నారు. ‌వాస్త‌వానికి కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెల‌వ‌డం వెనుక‌.. ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి.. రాజ‌కీయంగా ప్రాధాన్యం , అభివృద్ధి లేక‌పోవ‌డం వంటివి కార‌ణాలుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు టీడీపీకి ప‌ట్టంక‌ట్టారు.

అయితే.. బోడే ప్ర‌సాద్‌పై కాల్ మ‌నీ ఆరోప‌ణ‌లు రావ‌డంతోపాటు.. జ‌గ‌న్ సునామీ.. బంద‌రు రోడ్డు విస్త‌ర‌ణ కార‌ణంగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు, వ్యాపారాలు ఎక్కువ‌గా న‌ష్ట‌పోవ‌డంతోపాటు.. టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వంటివి పెన‌మ‌లూరులో టీడీపీ ప‌రాజయానికి కార‌ణంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అయితే.. ఇప్పుడు అదే సీన్‌.. అవే స‌మ‌స్య‌లు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి. ఎక్క‌డా అభివృద్ధి లేదు.. ఎక్క‌డా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకుంటున్న తీరిక కూడా ఆయ‌న‌కు లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

దీంతో ఇప్పుడు ప్ర‌జ‌ల మూడ్ మారిపోయింది. ఇక‌, ఇక్క‌డ కాంగ్రెస్ కానీ, వామ‌ప‌క్షాలు కానీ.. బ‌లంగా లేక ‌పోవ‌డంతో అంద‌రి చూపూ మ‌ళ్లీ టీడీపీవైపు మ‌ళ్లింది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు టీడీపీ నేత‌లు కొద్దిగా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం మాత్రం క‌నిపిస్తోంది. రోడ్డు విస్త‌ర‌ణలో న‌ష్ట‌పోయిన వారికి హామీ ఇవ్వ‌డం, గ‌తంలో తాము చేసిన అభివృద్ధిని చూపించ‌డంతోపాటు.. గ్రూపు రాజ‌కీయాల‌కు తావులేకుండా అంద‌రినీ క‌లుపుకొని పోయేలా రాజ‌కీయ తంత్రం ప్ర‌యోగిస్తే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌ళ్లీ టీడీపీకి ప‌ట్టం క‌ట్టేందుకు రెడీగా ఉన్నార‌నేది మాత్రం ఇప్పుడున్న వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి స్ప‌ష్టం చేస్తోంది. మ‌రి దీనిని గ్ర‌హించి పార్టీ పుంజుకుంటుందో.. లేక అలానే ఉంటుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: మ‌రోసారి ఎమ‌ర్జెన్సీ?

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>