MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya-3765e674-3c28-4a61-97db-58c8a99f04d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya-3765e674-3c28-4a61-97db-58c8a99f04d9-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చేయి దాటిపోవడంతో టాప్ యంగ్ హీరోలు అంతా తమ సినిమా షూటింగ్ లను రద్దు చేసుకుని తమ ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. అయితే ఈ పరిస్థితులను లెక్క చేయకుండా నాగచైతన్య చేసిన సాహసం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో నాగచైతన్య ‘థాంక్యూ’ అన్న మూవీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈమూవీలో చైతన్య మహేష్ బాబు వీరాభిమానిగా నటిస్తూ అతడి కటౌట్ లకు పాలాభిషేకం చేసే అభిమానిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించినNAGACHAITANYA;;mahesh;prabhas;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;nageshwara rao akkineni;sriram;vikram;visakhapatnam;hyderabad;italy;cinema;vishakapatnam;chaitanya 1కరోనా పరిస్థితులతో పోరాటం చేస్తున్న నాగచైతన్య !కరోనా పరిస్థితులతో పోరాటం చేస్తున్న నాగచైతన్య !NAGACHAITANYA;;mahesh;prabhas;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;nageshwara rao akkineni;sriram;vikram;visakhapatnam;hyderabad;italy;cinema;vishakapatnam;chaitanya 1Sun, 25 Apr 2021 11:25:00 GMTకరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చేయి దాటిపోవడంతో టాప్ యంగ్ హీరోలు అంతా తమ సినిమా షూటింగ్ లను రద్దు చేసుకుని తమ ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. అయితే ఈ పరిస్థితులను లెక్క చేయకుండా నాగచైతన్య చేసిన సాహసం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో నాగచైతన్య ‘థాంక్యూ’ అన్న మూవీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.


ఈమూవీలో చైతన్య మహేష్ బాబు వీరాభిమానిగా నటిస్తూ అతడి కటౌట్ లకు పాలాభిషేకం చేసే అభిమానిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే వైజాగ్ లో పూర్తి అయింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేసారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల ఈమూవీ ఇటలీ షెడ్యూల్ రద్దు అయింది అన్న ప్రచారం జరిగింది. అయితే జరిగిన వాస్తవం వేరు.


ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పరిస్థుతులు కొనసాగుతూ ఉన్నా వాటిని లెక్క చేయకుండా చైతన్య ప్రోత్సాహంతో ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ను ధైర్యంగా ఇటలీలో ప్రారంభించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్న పీసీ శ్రీరామ్ షూటింగ్ లొకేషన్స్ తీసిన ఫోటోలను నాగచైతన్య విక్రమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ పాండమిక్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా షూట్ చేస్తున్నారో వివరించారు.


ఇటలీలో 15 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రభాస్ లాంటి టాప్ యంగ్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఫారిన్ షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకుని ఇండియాలోనే ముఖ్యంగా హైదరాబాద్ దాటకుండా తమ సినిమాల షూటింగ్ లలో మార్పులు చేస్తే నాగచైతన్య మాత్రం పరిస్థితులను ఎదిరిస్తూ అనుకున్న విధంగా తన సినిమాను  ఇటలీలో షూటింగ్ కొనసాగించడం అతడి డేరింగ్ నేచర్ ను బయటపెడుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌చారానికి కేటీఆర్ దూరం.. గెలుపు బాధ్య‌త‌లు వారివే!

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>